హోమ్ /వార్తలు /బిజినెస్ /

UPI: క్రెడిట్‌ కార్డ్‌తో యూపీఐ లింక్‌.. లాభనష్టాలపై కస్టమర్లు ఓ లుక్కేయండి!

UPI: క్రెడిట్‌ కార్డ్‌తో యూపీఐ లింక్‌.. లాభనష్టాలపై కస్టమర్లు ఓ లుక్కేయండి!

UPI: క్రెడిట్‌ కార్డ్‌తో యూపీఐ లింక్‌.. లాభనష్టాలపై కస్టమర్లు ఓ లుక్కేయండి!

UPI: క్రెడిట్‌ కార్డ్‌తో యూపీఐ లింక్‌.. లాభనష్టాలపై కస్టమర్లు ఓ లుక్కేయండి!

UPI: UPI వృద్ధితో క్రెడిట్ కార్డ్‌ల వినియోగం తగ్గుతోంది. కస్టమర్ల వద్ద క్రెడిట్ కార్డ్‌ ఉన్నాసరే.. వ్యాపారులు యూపీఐ పేమెంట్‌ని కోరుతున్నారు. తక్కువ ధర, సింపుల్‌గా ట్రాన్సాక్షన్‌ అయిపోతుండటంతో యూపీఐ వినియోగం పెరిగింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

పేమెంట్‌ సిస్టమ్‌ని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సమూలంగా మార్చేసింది. కరోనా సమయంలో ఇంట్రడ్యూస్‌ అయిన యూపీఐ సేవలు, అతి తక్కువ కాలంలో పాపులర్‌ అయ్యాయి. ప్రతి స్మార్ట్‌ఫోన్‌ (Smartphone)లో యూపీఐ యాప్‌ ఉంటోంది.. చిన్న చిన్న దుకాణాల్లో కూడా యూపీఐ స్కానర్‌లు కనిపిస్తున్నాయి. విలువ, సంఖ్య పరంగా చూసినా యూపీఐ లావాదేవీలు భారీగా పెరిగాయి. ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లో కూడా ఈ తరహా ట్రాన్సాక్షన్‌లు చేసే వెసులుబాట్లు వచ్చాయి. సులువుగా పేమెంట్స్‌ చేసే అవకాశం ఉండటంతో దాదాపు అన్ని వర్గాల వాళ్లు యూపీఐని వినియోగిస్తున్నారు. UPI వృద్ధితో క్రెడిట్ కార్డ్‌ల వినియోగం తగ్గుతోంది. కస్టమర్ల వద్ద క్రెడిట్ కార్డ్‌ ఉన్నాసరే.. వ్యాపారులు యూపీఐ పేమెంట్‌ని కోరుతున్నారు. తక్కువ ధర, సింపుల్‌గా ట్రాన్సాక్షన్‌ అయిపోతుండటంతో యూపీఐ వినియోగం పెరిగింది.

* క్రెడిట్‌ కార్డ్‌తో యూపీఐ లింక్‌

అయితే భారతీయ క్రెడిట్ కార్డ్ ఇండస్ట్రీని ప్రోత్సహించేలా, RBI 2022 జూన్‌లో UPIతో రూపే క్రెడిట్ కార్డ్‌లను లింక్‌ చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నిర్ణయం గేమ్‌ ఛేంజర్‌గా మారింది. 2022 డిసెంబర్‌లో రూపే రూ.1.27 లక్షల కోట్ల విలువైన 25.6 కోట్ల ట్రాన్సాక్షన్‌లు నమోదు చేసింది. ఈ గణాంకాలు 2022 డిసెంబర్‌ UPI లావాదేవీల్లో 3, విలువలో 10 శాతం మాత్రమే. దాదాపు 260 మిలియన్ల UPI వినియోగదారులకు, రూపే క్రెడిట్ కార్డ్‌లను అందించే ప్రయత్నాల్లో క్రెడిట్ కార్డ్ జారీదారులు గత జూన్ నుంచి బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న కస్టమర్‌లను అటువంటి లావాదేవీల కోసం వారి బ్యాంక్ అకౌంట్‌లను ఉపయోగించకుండా, క్రెడిట్ కార్డ్ వినియోగించాలని ఆశిస్తున్నారు.

* UPIతో క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు

* కస్టమర్లపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

- లాభాలు: క్రెడిట్ కార్డ్‌లను ఇప్పుడు UPI పేమెంట్స్‌ రిసీవ్‌ చేసుకునే ఏ వ్యాపారి వద్దనైనా ఉపయోగించవచ్చు. కూరగాయలు అమ్మేవాళ్లు, పాల వ్యాపారి, వార్తాపత్రికల విక్రేత ఇలా ఎక్కడైనా సరే పేమెంట్స్‌ చేయవచ్చు. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ప్రభావితం కాదు. అంతేకాకుండా, కార్డును బయటకు తీసి వినియోగించాల్సిన అవసరం లేదు. ఫ్రాడ్‌ లేదా కార్డ్‌ పోగొట్టుకునే సమస్యలు ఉండవు.

- నష్టాలు: ఇప్పుడు అన్ని ఖర్చులను కార్డ్‌కి ఛార్జ్ చేయవచ్చు కాబట్టి, బ్యాంకులో డబ్బు ఉందని ఆందోళన అవసరం లేదు. దీంతో వినియోగదారులు ఎక్కువగా ఖర్చు చేసే ప్రమాదం ఉంది.

* క్రెడిట్‌ కార్డ్‌ జారీ సంస్థలు

- లాభాలు: క్రెడిట్‌ కార్డ్‌ పేమెంట్స్‌ తీసుకునే వెసులుబాటులేని చిన్న వ్యాపారుల వద్ద కూడా ట్రాన్సాక్షన్‌లు పెరుగుతాయి. డెమోగ్రాఫిక్ ప్రొఫైల్‌లలోని కస్టమర్‌లు తమ కార్డ్‌లను ఉపయోగించడానికి అనేక కొత్త అవకాశాలను కనుగొంటారు. కాబట్టి ఇది యాక్టివేషన్, ఎంగేజ్‌మెంట్‌కు కూడా సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి : కారు కొనాలనుకునే వారు ఈ ఏడు రోజుల్లో కొనేయండి.. లేదంటే ఫసక్కే!

- నష్టాలు: చిన్న వ్యాపారులకు చేసే పేమెంట్స్‌ ఏ విధమైన ఇంటర్‌ఛేంజ్ ఇన్‌కం తీసుకురావు. ఇంటర్‌ఛేంజ్‌ రేట్లు సరిగ్గా అలైన్‌ చేయకపోతే పెద్ద బిజినెస్‌ల వద్ద కూడా ఈ సమస్య ఎదురవుతుంది. UPIతో కార్డ్‌లను లింక్‌ చేయడం వల్ల కొత్త కేసులు పెరిగే అవకాశం ఉంది, ఫ్రాడ్‌ రిస్క్ మేనేజ్‌మెంట్ అవసరం కూడా ఉంటుంది.

* భారీగా పెరుగుతున్న యూపీఐ ట్రాన్సాక్షన్‌లు

2016 ఏప్రిల్‌లో ప్రారంభించినప్పటి నుంచి UPI వేగంగా అభివృద్ధి చెందుతోంది. NPCI వెబ్‌సైట్ ప్రకారం.. 2016 జులై రూ.38 లక్షల విలువైన 90,000 లావాదేవీలు (21 బ్యాంకుల్లో) జరిగాయి. అదే 2022 డిసెంబర్‌ నాటికి రూ.12.8 లక్షల కోట్లు విలువైన 7.8 బిలియన్ ట్రాన్సాక్షన్‌లు(382 బ్యాంకుల్లో) జరిగాయి. UPIతో క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయడం ఇండియన్‌ కార్డ్‌ల ఇండస్ట్రీలో గేమ్ ఛేంజర్‌గా రుజువు అవుతుంది. ఇతర కార్డ్ నెట్‌వర్క్‌లు కూడా తమ కార్డ్‌లను UPIతో లింక్ చేయడానికి RBI అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి.

First published:

Tags: Credit cards, Personal Finance, UPI, Upi payments

ఉత్తమ కథలు