హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ బెస్ట్‌ స్టాక్ ఆప్షన్స్‌ పరిశీలించండి..

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ బెస్ట్‌ స్టాక్ ఆప్షన్స్‌ పరిశీలించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mutual Funds: SIP ద్వారా స్టాక్‌లలో పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్న పెట్టుబడిదారుల కోసం కొన్ని ఆప్షన్స్ అందిస్తోంది దేశీయ బ్రోకరేజ్, రీసెర్చ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్. 6-12 నెలలకు కొనుగోలు చేయగల టాప్‌ ఆప్షన్స్ ఏవో వెల్లడించింది. అవేంటో చూద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

అధిక రాబడిని అందించే ఫైనాన్షియల్‌ ప్రొడక్ట్స్‌లో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు (Mutual Funds) సుక్షితమైనవిగా పరిగణిస్తారు. పెట్టుబడిదారులు మార్కెట్ క్యాపిటలైజేషన్, సెక్టార్ కేటాయింపు, విలువ ఆధారంగా ఫండ్స్‌ను సెలక్ట్‌ చేసుకొనే అవకాశం కూడా ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా కంపెనీ స్టాక్ లార్జ్, మిడ్ లేదా స్మాల్ క్యాప్ కావచ్చు. రిటైల్ పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్ ద్వారా క్రియేట్‌ చేసిన స్టాక్‌ బాస్కెట్‌లో పెట్టుబడి (Investment) పెట్టవచ్చు. స్టాక్ మార్కెట్‌ (Stock Market)లో నేరుగా పెట్టుబడి పెట్టడంతో పోలిస్తే ఇలా రిస్క్‌ తగ్గుతుంది. ఈ నేపథ్యంలో SIP ద్వారా స్టాక్‌లలో పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్న పెట్టుబడిదారుల కోసం కొన్ని ఆప్షన్స్ అందిస్తోంది దేశీయ బ్రోకరేజ్, రీసెర్చ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్. 6-12 నెలలకు కొనుగోలు చేయగల టాప్‌ ఆప్షన్స్ ఏవో వెల్లడించింది. అవేంటో చూద్దాం.


* టాప్‌ 12 కంపెనీలు
ఏజిస్ లాజిస్టిక్స్(Aegis Logistics), బజాజ్ ఆటో(Bajaj Auto), భారతీ ఎయిర్‌టెల్(Bharti Airtel), సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(CDSL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL), హిందాల్కో ఇండస్ట్రీస్(Hindalco Industries), ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank), ఐటీసీ(ITC), పెర్సిస్టెంట్ సిస్టమ్స్(Persistent Systems), రిలయన్స్ ఇండస్ట్రీస్‌(Reliance Industries(RIL)), స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI), థర్మాక్స్‌(Thermax) వంటి పన్నెండు స్టాక్స్ తాము రిఫర్ చేసే టాప్‌ ఆప్షన్స్ అని తెలిపింది హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్.* బజాజ్ ఆటో

బజాజ్ ఆటో భారతదేశంలో నంబర్.1 మోటార్‌సైకిల్ ఎగుమతిదారుగా ఉంది. భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న మూడు బైక్‌లలో రెండు బజాజ్ బ్యాడ్జ్‌తో ఉంటాయి. కంపెనీ ఎలక్ట్రానిక్‌ వెహికల్స్‌లో ప్రాధాన్య బ్రాండ్‌గా ఉద్భవించేలా సామర్థ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తోంది.


తన ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ అమ్మకాలను Q1లో తక్కువ బేస్‌లో రెట్టింపు చేసింది. Q2లో 27 నగరాల్లో ఉనికిని కలిగి ఉండడంతో (క్రమక్రమంగా 100 నగరాలకు చేరుకోవడం) రెట్టింపు చేయాలని భావిస్తోంది. అయితే ప్రీమియం సెగ్మెంట్‌లో అధిక పోటీ, ఎగుమతి ఒత్తిడి, ఫారెక్స్ అస్థిరత కంపెనీకి కీలకమైన రిస్క్‌లుగా మిగిలిపోయాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తన నోట్‌లో పేర్కొంది.


* భారతి ఎయిర్‌టెల్

ఇండస్ట్రీ లీడింగ్‌ యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌ (ARPU) రూ.183లను భారతి ఎయిర్‌టెల్ పొందుతోంది. ఒక సంవత్సరంలో 25 శాతం లాభాలను నమోదు చేసింది. రాబోయే మూడు నాలుగు నెలల్లో కాకపోయినా 2022లో మరో టారిఫ్ పెంపును కంపెనీ ఆశిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఓ ప్రకటనలో..‘ 2023 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో ARPUను రూ.200గా నమోదు చేయాలని ఎయిర్‌టెల్‌ భావిస్తోంది. ఇండస్ట్రీలో బెస్ట్‌గా కొనసాగాలని కృషి చేస్తోంది.


ప్రస్తుతం రూ.183గా ఉన్న ARPU, ఆర్థిక సంవత్సరం 2022 నాలుగో క్వార్టర్‌లో రూ.178, మూడో క్వార్టర్‌లో రూ.163, రెండో క్వార్టర్‌లో రూ.153గా ఉంది. 2022 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో ARPU రూ.146గా ఉండటం గమనార్హం.’ అని తెలిపింది.


* ఐటీసీ లిమిటెడ్

2022 క్యాలెండర్ సంవత్సరంలో ITC నిఫ్టీ టాప్ పర్ఫార్మర్స్‌గా ఉంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, డిమాండ్ మందగమనంతో పాటు మద్దతు మూల్యాంకనాలతో పాటు అన్ని విభాగాలలో బలమైన పనితీరు నమోదుచేసింది. 2023 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో సిగరెట్ వాల్యూమ్‌లలో (28 శాతం) అద్భుతమైన వృద్ధిని అందించింది.


ఇది కూడా చదవండి : ఎస్‌బీఐ ఖాతాదారులకు కొత్త రూల్... ఈ స్టెప్స్ ఫాలో అవండి


కోవిడ్‌కు పూర్వం స్థాయిలను కంపెనీ అధిగమించింది. ఇప్పుడు వృద్ధి పథంలో కనిపిస్తోంది. FMCG వ్యాపారంలో 19.5 శాతం వృద్ధి ఉంది. హోటల్స్‌ వ్యాపారం గరిష్ఠ లాభాలను, సేల్స్‌ను నమోదు చేసింది. హోటల్స్‌ వ్యాపారం, అగ్రి(83 శాతం వృద్ధి), పేపర్‌బోర్డ్స్‌(43% వృద్ధి) చూపాయి. ఇలాంటి స్టెబిలిటీతో వాల్యుయేషన్‌ పరంగా రేటింగ్‌ పెరుగుతుందని భావిస్తున్నట్లు బ్రోకరేజ్‌ హౌస్‌ తెలిపింది.


* హిండాల్కో

హిండాల్కో అల్యూమినియం సామర్థ్యాన్ని, అలాగే వాల్యూ యాడెడ్‌ ప్రొడక్ట్స్‌ వాటాను పెంచడానికి లో, అప్‌స్ట్రీమ్ రెండింటినీ విస్తరిస్తోంది. ఇది చివరికి మెరుగైన EBITDA మార్జిన్‌లో ప్రతిబింబిస్తుంది. ఈ క్వార్టర్‌లో నోవెలిస్ కీలక ముగింపు మార్కెట్ విభాగాలపై (క్యాన్‌లు, ఆటో) సానుకూల డిమాండ్ చూపుతుందని, ఈ త్రైమాసికంలో EBITDA/t గైడెన్స్‌ అప్‌వర్డ్‌ రివిజన్‌, భవిష్యత్తులో నగదు ప్రవాహాన్ని సౌకర్యవంతం చేస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పేర్కొంది.


* HPCL

హెచ్‌పీసీఎల్‌ గత కొన్ని సంవత్సరాలుగా రిఫైనరీ వినియోగ స్థాయిలను 100% పైన పేర్కొంది. విశాఖపట్నం రిఫైనరీలోని క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్‌లో ఒకదానిలో అగ్నిప్రమాదం, సామర్థ్య విస్తరణ కోసం ముంబై రిఫైనరీని మూసివేయడం వల్ల 2022 ఆర్థిక సంవత్సరంలో సామర్థ్య వినియోగం క్షీణించింది. విశాఖపట్నం కెపాసిటీ విస్తరణ, అవశేషాల అప్‌గ్రేడేషన్ ప్రాజెక్ట్ పూర్తయితే, స్కేల్, నగదు ప్రవాహాలు మెరుగుపడతాయని అంచనా వేస్తోంది.

First published:

Tags: Hdfc, Investments, Mutual Funds, Personal Finance

ఉత్తమ కథలు