Home /News /business /

HERE THE DIFFERENCE BETWEEN REVISED BELATED AND UPDATED INCOME TAX RETURNS TAKE A LOOK GH SRD

ITR Filling: రివైజ్డ్‌, అప్‌డేటెడ్, బిలేటెడ్‌ రిటర్న్‌ అంటే ఏంటి? వాటి మధ్య తేడాలు ఏంటి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ITR Filling: 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంకా ఆదాయ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయకుంటే.. బిలేటెడ్‌ రిటర్న్‌(Belated Return)ను ఫైల్ చేయవచ్చు. పాత రిటర్న్‌ను అప్‌డేట్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఇలాంటివి ఫైల్‌ చేసేందుకు జరిమానాలు, పరిమితులు పాటించాలి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
2021-22 ఆర్థిక సంవత్సరంలో (అసెస్‌మెంట్ ఇయర్ 2022-23) ఆర్జించిన ఆదాయాని (Income)కి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్‌ను ఫైల్ (ITR Filling) చేయడానికి చివరి తేదీ ముగిసింది. కానీ ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. ఇప్పటికే ఆదాయ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసి, ఏదైనా పొరపాటును గుర్తిస్తే, ఏదైనా ఆదాయాన్ని నివేదించడంలో పొరపాటు జరిగితే.. రివైజ్డ్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయవచ్చు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంకా ఆదాయ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయకుంటే.. బిలేటెడ్‌ రిటర్న్‌(Belated Return)ను ఫైల్ చేయవచ్చు. పాత రిటర్న్‌ను అప్‌డేట్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఇలాంటివి ఫైల్‌ చేసేందుకు జరిమానాలు, పరిమితులు పాటించాలి.

* రివైజ్డ్ రిటర్న్
ఇప్పటికే రిటర్న్‌ను ఫైల్ చేసిన వారు.. తర్వాత ఏదైనా పొరపాట్లను, తప్పు స్టేట్‌మెంట్‌లను గుర్తిస్తే రివైజ్డ్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయవచ్చు. అయితే రివైజ్డ్‌ రిటర్న్‌ నిర్ణీత కాలపరిమితిలోపు ఫైల్‌ చేయాల్సి ఉంటుంది.

టాక్స్ ఇ-ఫైలింగ్, కంప్లైయెన్స్ మేనేజ్‌మెంట్ పోర్టల్ TaxManager.in చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపక్ జైన్ మాట్లాడుతూ..‘రిటర్న్‌ను సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్‌ ముగియడానికి మూడు నెలల ముందు లేదా అసెస్‌మెంట్ పూర్తయ్యే ముందు, ఏది ముందుగా ఉంటే అది ఫైల్ చేయవచ్చు. అసెస్‌మెంట్‌ ఇయర్‌2022-23కి సంబంధించి 2022 డిసెంబర్ 31లోపు రివైజ్డ్‌ ఫైల్‌ చేయవచ్చు.’ అని చెప్పారు.

అవసరమైతే, పన్ను రిటర్న్‌ను రివైజ్‌ చేసే సమయంలో ఐటీఆర్‌ ఫారమ్‌ను కూడా మార్చవచ్చు. బోనఫైడ్ తప్పులను రివైజ్‌ చేసినందుకు డిపార్ట్‌మెంట్ ఎటువంటి పెనాల్టీని విధించదు. సెక్షన్లు 234B, 234C కింద ప్రతి రివైజ్డ్‌ రిటర్న్‌కి వడ్డీ లెక్కిస్తారు. ఎన్ని రివైజ్డ్‌రిటర్న్‌లను ఫైల్‌ చేయవచ్చనే దానిపై పరిమితి లేదు. రిటర్న్‌ను పేపర్ ఫార్మాట్‌లో లేదా మాన్యువల్‌గా ఫైల్ చేసి ఉంటే.. ఆన్‌లైన్ లేదా ఎలక్ట్రానిక్‌గా రివైజ్ చేయడం సాధ్యం కాదని గుర్తించాలి.

* బిలేటెడ్‌ రిటర్న్‌
గడువు తేదీలలోపు దాఖలు చేసిన రిటర్న్‌ను ఆదాయ పన్ను చట్టం, 1961 సెక్షన్ 139(1) ప్రకారం ఒరిజినల్‌ రిటర్న్ అంటారు. అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2022-23కి సంబంధించి రిటర్న్‌ను ఫైల్ చేయడానికి గడువు తేదీ 2022 జులై 31తో ముగిసింది. చట్టంలో నిర్దేశించిన సమయంలోపు రిటర్న్‌ను దాఖలు చేయని, గడువు తేదీ తర్వాత రిటర్న్‌ను దాఖలు చేసే అసెస్సీని చట్టంలోని సెక్షన్ 139(4) ప్రకారం బిలేటెడ్‌ రిటర్న్‌గా పేర్కొంటారు. సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్‌ ముగిసే మూడు నెలల ముందు వరకు బిలేటెడ్‌ రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు.

ఇది కూడా చదవండి : భలే ఛాన్స్.. అత్యధిక వడ్డీ రేటుతో బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్..

బిలేటెడ్‌ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. సెక్షన్ 234F ప్రకారం, గడువు తేదీ తర్వాత రిటర్న్‌ను అందిస్తే రూ.5,000 బిలేటెడ్‌ ఫైలింగ్ ఫీజు చెల్లించాలి. వ్యక్తి మొత్తం ఆదాయం రూ.5 లక్షలకు మించిఉంటే, చెల్లించాల్సిన ఫైలింగ్ ఫీజు మొత్తం రూ.1,000 అవుతుంది.

స్వచ్ఛందంగా రిటర్న్‌ను ఫైల్ చేసి ఉంటే.. తప్పనిసరిగా ఐటీఆర్‌ ఫైల్ చేయాల్సిన అవసరం లేని సందర్భంలో బిలేటెడ్‌ ఫైలింగ్‌కు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయం బేసిక్‌ ఎగ్జంప్షన్‌ లిమిట్‌ కంటే తక్కువగా ఉంటే, అంటే 60 ఏళ్లలోపు వ్యక్తులకు రూ.2.5 లక్షలు, 60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్న వారికి రూ.3 లక్షలు, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షలు కంటే తక్కువ ఉంటే ఐటీఆర్‌ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు.

* అప్‌టేడెట్‌ రిటర్న్
ఫైనాన్స్ యాక్ట్ 2022, అప్‌డేట్ రిటర్న్ ఫైల్‌ను ప్రారంభించడానికి సెక్షన్ 139లో సబ్‌సెక్షన్ (8A)ను చేర్చారు. అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి బిలేటెడ్‌ లేదా రివైజ్డ్‌ రిటర్న్‌ను ఇప్పటికే దాఖలు చేశారా లేదా (నిర్దిష్ట షరతులకు లోబడి) అనే దానితో సంబంధం లేకుండా ఎవరైనా అప్‌డేట్ చేసిన రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు.

అప్‌డేట్ చేసిన రిటర్న్‌ను ఫైల్ చేయడానికి, భారీ పెనాల్టీని చెల్లించాల్సి రావచ్చు. ఆర్థిక సంవత్సరం 2020-21 కోసం ఫైల్ చేయాలనుకుంటున్న వారికి, అదనపు మొత్తం చెల్లించాల్సిన పన్ను.. వడ్డీలో 25 శాతం ఉంటుంది. తక్కువ ఆదాయం లేదా నష్టాన్ని చూపాలనే ఉద్దేశంతో ఉంటే.. అప్‌డేట్ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి అనుమతి ఉండదు. అప్‌డేట్ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ప్రత్యేక ITR ఫారమ్-ITR ఫారమ్ U ఉంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Income tax, ITR, ITR Filing, Taxes

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు