ఇండియాలో పాలు నిత్యావసర వస్తువుల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఉదయం టీ, కాఫీల నుంచి పాల వినియోగం మొదలవుతుంది. పాలతో తయారు చేసే డెయిరీ ప్రొడక్ట్స్((Dairy Products))కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే పాడి పరిశ్రమ( Dairy Farming Industry) భారత్‌లో(India) ఎప్పుడూ లాభసాటిగానే నడుస్తోంది. సీజన్లతో సంబంధం లేకుండా స్థిరమైన లాభాలను ఇచ్చే వ్యాపారమిది. అందుకే దేశంలో ఏటా పాల ఉత్పత్తి మూడు నుంచి నాలుగు శాతం పెరుగుతోంది. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని చాలా మంది యువకులు డెయిరీ ఫాం బిజినెస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. కొత్తగా డెయిరీ ఫాం(Dairy Farm) పెట్టాలని భావిస్తున్న వారి కోసం ఈ ఫుల్ గైడెన్స్..
డెయిరీ ఫాం వ్యాపారంలోకి ప్రవేశించే వారు ముందుగా 14 నుంచి 18 గంటలపాటు డెయిరీ ఫాం(Dairy Farm)లో పని చేసేందుకు సిద్ధపడి ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అవసరమైన వనరులను సమకూర్చుకోవడానికి అదనపు సమయమూ అవసరం కావచ్చని తెలిపారు. ఇందుకు సిద్ధపడితే ఈ పరిశ్రమను విజయవంతంగా రన్ చేయగలుగుతారని చెప్పారు.
* బిజినెస్ ప్లాన్
మిషన్, విజన్, లొకేషన్, స్థలం, పశువుల టీకాలు, షెడ్, వాటికి ఆహారం, సామగ్రి లాంటి మొత్తం సమాచారంతో ఉన్న బిజినెస్ ఔట్ లైన్‌ని ముందు సిద్ధం చేసుకోవాలి. పశువుల ఎంపిక కూడా చాలా ముఖ్యం. చాలా మంది జాఫరాబాది, గిర్, తార్పార్కర్, సాహివాల్, ముర్రా, మెహసాని, సూర్తి లాంటి ప్రముఖ జాతుల గేదెలను కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ జాతులన్నీ చాలా ఉత్తమమైనవి. బ్యాంకు రుణం తీసుకుని ఫాం పెట్టాలనుకుంటే.. ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా పొందే అవకాశం ఉంటుంది. డెయిరీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ స్కీమ్ కింద నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(NABARD) ఇచ్చే సబ్సిడీని పొందవచ్చు.
* అవసరమైన అనుమతులు
ఫాం పేరును ముందు డెయిరీ కోఆపరేటివ్ సొసైటీలో రిజిస్టర్ చేయించుకోవాలి. ఒక వేళ ఇది లేకపోతే స్థానికంగా ఉన్న యానిమల్, వెటర్నరీ, డెయిరీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి తెలియజేయాల్సి ఉంటుంది. తప్పకుండా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చాలా పెద్ద డెయిరీ ఫాం ప్రారంభిస్తుంటే.. కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board) నుంచి అనుమతి అవసరం కావచ్చు. డెయిరీలు(Bureau of Indian Standards) BIS స్టాండర్డ్స్‌ని తప్పక అనుసరించాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, కష్టపడితే డెయిరీ ఫాంను విజయవంతంగా రన్ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dairy, Earn money, Forming