Home /News /business /

HERE IS THE LIST OF TOP THREE TRENDS IN PERSONAL FINANCE THAT MAY GAIN PACE IN 2022 NS GH

New Year Trends: న్యూ ఇయర్ లో వేగం పుంజుకోనున్న టాప్-3 ఫైన్సాన్షియల్ సర్వీసెస్ ట్రెండ్స్ ఇవే.. ఓ లుక్కేయండి

న్యూ ఇయర్ లో వేగం పుంజుకోనున్న టాప్-3 ఫైన్సాన్షియల్ సర్వీసెస్ ట్రెండ్స్ ఇవే.. ఓ లుక్కేయండి

న్యూ ఇయర్ లో వేగం పుంజుకోనున్న టాప్-3 ఫైన్సాన్షియల్ సర్వీసెస్ ట్రెండ్స్ ఇవే.. ఓ లుక్కేయండి

2022లో కొన్ని ట్రెండ్స్ మీ పర్సనల్ ఫైనాన్స్‌పై గణనీయమైన ప్రభావం చూపవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ జాబితాలో ఉండే మూడు ముఖ్యమైన అంశాలు ఏవో చూద్దాం.

ప్రస్తుతం మనం కొత్త సంవత్సరం (New Year 2022) ప్రారంభ దశలో ఉన్నాం. ఈ సమయంలో చాలామంది గత ఏడాది కాలంగా వచ్చిన మార్పులను గుర్తుకు తెచ్చుకుంటారు. వార్తల్లో నిలిచిన, ట్రెండింగ్ (Trending) టాపిక్స్‌ గురించి చాలామంది చర్చించుకుంటారు. అయితే ఇలాంటి మార్పులన్నీ ఏదో ఒక విధంగా మన ఆర్థిక  లక్ష్యాలపై (Financial Goals) ఎంతోకొంత ప్రభావం చూపిస్తాయి. ఈ నేపథ్యంలో 2022లో కొన్ని ట్రెండ్స్ మీ పర్సనల్ ఫైనాన్స్‌పై గణనీయమైన ప్రభావం చూపవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ జాబితాలో ఉండే మూడు ముఖ్యమైన అంశాలు ఏవో చూద్దాం.

BNPL:
‘ఇప్పుడు కొనుగోలు చేయండి, తర్వాత చెల్లించండి’ (BNPL) అనేది ఆర్థిక సేవలలో తాజా సంచలనం. దీని ప్రకారం.. మీకు కావలసినదాన్ని ఇప్పుడే కొనుగోలు చేయవచ్చు, కానీ అందుకు అయ్యే ఖర్చును వడ్డీ లేని వాయిదాలలో చెల్లించవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలు, రిటైల్ అవుట్‌లెట్‌లు, ఫిన్‌టెక్ సంస్థలు తమ వినియోగదారులకు ఈ ఆఫర్లను అందిస్తున్నాయి. బ్యాంకులు కూడా తమ డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్లపై ఇలాంటి ఆఫర్లు అందిస్తున్నాయి. సాధారణంగా BNPL సదుపాయం ద్వారా 3-6 నెలల వ్యవధిలో వడ్డీ-రహిత వాయిదాలను చెల్లించే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
New Year Car Discounts: కారు కొనాలనుకుంటున్న వారికి అదిరిపోయే శుభవార్త.. ఇయర్ ఎండ్​ సేల్​లో బంపరాఫర్లు.. టాప్​ 5 డిస్కౌంట్లు ఇవే..

దీనికి క్రెడిట్ హిస్టరీ లేదా క్రెడిట్ స్కోర్ అవసరం లేదు. ఈ ఫెసిలిటీని కొన్ని నిమిషాలు లేదా గంటల్లోనే సంస్థలు ఆమోదిస్తాయి. అయితే వడ్డీ రహిత చెల్లింపులకు మించి రీపేమెంట్ ఆలస్యమైతే సంస్థలు 30 శాతం వరకు జరిమానా విధించవచ్చు. క్రెడిట్ కార్డ్‌లు లేకుండా, పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ కొనుగోళ్లు చేసే వారి కోసం ఈ విధానాన్ని ఆర్థిక సంస్థలు ప్రవేశపెట్టాయి. రానున్న రోజుల్లో పెద్ద బ్యాంకులు కూడా ఈ ఫెసిలిటీలను ప్రారంభించే అవకాశం ఉంది.
New Tax Rules: వ్యాపారులకు అలర్ట్... జనవరి 1 నుంచి కొత్త జీఎస్‌టీ రూల్స్

ETFలు:
మహమ్మారి సమయంలో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ద్వారా రిటైల్ పెట్టుబడులు బాగా పెరిగాయి. ఈ విభాగంలో నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు 2020 నవంబర్ చివరి నాటికి రూ. 2,30,000 కోట్ల నుంచి 2021 నవంబర్ నాటికి రూ.3,64,000 కోట్లకు పెరిగాయి. మొత్తం ఓపెన్-ఎండ్ మ్యూచువల్ ఫండ్ ఆస్తులలో 29 శాతం వృద్ధి నమోదైతే.. ఈటీఎఫ్‌ విభాగం ఒక సంవత్సరంలో 58 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈటీఎఫ్‌లు వ్యక్తిగత పెట్టుబడిదారులకు, ముఖ్యంగా డిజిటల్ ప్లాట్‌ఫాంలతో ఇన్వెస్ట్ చేసేవారికి బెస్ట్ ఆప్షన్లుగా చెప్పుకోవచ్చు. వచ్చే ఏడాది ఈటీఎఫ్‌లు సాధారణ ఇన్వెస్టర్ల దృష్టిని సైతం ఆకర్షించవచ్చు.
Financial Deadlines: డిసెంబర్ 31 లోగా పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇవే...

నియోబ్యాంక్‌లు:
నియోబ్యాంక్‌లు లేదా డిజిటల్ బ్యాంకులు ఇండియన్ పర్సనల్ ఫైనాన్స్ రంగంలో కీలక భాగాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. సంప్రదాయ బ్యాంకుల మాదిరిగా కాకుండా, నియోబ్యాంక్‌లు డిజిటల్‌ విధానంలోనే పనిచేస్తాయి. మనీ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన పనులన్నీ బ్యాంకింగ్ యాప్‌ ద్వారానే అందుబాటులో ఉంటాయి. మనీ ట్రాన్స్‌ఫర్స్, బడ్జెట్ సాధనాలు, ఇన్‌స్టంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు, పేమెంట్ రిమైండర్‌లు, డిజిటల్ రసీదులు... వంటి సేవలన్నీ నియోబ్యాంక్‌లు కస్టమర్‌కు తక్కువ ధరకే అందిస్తాయి.

నియోబ్యాంక్ అనేది.. తమ కస్టమర్లకు ఇలాంటి సేవలను అందించడానికి సంప్రదాయ బ్యాంకుతో సంబంధాలను కలిగి ఉండే ఫిన్‌టెక్ సంస్థ. ఇన్‌స్టంట్ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నప్పటికీ, వీటికి ఇంకా పూర్తి స్థాయిలో ఆదరణ లభించట్లేదు. అయితే యూత్‌ను టార్గెట్ చేస్తున్న నియో సంస్థలు రానున్న రోజుల్లో పర్సనల్ ఫైనాన్సింగ్‌లో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Bank, Finance, New Year 2022, Online shopping, Year Ender 2020

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు