హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Pension Scheme: పాత పెన్షన్‌ స్కీమ్‌ కంటే కొత్త పెన్షన్‌ స్కీమ్‌ బెటర్‌.. రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన ఏంటి?

New Pension Scheme: పాత పెన్షన్‌ స్కీమ్‌ కంటే కొత్త పెన్షన్‌ స్కీమ్‌ బెటర్‌.. రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన ఏంటి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

New Pension Scheme: ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు మార్పులు చేస్తున్నాయి. చాలా రాష్ట్రాలు ఇప్పుడు పాత పెన్షన్ స్కీమ్ (OPS) అమలు చేయాలని భావిస్తున్నాయి. అయితే కొత్త పెన్షన్ స్కీమ్‌తోనే ఉద్యోగులకు ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ (Pension) విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు మార్పులు చేస్తున్నాయి. చాలా రాష్ట్రాలు ఇప్పుడు పాత పెన్షన్ స్కీమ్ (OPS) అమలు చేయాలని భావిస్తున్నాయి. ఇటీవల పంజాబ్ ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ల తర్వాత ఓపీఎస్‌కు తిరిగి వచ్చిన మూడో రాష్ట్రంగా పంజాబ్ నిలుస్తుంది. కొన్ని ఉద్యోగుల సంఘాలు కూడా పాత విధానానికే ఓటేస్తున్నాయి. అయితే కొత్త పెన్షన్ స్కీమ్‌తోనే ఉద్యోగులకు ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు స్కీమ్స్‌ ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

* పాత పెన్షన్ పథకం(OPS) ఏంటి?

2004 జనవరి 1కి ముందు వర్క్‌ఫోర్స్‌లో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ చెల్లింపులు పాత పెన్షన్ విధానంలో ఉంటాయి. పెన్షన్ చెల్లింపు ఫార్ములా స్థిరంగా ఉంటుంది. అంటే చివరిగా డ్రా చేసిన బేసిక్‌ శాలరీలో 50 శాతం, పదవీ విరమణ సమయంలో డియర్‌నెస్ అలవెన్స్ లేదా చివరి పది నెలల సర్వీస్‌లో సంపాదించిన సగటు వేతనాలు, ఏది ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుందో అది అందుతుంది. దీనికి ఉద్యోగి కనీసం పదేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి.

అయితే డియర్‌నెస్ అలవెన్స్ అనేది ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుందిజ అందువల్ల అది పెరగవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) మాజీ సభ్యుడు విర్జేష్ ఉపాధ్యాయ్ మనీ కంట్రోల్‌తో చెప్పారు. కాబట్టి ప్రభుత్వానికి పెన్షన్ బాధ్యతలు పెరుగుతూనే ఉంటాయి. మరణించిన పింఛనుదారుల కుటుంబ సభ్యులకు కుటుంబ పెన్షన్ అందుతుందని ఆర్థిక సలహా సంస్థ ఫిన్‌ఫిక్స్ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ వ్యవస్థాపకుడు ప్రబ్లీన్ బాజ్‌పాయ్ చెప్పారు.

ఓపీఎస్ కింద ఉద్యోగులు పెన్షన్‌కు కాంట్రిబ్యూట్‌ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వమే ఆ నిధికి కాంట్రిబ్యూట్‌ చేస్తుంది. అయితే హామీ ఇచ్చే చెల్లింపులు, వారి జీతాల నుంచి పెన్షన్‌కు తగ్గింపు, మరణానంతరం వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కారణంగా చాలా మంది ఉద్యోగులు పాత పెన్షన్ విధానాన్ని కోరుకుంటున్నారు.

* నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) రూల్స్

2004 జనవరి 1 తర్వాత వర్క్‌ఫోర్స్‌లో చేరిన ఉద్యోగుల కోసం (సాయుధ దళాలు మినహా) కేంద్రం కొత్త లేదా జాతీయ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తమిళనాడు , పశ్చిమ బెంగాల్ మినహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పాలసీకి మారాయి. వివిధ ప్రభుత్వాల పెన్షన్ బాధ్యతలు పెరుగుతున్నందున ఈ మార్పు అవసరమని, OPS సాధ్యం కాదని, దానిని మళ్లీ అమలు చేయడం మంచిది కాదని లాడర్ 7 ఫైనాన్షియల్ అడ్వైజరీస్ వ్యవస్థాపకుడు సురేష్ సదాగోపాలన్ చెప్పారు.

* NPS ఎలా పని చేస్తుంది?

NPS కింద ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ కార్పస్‌ను రూపొందించడానికి వారి ప్రాథమిక జీతంలో 10 శాతం కాంట్రిబ్యూషన్‌ ఇస్తారు. వారి యజమాని కిట్టీకి 14 శాతం వరకు కాంట్రిబ్యూట్‌ చేస్తారు. కొన్ని నియమాలు సవరించినప్పటికీ స్వచ్ఛంద ప్రాతిపదికన ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కూడా NPS అందుబాటులో ఉంది. ప్రైవేట్ ఉద్యోగుల ఫ్రేమ్‌వర్క్‌తో పోలిస్తే మొత్తం స్ట్రక్చర్‌ ట్రెడిషనల్‌గా ఉన్నప్పటికీ.. వారు మల్టిపుల్‌ అసెట్‌ క్లాసెస్‌- ఈక్విటీ, కార్పొరేట్ డెట్, ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రత్యామ్నాయ ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి ఎంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి : పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉందా? కొత్త రూల్స్ తెలుసుకోండి

ఉదాహరణకు ఈక్విటీలకు గరిష్ట ఎక్స్పోజర్ 75 శాతం, ప్రభుత్వ ఉద్యోగులకు ఇది 50 శాతానికి పరిమితం. పదవీ విరమణ సమయంలో వారు కార్పస్‌లో 60 శాతం వరకు పన్ను రహిత మొత్తంగా ఉపసంహరించుకోవచ్చు, మిగిలిన 40 శాతం తప్పనిసరిగా వార్షికంగా మార్చాలి, ఇది జీవితకాలం పెన్షన్ ఆదాయాన్ని అందిస్తుంది.

నిర్దిష్ట చెల్లింపులకు హామీ ఇచ్చేది OPS. అయితే NPS మాత్రం మార్కెట్ బేస్ట్ స్కీమ్. పెరుగుతున్న ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలికంగా NPSకి అనుకూలంగా ఉంటాయి. కానీ స్వల్పకాలిక అస్థిరతకు గురవుతాయి. NPS దీర్ఘకాలిక స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇది ఉద్యోగికి అనుకూలంగా పని చేస్తుంది. హామీ ఇచ్చిన చెల్లింపుల భారం నుంచి యజమానికి అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపశమనం కలిగిస్తుంది.

* OPS లాగా అష్యూర్డ్‌ పెన్షన్‌ను NPS అందజేస్తుందా?

అందజేయదు. NPS అనేది డిఫైన్డ్‌ కాంట్రిబ్యూషన్‌, డిఫైన్డ్‌ బెనిఫిట్‌ ఇవ్వదు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో.. పని చేసే సంవత్సరాల్లో కార్పస్‌ను నిర్మించడానికి యజమాని, ఉద్యోగి ఇద్దరూ వరుసగా 14 శాతం, 10 శాతం కాంట్రిబ్యూట్‌ చేస్తారు. ఉద్యోగులు అధిక పెన్షన్ ఆదాయాన్ని కోరుకుంటే, తమ పని సంవత్సరాల్లో స్వచ్ఛందంగా ఫండ్‌కు పెద్ద మొత్తంలో కాంట్రిబ్యూట్‌ చేయవచ్చు అని ఉపాధ్యాయ్ చెప్పారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Nps, Pensions, Personal Finance

ఉత్తమ కథలు