హోమ్ /వార్తలు /బిజినెస్ /

2022 Upcoming Bikes: కొత్త బైక్‌ కొంటున్నారా? త్వరలో లాంచ్‌ కానున్న ఈ బైకులపై ఓ లుక్కేయండి..

2022 Upcoming Bikes: కొత్త బైక్‌ కొంటున్నారా? త్వరలో లాంచ్‌ కానున్న ఈ బైకులపై ఓ లుక్కేయండి..

2022 Upcoming Bikes: కొత్త బైక్‌ కొంటున్నారా? త్వరలో లాంచ్‌ కానున్న ఈ బైకులపై ఓ లుక్కేయండి..

2022 Upcoming Bikes: కొత్త బైక్‌ కొంటున్నారా? త్వరలో లాంచ్‌ కానున్న ఈ బైకులపై ఓ లుక్కేయండి..

2022 Upcoming Bikes: వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఫీచర్లు, డీల్స్‌ను అందిస్తుంటాయి. 2022లో ఇప్పటికే చాలా కంపెనీలు తమ బైకులను లాంచ్‌ చేశాయి. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్, హీరో, బజాజ్, ఇతర బ్రాండ్‌లు కొత్త బైక్‌లను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియన్‌ ఆటో మార్కెట్‌ (Auto Market)లో ద్విచక్ర వాహనాలకు డిమాండ్‌ ఎక్కువ. వినియోగదారులకు చాలా రకాల ఆప్షన్‌లు అందుబాటులో ఉంటాయి. ఇన్ని ఆప్షన్‌ల మధ్య కొనుగోలు చేయడానికి ఒకటి ఎంపిక చేసుకోవడం కొంచెం కష్టమనే చెప్పాలి. ఇండియా (India)లో బైక్‌ (Bikes)లను ఉన్న డిమాండ్‌తో ఎప్పటికప్పుడు బైక్‌ తయారీ సంస్థలు కొత్త మోడళ్లను లాంచ్‌ చేయడానికి పోటీ పడుతుంటాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఫీచర్లు, డీల్స్‌ను అందిస్తుంటాయి. 2022లో ఇప్పటికే చాలా కంపెనీలు తమ బైకులను లాంచ్‌ చేశాయి. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్, హీరో, బజాజ్, ఇతర బ్రాండ్‌లు కొత్త బైక్‌లను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం కొత్త బైకు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది శుభవార్తే అవుతుంది. అతి త్వరలో లాంచ్ కాబోతున్న బైకులు ఏవి? వాటికి సంబంధించిన వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

* Royal Enfield Shotgun 650

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 గురించి కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. త్వరలో లాంచ్‌ కాబోతున్న ఈ బైక్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. కొత్త షాట్‌గన్ బైక్‌ను కంపెనీ అత్యంత శక్తివంతమైన బైక్‌లలో ఒకటిగా భావిస్తున్నారు. పూర్తిగా కొత్త డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షాట్‌గన్‌ 650 సిద్ధమవుతోంది.

* Royal Enfield Himalayan 450

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450కి సంబంధించిన వార్తలు చాలా కాలంగా ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఈ బైక్ టెస్ట్ మ్యూల్స్ అనేక సార్లు గుర్తించారు. ఇటీవల కంపెనీ ఎండీ సిద్ లాల్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియోలో బైక్‌ లాంచ్‌ కాబోతున్నట్లు తెలిసింది. ఈ కొత్త బైక్ మునుపటి వెర్షన్‌తో పోలిస్తే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 పెద్దదిగా ఉండనుంది. మెకానిక్స్, లుక్‌లలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయని సమాచారం.

View this post on Instagram

A post shared by Sid Lal (@sidlal)

* Hero XPulse 400, Xtreme 400S

400 సీసీ బైక్‌ల సెగ్మెంట్‌లో వివిధ బ్రాండ్‌లు తమ బైక్‌లను లాంచ్‌ చేయడంతో పోటీ పెరిగింది. హీరో కంపెనీ పోటీకి సిద్ధమైంది. XPulse 2004V ర్యాలీ ఎడిషన్‌ను విడుదల చేసిన వెంటనే, Hero XPulse 400, Xtreme 400Sలను ఇండియాలో లాంచ్‌ చేయడానికి సిద్ధంగా ఉంది.

* 2022 Bajaj N150

2022 బజాజ్ N150 బైకును పల్సర్ లైనప్‌లో అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా బజాజ్‌ తీసుకొస్తోంది. బైక్‌కు సంబంధించిన ఇటీవల లీక్ అయిన స్పై షాట్‌లు కొత్త బజాజ్ N150 విడుదలపై అంచనాలు పెంచేశాయి. బైక్‌లో 150 సిసి ఇంజిన్‌ ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ బైక్‌కు సంబంధించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, Bajaj, New bikes, Royal Enfield

ఉత్తమ కథలు