హోమ్ /వార్తలు /బిజినెస్ /

HDFC Life: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నుంచి అదిరిపోయే కొత్త పాలసీ.. బోలెడు ప్రయోజనాలు..

HDFC Life: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నుంచి అదిరిపోయే కొత్త పాలసీ.. బోలెడు ప్రయోజనాలు..

HDFC Life

HDFC Life

HDFC Life: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ మరో కొత్త టర్మ్ ప్లాన్‌ను ప్రకటించింది. క్లిక్ టూ ప్రొటెక్ట్ (Click2Protect) సూపర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని సంస్థ లాంచ్‌ చేసింది. బోలెడు ప్రయోజనాలు ఈ పాలసీ సొంతం. అవెంటో ఓ లుక్కేద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్‌ (Insurance Products)లో టర్మ్ పాలసీలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. దీంతో కంపెనీలన్నీ ఈ విభాగంలో సరికొత్త పాలసీలను లాంచ్ చేస్తుంటాయి. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ (HDFC Life Insurance) మరో కొత్త టర్మ్ ప్లాన్‌ను ప్రకటించింది. క్లిక్ టూ ప్రొటెక్ట్ (Click2Protect) సూపర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని సంస్థ లాంచ్‌ చేసింది. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, పర్సనల్, ప్యూర్ రిస్క్ ప్రీమియం/ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. దీని ప్రత్యేకతలు, ప్లాన్ బెనిఫిట్స్ చూద్దాం.

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ కంపెనీ కస్టమర్ల ప్రయోజనాలు, అవసరాల ఆధారంగా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. తాజాగా తీసుకొచ్చిన Click2Protect Super టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌.. ప్రొటెక్షన్‌ అవసరాలకు అనుగుణంగా కస్టమైజేషన్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తుంది. అలాగే పాలసీదారులు ఎంచుకున్న ప్రయోజనాలు/ప్లాన్ ఆప్షన్‌లకు మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

* ప్రయోజనాలు

Click2Protect Super టర్మ్ ఇన్సూరెన్స్ లైఫ్ కవర్‌ను మార్చడం, పాలసీ వ్యవధిని పొడిగించడం, ప్రమాదవశాత్తు మరణం, ప్రాణాంతక అనారోగ్యానికి కవరేజీని పొందడం వంటి సౌలభ్యాలను అందిస్తుంది. ఈ స్కీమ్ కుటుంబానికి సమగ్ర ఆర్థిక రక్షణను అందిస్తుంది. లైఫ్, లైఫ్ ప్లస్, లైఫ్ గోల్ అనే మూడు ప్లాన్ ఆప్షన్‌ల నుంచి పాలసీ హోల్డర్‌లు తమ అవసరాలకు సరిపోయే కవర్‌ను ఎంచుకోవచ్చు. ఈ మూడు ప్లాన్‌ ఆప్షన్‌ల గురించి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఓ ప్రకటనలో వివరించింది. ఆ ఆప్షన్‌ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

* లైఫ్‌ ఆప్షన్‌ (Life Option)

ఇది ఎంచుకున్న కవరేజ్ టర్మ్‌కు లైఫ్ కవర్‌ని అందిస్తుంది. దీంతో ఆధారపడిన వారి భవిష్యత్తుకు రక్షణ లభిస్తుంది. ఈ స్మార్ట్ ప్లాన్ ఆప్షన్‌ ఇన్‌బిల్ట్‌- బెనిఫిట్ టెర్మినల్‌ ఇల్నెస్‌ కవర్‌తో వస్తుంది. కస్టమర్లు దూరమైనప్పుడు కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు కవర్ మొత్తాన్ని పెంచుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఆప్షన్‌ ప్రధాన ప్రయోజనాలు ఏంటంటే.. డెత్ బెనిఫిట్‌ని 200 శాతం వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ఈ ప్లాన్‌తో ప్రీమియం మినహాయింపుతో పాటు స్మార్ట్ ఎగ్జిట్ ఆప్షన్ ద్వారా పాలసీ రద్దు సమయంలో చెల్లించిన బేస్ ప్రీమియంను తిరిగి పొందే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి కోసం అదనపు కవర్‌ని ఎంచుకోనే అవకాశం ఉంది. రిటర్న్‌ ఆఫ్‌ ప్రీమియం ఆప్షన్‌ కూడా ఉంది. అదే విధంగా కస్టమర్లు పూర్తి, శాశ్వత వైకల్యంపై ప్రీమియం మినహాయింపు అందుకోవచ్చు. 80 సంవత్సరాల వరకు ప్రాణాంతక అనారోగ్యం నిర్ధారణపై డెత్‌ బెనిఫిట్స్‌ అందుతాయి. వాయిదాలలో డెత్ బెనిఫిట్ పొందే సదుపాయం ఉంది.

ఇది కూడా చదవండి : ఇండియాలో ఈ-రిక్షాల కోసం హోండా బ్యాటరీ షేరింగ్ సర్వీస్‌.. ఇక, ఆ సమస్య తీరినట్టే..

* లైఫ్‌ గోల్‌ (Life Goal)

ఈ ఆప్షన్‌ కోరుకున్న కాలానికి లైఫ్ కవర్‌ని మార్చుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. దీంతో వాంఛనీయ కవరేజీని నిర్ధారిస్తుంది. ఏదైనా బాధ్యతలు లేదా ఖర్చుల నుంచి ప్రియమైన వారిని కాపాడుతుందని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ తెలిపింది. దీని ద్వారా పూర్తి, శాశ్వత వైకల్యంపై ప్రీమియం మినహాయింపు పొందవచ్చు. వాయిదాలలో డెత్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది.

* లైఫ్ ప్లస్ (Life Plus)

లైఫ్ కవర్‌తో పాటు, ఈ ఆప్షన్ ప్రమాదవశాత్తు మరణం, ప్రాణాంతక అనారోగ్యానికి మెరుగైన కవర్‌ అందిస్తుంది. తద్వారా జీవితానికి సమగ్ర రక్షణ లభిస్తుందని కంపెనీ తెలిపింది. దీనిలో పాలసీ వ్యవధిలో ప్రమాదవశాత్తు మరణిస్తే అదనంగా చెల్లించాల్సిన మొత్తానికి హామీ ఉంటుంది. అదే విధంగా జీవిత భాగస్వామి కోసం అదనపు కవర్‌ని ఎంచుకోవడానికి అవకాశం ఉంది. క్రిటికల్ ఇల్నెస్‌ నిర్ధారణపై ప్రీమియం మినహాయింపు పొందవచ్చు. రిటర్న్‌ ఆఫ్‌ ప్రీమియం సదుపాయం కూడా పొందవచ్చు.

స్మార్ట్ ఎగ్జిట్ ఆప్షన్ ద్వారా పాలసీ రద్దు సమయంలో చెల్లించిన బేస్ ప్రీమియంను తిరిగి పొందే ఆప్షన్‌ ఉంది. 80 సంవత్సరాల వయస్సు వరకు, ప్రాణాంతక వ్యాధుల నిర్ధారణపై డెత్ బెనిఫిట్ అందిస్తుంది. వాయిదాలలో డెత్ బెనిఫిట్ పొందవచ్చు. మొత్తం, శాశ్వత వైకల్యంపై ప్రీమియం మినహాయింపు ఉంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: HDFC bank, HDFC Life, Life Insurance, Personal Finance

ఉత్తమ కథలు