ప్రాపర్టీ (Property) లేదా ఇల్లు (House) కొనుగోలు చేయడం చాలా డబ్బు, శ్రమతో కూడుకున్న పని. ఇల్లు కొనే ముందు డబ్బులు (Money) అడ్జస్ట్ చేసుకోవడమే కాక కావలసిన డాక్యుమెంట్లు అన్నీ సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. పూర్తి అవగాహన లేకుండా కొనుగోలు చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఒక ప్రాపర్టీ లేదా ఇల్లు కొనడానికి ఏయే డాక్యుమెంట్లు కావాలో అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు సమకూర్చుకోవాల్సిన డాక్యుమెంట్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* ముఖ్యమైన డాక్యుమెంట్లు
ఇల్లు లేదా ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి ముందు కొనుగోలుదారులు పొందాల్సిన మొదటి డాక్యుమెంటు ‘అమ్మకపు ఒప్పందం (Agreement to sell)’. ఈ డాక్యుమెంటులో విక్రయిస్తున్న ప్రాపర్టీ గురించి మొత్తం సమాచారం ఉంటుంది. ఇది కొనుగోలుదారు, విక్రేత ఏం అంగీకరించారు? ప్రాపర్టీని ఎంతకు అమ్మేస్తున్నారు? వంటి వాటిని తెలియజేస్తుంది.
అనంతరం ‘సేల్ డీడ్ (Sale Deed)’ లేదా ‘టైటిల్ డీడ్ (Title Deed)’ అనేది మీకు కావలసిన ముఖ్యమైన డాక్యుమెంటు. ఆ ప్రాపర్టీ మీకు చెందినదని ఈ డాక్యుమెంటు మాత్రమే తెలియజేస్తుంది. మీరు సేల్ డీడ్‌ను అఫీషియల్ చేయడానికి ప్రభుత్వ కార్యాలయమైన సబ్-రిజిస్ట్రార్‌కి వెళ్లి అక్కడ దాన్ని రిజిస్టర్ చేయించాలి. అప్పుడు అది టైటిల్ డీడ్ అవుతుంది. దాంతో ఆ ప్రాపర్టీ ఓనర్‌షిప్ మీ పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది.
* ప్రాపర్టీ బ్యాక్‌గ్రౌండ్ పరిశీలన
ఒక ఇల్లు లేదా ప్రాపర్టీ కొంటున్నామంటే గుడ్డిగా ఒకరి మాటే నమ్మకూడదు. ఎందుకంటే కొన్ని ఇల్లు/ప్రాపర్టీ జాయింట్ ప్రాపర్టీగా ఉంటాయి. ఈ విషయాన్ని ‘ప్రాపర్టీ టైటిల్ సెర్చ్ (Property Title Search)’ ప్రాసెస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో మీరు ప్రభుత్వం లేదా పబ్లిక్ రికార్డ్స్ నుంచి ఇంటి/ప్రాపర్టీ చరిత్ర గురించి సమాచారాన్ని పొందగలుగుతారు.
ఈ సమాచారంలో ఇంతకు ముందు ఇంటికి ఓనర్‌గా ఎవరు ఉన్నారు? ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? ఈ ప్రాపర్టీ మీద ఎంతమందికి అధికారం ఉంది? వంటి వివరాలు ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఇది ప్రాపర్టీ బ్యాక్‌గ్రౌండ్ పరిశీలన లాంటిది.
* ఖాతా సర్టిఫికెట్, నో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్
‘ఖాతా సర్టిఫికేట్ (Khata certificate)’ అనేది ఇల్లు ఏ మున్సిపాలిటీలో ఉందో.. అక్కడి రికార్డులలో జాబితాలో నమోదైందో లేదో చూపించే ఒక డాక్యుమెంటు. దీనిని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఇక ఇన్‌కమ్ ట్యాక్స్ రశీదులు ఇంటి యజమాని తమ పన్నులన్నింటినీ చెల్లించారో లేదో చూపుతాయి.
ఇది కూడా చదవండి : ఐటీఆర్ డాక్యుమెంట్లు ఎంత కాలం భద్రపరచుకోవాలి? నిపుణుల సూచనలు ఇలా..
ఇల్లు చట్టబద్ధమైనదని రుజువు చేసేందుకు ఈ డాక్యుమెంట్లు చాలా అవసరం. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాపర్టీ/ఇంటిపై ఎలాంటి రుణాలు లేవు అని చెప్పే డాక్యుమెంటు ‘నో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ (Certificate of No Encumbrance)’. ఇంటిని తాకట్టుగా ఉపయోగించి బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ డాక్యుమెంటు తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆస్తిపై జరిగిన అన్ని లావాదేవీల గురించి ఈ సర్టిఫికెట్‌లో సమాచారం ఉంటుంది.
* ఆక్యుపెన్సీ సర్టిఫికేట్
‘ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (Occupancy certificate)’ అనేది ఒక భవనం నిర్మించిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చే డాక్యుమెంటు. భవనాన్ని ప్లాన్‌ల ప్రకారం నిర్మించామని, దానిలో నివసించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసే సర్టిఫికెట్ ఇది. అంతేకాకుండా కొనుగోలు చేయాలనుకున్న ఇంటిపై ఎంత రుణం ఉందో బ్యాంకు నుంచి స్టేట్‌మెంట్ తీసుకోవడం మంచిది. అప్పుడు ఏ సమస్యలూ రావు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Home tips, Personal Finance