Home /News /business /

Health insurance: భారీగా పెరిగిన ఆరోగ్య బీమా ప్రీమియం ధరలు.. ఎంత మేర పెరిగాయంటే?

Health insurance: భారీగా పెరిగిన ఆరోగ్య బీమా ప్రీమియం ధరలు.. ఎంత మేర పెరిగాయంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలంటే ఆరోగ్య భీమా పాలసీలను తీసుకోవడం ఉత్తమ మార్గం. అయితే, ఆరోగ్య భీమా పాలసీలు తీసుకునే ముందు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. పాలసీ ఎంపికలో చిన్న పొరపాటు చేసినా ఆశించిన ఫలితం ఉండదని గుర్తించుకోవాలి.

ఇంకా చదవండి ...
ఓవైపు మారుతున్న జీవనశైలితో వస్తున్న జబ్బులు, మరోవైపు ఇప్పటికే ఉన్న సీజనల్ వ్యాధులు మనుషులపై అటాక్ చేస్తున్న తరుణంలో అనారోగ్యం భారీన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీటికి తోడు కరోనా మహమ్మారి విజృంభన అందరినీ ఆరోగ్య బీమా(Health insurance) పాలసీ వైపు చూసేలా చేసింది. దీంతో ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికి తప్పనిసరి అవసరంగా మార్చింది. కరోనా(Carona) సోకిన వారు ఆసుపత్రిలో చేరి చికిత్స చేసుకోవాలంటే లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలంటే ఆరోగ్య భీమా పాలసీలను తీసుకోవడం ఉత్తమ మార్గం. అయితే, ఆరోగ్య భీమా పాలసీలు తీసుకునే ముందు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. పాలసీ ఎంపికలో చిన్న పొరపాటు చేసినా ఆశించిన ఫలితం ఉండదని గుర్తించుకోవాలి. కరోనా తీవ్రతతో వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో పలు ఆస్పత్రులు బీమా పాలసీలను పరిగణలోకి తీసుకోవడం లేదనే ఫిర్యాదులు అనేకం వస్తున్నాయి.

అయితే, బీమా కంపెనీల విజ్ఞప్తులకు అనుగుణంగా డిసెంబర్ 3 న, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఆరోగ్య బీమా ప్రీమియంలను 5 శాతం మేర పెంచుకోవానికి అనుమతిచ్చింది. కానీ తమ ఆరోగ్య బీమా ప్రీమియం(Premium)లో 30-–35 శాతం మేర పెరిగినట్లు పలువురు వినియోగదారుల నుంచి IRDAI కి అనేక ఫిర్యాదు అందుతున్నాయి.

ఐఆర్డీఏఐ ఏమి చెబుతుంది?
వాస్తవానికి IRDAI బేస్ ప్రీమియాన్ని 5 శాతం మేర మాత్రమే పెంచుకోవడానికి మాత్రమే స్వతంత్ర బీమా సంస్థలకు అనుమతించింది. IRDAI నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఆయా బీమా సంస్థలు ప్రీమియం(premium) రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఉంది. బీమా సంస్థలు ప్రీమియం రేట్లు పెంచడానికి హేతుబద్ధత కలిగి ఉండాలని IRDAI నియమ నిబంధనలు చెబుతున్నాయి. కాబట్టి, ఒక కస్టమర్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన సందర్భంలో, బీమా ధర పెరుగుదలకు కారణాలను IRDAIకి సమర్పించాల్సి ఉంటుంది.

ప్రీమియం రేట్లను పెంచడానికి కారణం?
ఆరోగ్య బీమా కంపెనీలు వారి క్లెయిమ్(Claims) అనుభవం, పూచీకత్తు సూత్రం ఆధారంగా ప్రీమియం(premium) రేట్లను పెంచుకోవడానికి అనుమతించబడతాయని బీమా అధికారులు చెబుతున్నారు. వారు మాట్లాడుతూ "ఇది మాకు కఠినమైన సంవత్సరం. ఆసుపత్రులలో కరోనావైరస్ చికిత్స కారణంగా క్లెయిమ్ల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కోవిడ్–-19తో వైద్య ద్రవ్యోల్బణం 19.5 శాతానికి చేరుకుంది. కస్టమర్ల కోసం ధరలను పెంచడం తప్ప మాకు వేరే మార్గం లేదు.” అని చెబుతున్నారు.

కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆసుపత్రులలో నియంత్రణ చర్యలు తీసుకుంటున్న కారణంగా 2019లో 18 శాతం ఉన్న వైద్య ద్రవ్యోల్బణం అకస్మాత్తుగా పెరిగింది. దీంతో వినియోగదారులు(customers) అధిక ఖర్చులను భరించవలసి ఉంటుందని ఆసుపత్రులు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా, 45 ఏళ్లు పైబడిన కస్టమర్లకు, వృద్ధాప్యంలో ఉన్నవారిలో అనారోగ్య ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల వారి నుంచి అధిక ప్రీమియం వసూలు చేస్తున్నాయి ఆయా ఆరోగ్య బీమా సంస్థలు.

2021లోనైనా ఉపశమనం లభిస్తుందా?
ఆరోగ్య బీమా ప్రీమియం పెరుగుదల ధోరణి 2021 లో కూడా కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వైద్య ద్రవ్యోల్బణం(Medical inflation), కోవిడ్ 19 ఖర్చులు పెరగడంతో ఆరోగ్య బీమా పాలసీలను కొనసాగించాలంటే మరోసారి ధరలు పెంచే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Corona, Covid-19, Health Insurance

తదుపరి వార్తలు