Electric Vehicles: విద్యుత్తు వాహనాల వల్ల పర్యావరణానికి మంచిదంటున్నారు? ఎంతవరకు నిజం?

(ప్రతీకాత్మక చిత్రం)

2019లో లీజ్‌ రీసెర్చర్‌ డేమియన్‌ ఎర్నస్ట్‌ విశ్వద్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం విద్యుత్తు వాహనాలు ఏడు లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత... గాసోలిన్‌ వాహనాల కంటే ఎక్కువ కార్బన్‌ డయాక్సైడ్‌ను వెలువరిస్తాయట.

  • Share this:
పెట్రోల్‌, డీజిల్‌ కార్ల కంటే విద్యుత్తు ఆధారిత కార్లను వినియోగిస్తే ప్రకృతికి మంచిది అని చాలామంది చెబుతున్నారు. గాసోలిన్‌ (పెట్రోలు, డీజిల్‌) కార్ల వినియోగించేటప్పుడు వాటి నుండి హానికారక కార్బన్‌ బయటకు రావాలంటే 21వేలకుపైగా కిలోమీటర్లు ప్రయాణించాలట. దానికి బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌ అని పిలుస్తారు. అయితే విద్యుత్తు కార్ల నుండి కర్బన్‌ ఉద్గారాలు రావడానికి ఎంత కాలం పడుతుంది, ఎన్ని రోజులకు బ్రేక్‌ ఈవెన్‌ వస్తుంది. ఇప్పుడు ఆటో మొబైల్‌ రంగంలో ఇదే చర్చ. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం!

జీవిత కాలంలో వాహనాల నుండి వచ్చే ఉద్గారాల గురించి ఇటీవల రాయిటర్స్ ఓ పరిశోధన నిర్వహించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా హరిత రవాణాకు ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఈ-కార్ల గురించి అంతర్జాతీయంగా వస్తున్న నివేదికలు పరిశీలించదగ్గవే. ఆర్గోన్‌కి చెందిన గ్రీన్‌ హౌస్‌ గ్యాసెస్‌, రెగ్యులేటడ్‌ ఎమిషన్స్‌ అండ్ ఎనర్జీ యూజ్‌ ఇన్‌ టెక్నాలజీస్‌ (గ్రీట్‌) మోడల్‌ను యూ.ఎస్‌ పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ (ఈపీఏ) వాడుతోంది. చికాగోలోని ఆర్గోన్‌ నేషనల్‌ లేబొరేటరీ ఈ మోడల్‌ను రూపొందించింది. దాంతోపాటు కాలిఫోర్నియా ఎయిర్‌ రిసోర్సెస్‌ బోర్డ్‌లో వాడుతున్నారు. ఈ రెండు యూఎస్‌లో విద్యుత్తు వాహనాల ఉద్గారాలను రెగ్యులేట్‌ చేస్తున్న సంస్థలు.

రాయిటర్స్‌ పరిశోధన ప్రకారం మిడ్‌ సైజ్‌ విద్యుత్తు వాహనం ఒకమైలుకు 47 గ్రాములు కార్బన్‌ డయాక్సైడ్‌ను జనరేట్‌ చేస్తుంది. అయితే ఇది ఎక్స్‌ట్రాక్షన్‌, ప్రొడక్షన్‌ సమయంలో మాత్రమే. కస్టమర్‌ దగ్గరకు చేరేటప్పటికి 8.1 మిలియన్‌ గ్రాములు జనరేట్‌ అవుతుంది. అదే గాసోలిన్‌ వాహనం అయితే మైలుకి 32 గ్రాములు జనరేట్‌ చేస్తుంది. వినియోగదారుడి దగ్గరకు వెళ్లేసరికి 5.5 మిలియన్‌ గ్రాములు ఉంటుంది. ఒకవేళ విద్యుత్తు వాహనాలు బొగ్గు ఆధారిత విద్యుత్తు తయారీ నుండి వచ్చిన విద్యుత్తును వాడితే అధింగా మరో 4.1 గ్రాముల కార్బన్‌ను జనరేట్‌ చేస్తుంది. అదే గాసోలిన్‌ కారు అయితే 4.6 మిలియన్‌ గ్రాములు కార్బన్‌ ఉత్పత్తి అవుతుంది.

ఆర్గోన్‌ రూపొందించిన గ్రీట్‌ ఫార్ములా ఈపీఏ ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌ను సిద్ధం చేసింది. దాని ద్వారా యూఎస్‌ వినియోగదారులు విద్యుత్తు వాహనాల నుండి వచ్చే ఉద్గారాల గురించి తెలుసుకోవచ్చట. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ అనే రీసెర్చ్‌ గ్రూపు నిర్వహించిన సర్వేల్లో కూడా ఇదే తరహా వివరాలు వెల్లడించింది. వీల్‌ టు వీల్‌ విధానంలో ఒక్కో విద్యుత్తు వాహనం కర్బన ఉద్గారం బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌ 15 వేల నుండి 20 వేల మధ్య ఉంటుంది. అయితే అది ఆ వాహనం నడిచే ప్రాంతం, దేశం మీద ఆధార పడి ఉంటుంది. విద్యుత్తు వాహనాలకు మారడం మంచిది అని ఆ సంస్థ సూచిస్తోంది. దాని వల్ల లాంగ్‌ టర్మ్‌ ఉపయోగాలు ఉంటాయంటోంది.

2019లో లీజ్‌ రీసెర్చర్‌ డేమియన్‌ ఎర్నస్ట్‌ విశ్వద్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం విద్యుత్తు వాహనాలు ఏడు లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత... గాసోలిన్‌ వాహనాల కంటే ఎక్కువ కార్బన్‌ డయాక్సైడ్‌ను వెలువరిస్తాయట. ఆ తర్వాత దానిని 67 వేల నుండి 1,51,000 కి.మీలకు తగ్గించారు. మరికొన్ని సంస్థలు అయితే గాసోలిన్‌ వాహనాల కంటే విద్యుత్తు వాహనాలు క్లీనర్‌, గ్రీనర్‌గా ఉండాల్సిన అవసరం ఏముంది అంటున్నారు.

ఇది క్లిక్ చూసి చూడండి..

ఇది క్లిక్ చూసి చూడండి..
Published by:Krishna Adithya
First published: