HERES HOW TO PUT ONE TOGETHER FOR USE WITH YOUR NEW YEAR MK
New Year Money Saving Tips: కొత్త సంవత్సరంలో ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఇలా జాగ్రత్త పడండి..
ప్రతీకాత్మకచిత్రం
వేతన జీవులు తరచూ చెప్పే కంప్లైంట్ ఏంటంటే... నెలలో మొదటి 10 రోజుల్లోనే వచ్చిన జీతం ముగుస్తుందని, మిగిలిన 20 రోజులు అతికష్టం మీద గడిచిపోతుందని చాలా మంది చెబుతుంటారు. ఇంతటి ద్రవ్యోల్బణంలో డబ్బును ఎలా ఆదా చేసుకోవాలో తెలుసుకుందాం.
New Year Money Saving Tips: కొత్త సంవత్సరం వస్తుందంటే, ఎన్నో రిజల్యూషన్స్ తీసుకుంటాం అందులో ముఖ్యమైనది. ఆర్థికంగా మనం కొత్త సంవత్సరం టార్గెట్స్ పెట్టుకోవడం చాలా అవసరం. విద్య, వ్యాపారం, వైద్యం ఇలా అన్ని రకాల అవసరాలకు మనకు డబ్బు చాలా అవసరం పడుతుంది. ప్రస్తుత పాండెమిక్ సమయంలో ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వేతన జీవులు తరచూ చెప్పే కంప్లైంట్ ఏంటంటే... నెలలో మొదటి 10 రోజుల్లోనే వచ్చిన జీతం ముగుస్తుందని, మిగిలిన 20 రోజులు అతికష్టం మీద గడిచిపోతుందని చాలా మంది చెబుతుంటారు. ఇంతటి ద్రవ్యోల్బణంలో డబ్బును ఎలా ఆదా చేసుకోవాలో తెలుసుకుందాం. కొత్త క్యాలెండర్‌తో, కొత్త సంవత్సరంలో జరిగన పొరపాట్లు పునరావృతం కాకుండా కొత్త మార్గంలో మన పొదుపు ప్రణాళికను ప్రారంభించాలి.
కొత్త సంవత్సరం ప్రారంభమైతే కచ్చితంగా జీతం కూడా జేబులోకి వస్తుంది. కొత్త సంవత్సరంలో మీరు కొత్త తరహాలో పొదుపు చేయాలని కొత్త రిజల్యూషన్‌ని తీసుకోండి. ఆ రిజల్యూషన్‌ని నెరవేర్చడం ద్వారా, బ్యాంక్‌లో లేదా మ్యూచువల్ ఫండ్లలో ఏ సౌలభ్యం ఉన్నా ఆదా చేయడం ప్రారంభించండి. సరైన పొదుపు మార్గం ఏమిటంటే, జీతం వచ్చిన వెంటనే, ముందుగా అందులో కొంత భాగాన్ని పొదుపుకు బదిలీ చేయండి. ఖర్చులన్నీ పోను మిగులుతున్న డబ్బు ఆదా అవుతుంది. కొత్త సంవత్సరం నుంచే దీన్ని ఓ అలవాటుగా మార్చుకోండి. ముందుగా ఆదా చేసి, ఆ తర్వాత మిగిలిన డబ్బుతో నెల మొత్తం ఖర్చులను నిర్వహించండి.
ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక కొత్త అలవాటు చేసుకోండి. డబ్బు సంపాదన తక్కువగా ఉన్నప్పటికీ, పొదుపు చేసి ఏం లాభం అని ఆలోచించకండి. పొదుపు అనేది పెద్దది లేదా చిన్నది కాదు. ఎంత పొదుపు చేసిన అది పొదుపు మాత్రమే అని గుర్తుంచుకోండి. కొద్ది కొద్దిగా పొదుపు చేయడం ద్వారా కూడా భారీ మొత్తాన్ని సేకరించవచ్చు. పొదుపు అలవాటుతో పాటు క్రమశిక్షణ కూడా అలవర్చుకోవాలి. మీరు పొదుపు చేస్తున్న డబ్బును దుబారా చేయడం లాంటి ఎప్పుడూ తప్పు చేయవద్దు.
ఖర్చుల గుర్తింపు..
ఖర్చులు రెండు రకాలుగా ఉంటాయి. నిత్యావసరాలుపై చేసే ఖర్చులు. మన కోరికలు తీర్చుకోవడం కోసం చేసే ఖర్చులు. అయితే మన అవసరాలు ఏవో , మన కోరికలు ఏవో ముందుగా గుర్తించాలి. కానీ జీవితంలో పెద్ద లక్ష్యాలను సాధించడానికి కొన్ని కోరికలను కూడా స్కిప్ చేయడం అవసరం.
అత్యవసర నిధిని నిర్మించండి
కొత్త సంవత్సరంలో అత్యవసర నిధిని కూడా సిద్ధం చేసుకోండి. ఈ ఫండ్ కనీసం మూడు నెలల ఇంటి ఖర్చులకు సమానంగా ఉండాలి. మీ ఇంటి ఖర్చులు నెలకు రూ. 50,000 అయితే, రూ. 1.5 లక్షల అత్యవసర నిధిని సృష్టించి, బ్యాంకులో భద్రంగా ఉంచండి. కుటుంబంలో ఏదైనా అనారోగ్యం, ఆర్థిక నష్టం లేదా వ్యాపారంపై చెడు ప్రభావం ఏర్పడినప్పుడు ఈ ఫండ్ ఉపయోగపడుతుంది. మీ పొదుపుపై ఎటువంటి ప్రభావం ఉండదు.
పెట్టుబడి
మీరు పొదుపు చేయడం ప్రారంభించినట్లయితే, ఆ డబ్బును సరైన పెట్టుబడి ప్రారంభించండి. మీరు మ్యూచువల్ ఫండ్, రికరింగ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్సేవింగ్స్ స్కీమ్ మొదలైన పెట్టుబడి కోసం ఏదైనా ఎంపికను ఎంచుకోవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని పథకాలను అధ్యయనం చేయండి. దీని కోసం నిపుణుల సలహా తీసుకోవచ్చు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.