హోమ్ /వార్తలు /బిజినెస్ /

Insurance Claims: ప్రయాణికులు సీటు బెల్ట్ ధరించకపోతే చర్యలు..? ఇన్సూరెన్స్‌ క్లెయిమ్స్‌పై పడే ప్రభావం ఇదే..

Insurance Claims: ప్రయాణికులు సీటు బెల్ట్ ధరించకపోతే చర్యలు..? ఇన్సూరెన్స్‌ క్లెయిమ్స్‌పై పడే ప్రభావం ఇదే..

(Photo: Global NCAP)

(Photo: Global NCAP)

Insurance Claims: సీటు బెల్టు పెట్టుకోని సందర్భంలో ప్రమాదాలు జరిగితే, ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ చెల్లించేటప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై నిపుణుల సూచనలు పరిశీలిద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (Cyrus Mistri) రోడ్డు ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో.. సీటు బెల్ట్ పెట్టుకోని ప్రయాణికులకు త్వరలో జరిమానా విధిస్తామని తెలిపారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari). ప్రయాణికులకు విధించే జరిమానాను వివరిస్తూ మరో మూడు రోజుల్లో ప్రభుత్వం (Central Government) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు వెనుక సీటులో కూర్చున్న ప్రయాణికులు (Passengers) కూడా సీటు బెల్ట్ (Seat Belt) ధరించడానికి సంబంధించిన నిబంధనలను కఠినంగా అమలు చేయాలని గడ్కరీ ఆదేశించారు. అయితే సీటు బెల్టు పెట్టుకోని సందర్భంలో ప్రమాదాలు జరిగితే, ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ చెల్లించేటప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

* పరిహారం తగ్గుతుందా?

థర్డ్-పార్టీ(TP) ఇన్సూరెన్స్‌ విషయంలో పాలసీదారులు సీటు బెల్ట్ ధరించకపోతే.. ఇన్సూరెన్స్‌ కంపెనీ ఎదుటి వారికి దక్కాల్సిన పరిహారాన్ని తగ్గించడానికి సీటు బెల్ట్‌ నిబంధనను ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు బజాజ్ క్యాపిటల్ లిమిటెడ్ ఛైర్మన్‌, ఎండీ సంజీవ్ బజాజ్. థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ అనేది కారు యజమానులకు తప్పనిసరి కవర్. ఇది థర్డ్ పార్టీ వాహనం , ఆస్తి, శారీరక గాయం, వైకల్యం లేదా మరణం సంభవించినప్పుడు కవరేజీని అందిస్తుంది.

* అలా తిరస్కరించవు

సీటు బెల్టు ధరించడం కారణంగా ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌పై కనిపించే ప్రభావం గురించి సీఎన్‌బీసీ ఏజెన్సీతో మాట్లాడారు ప్రొబస్ ఇన్సూరెన్స్ బ్రోకర్ డైరెక్టర్ రాకేష్ గోయల్. ప్రయాణికుడు సీటు బెల్ట్ ధరించలేదని ఏ ఇన్సూరెన్స్‌ కంపెనీ క్లెయిమ్‌లను తిరస్కరించదని రాకేష్ చెప్పారు. అయితే, క్లెయిమ్‌లు కోర్టులకు లేదా ట్రిబ్యునల్‌కు వెళ్తే చివరికి అందే పరిహారంలో కొంత తగ్గే అవకాశం ఉందన్నారు.

ఏదైనా రోడ్డు ప్రమాదాలు, ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లకి సంబంధించిన కేసు కోర్టు ముందుకు వస్తే, నిర్ణయం తీసుకునే సమయంలో కోర్టు సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్‌ను పరిశీలించవచ్చు. అన్ని సందర్భాలలో సీటు బెల్ట్‌లు ధరించడాన్ని 2002లో తప్పనిసరి చేసిన నిబంధనను ఉల్లంఘించినట్లు భావించి పరిహారంలో కోత విధించవచ్చని పేర్కొన్నారు.

* రూ.1000 జరిమానా

సాధారణంగా చాలా మంది ఇండియాలో రెండు లేదా మూడో వరుసలో కూర్చున్న వారు సీటు బెల్ట్‌ ధరించరు. వాస్తవానికి 2002 అక్టోబరు నుంచి వెనుక సీటులో కూర్చున్నవారు కూడా సీటు బెల్ట్‌ పెట్టుకోవడాన్ని తప్పనిసరి చేశారనే విషయంపై చాలా మందికి అవగాహన లేదు. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్(CMVR)లోని రూల్ 138(3) ప్రకారం.. కారులో వెనుక వరుసల్లోని సీటుల్లో కూర్చుని సీటు బెల్ట్‌ ధరించని ప్రయాణికులకు రూ.1,000 జరిమానా విధించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : రూ.30 వేలకే తులం బంగారం.. కొంటే కలిగే లాభాలివే.. అదొక్కటే మైనస్!

సీటు బెల్ట్‌ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలతో తీవ్రంగా గాయపడే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో సీటు బెల్ట్‌ ధరించిన ప్రయాణికులు ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడిన ఘటనలు ఉన్నాయి. అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సీటు బెల్ట్‌ ధరించలేదని తెలిస్తే వారి ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌పై కూడా ప్రభావం కనిపించవచ్చు.

* రూల్స్ పాటించాలి.. ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి

ప్రమాదాలు దురదృష్టకరం అయినప్పటికీ, తక్కువ వేగంతో, సురక్షితమైన ప్రదేశాలలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా ప్రమాదాలు జరగవచ్చు. అన్ని ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, సరైన ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవడం చాలా ముఖ్యం. పర్సనల్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ వైకల్యాలు, ప్రమాదవశాత్తు మరణం రెండింటికి కవరేజీని అందిస్తుంది. ఇది ఏకకాలంలో ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. కీలక సమయంలో వారి భారాన్ని తొలగిస్తుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Airbags, Car accident, Insurance, Nitin Gadkari, Personal Finance

ఉత్తమ కథలు