Home /News /business /

HERE IS THE LIST OF TOP FIVE NEW YEAR DISCOUNTS OFFERED ON CARS NS GH

New Year Car Discounts: కారు కొనాలనకుంటున్న వారికి అదిరిపోయే శుభవార్త.. ఇయర్ ఎండ్​ సేల్​లో బంపరాఫర్లు.. టాప్​ 5 డిస్కౌంట్లు ఇవే..

కారు కొనాలనకుంటున్న వారికి అదిరిపోయే శుభవార్త.. ఇయర్ ఎండ్​ సేల్​లో బంపరాఫర్లు.. వివరాలివే

కారు కొనాలనకుంటున్న వారికి అదిరిపోయే శుభవార్త.. ఇయర్ ఎండ్​ సేల్​లో బంపరాఫర్లు.. వివరాలివే

కొత్త కారు (New Cars) కొనాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్లు ప్రకటించాయి ప్రముఖ వాహన తయారీ సంస్థలు. తమ ఇన్వెంటరీ స్టాక్​ క్లియర్ చేసుకోవడానికి, కొత్త ఏడాదిలోకి గ్రాండ్​గా వెల్​కమ్​ చెప్పేందుకు భారీ డిస్కౌంట్లు (Discounts on Cars) ప్రకటించాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
మరి కొద్ది రోజుల్లో 2022 నూతన సంవత్సరంలోకి (New Year 2022) అడుగుపెట్టబోతున్నాం. ఈ తరుణంలో కొత్త కారు (New Car) కొనాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్లు ప్రకటించాయి ప్రముఖ వాహన తయారీ సంస్థలు. తమ ఇన్వెంటరీ స్టాక్​ క్లియర్ చేసుకోవడానికి, కొత్త ఏడాదిలోకి (New Year) గ్రాండ్​గా వెల్​కమ్​ చెప్పేందుకు భారీ డిస్కౌంట్లు (Discounts) ప్రకటించాయి. మీరు కొత్త కారు కొనుగోలు చేయాలని చూస్తున్నా, లేదా మీ పాత కారును ఎక్స్ఛేంజ్ (Old Car Exchange) చేయాలనుకున్నా, ఇదే మంచి సమయంగా చెప్పవచ్చు. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు అందిస్తోన్న టాప్​ 5 న్యూ ఇయర్​ డిస్కౌంట్లను పరిశీలిద్దాం.

రెనాల్ట్ డస్టర్ (Renault Duster):
ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్ కంపెనీ తన బెస్ట్ సెల్లర్‌లలో ఒకటైన డస్టర్​ వేరియంట్​పై రూ. 1,30,000 భారీ డిస్కౌంట్​ అందిస్తోంది. రెనాల్ట్ డస్టర్​పై రూ.50 వేల క్యాష్​ డిస్కౌంట్​, రూ.50 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. ఇక, వీటికి అదనంగా రూ.30 వేల విలువైన కార్పొరేట్ ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇలా మొత్తం రూ. 1,30,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు.
Tax benefits on electric vehicles: లోన్ తీసుకొని ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా...సెక్ష‌న్ 80ఈఈబీ వడ్డీపై లక్షన్నర మినహాయింపు పొందండిలా..

మహీంద్రా ఎక్స్​యూవీ 300(Mahindra XUV300):
మహీంద్రా & మహీంద్రా తన ఎన్​క్యాప్​ 5 స్టార్-రేటెడ్, ఎక్స్​యూవీ 300పై రూ.69 వేల డిస్కౌంట్ అందిస్తోంది. దీనిలో రూ. 30 వేల క్యాష్​ డిస్కౌంట్​, రూ. 25 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10 వేల విలువైన యాక్సెసరీలు, రూ. 4 వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ​వంటివి ఉన్నాయి.
Car Loan: కారు లోన్ తీసుకుంటున్నారా, అయితే కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవే...లేకపోతే భారీగా నష్టపోతారు...

హ్యుందాయ్ ఆరా(Hyundai Aura):
మారుతి సుజుకి డిజైర్ కార్లకు గట్టి పోటీనిస్తూ మంచి అమ్మకాలను ప్రదర్శిస్తోంది హ్యుందాయ్ ఆరా. ఈ కాంపాక్ట్-సెడాన్ కారు సీఎన్​జీ వేరియంట్‌లో కూడా లభిస్తుంది. 2022 న్యూ ఇయర్​ సందర్భంగా హ్యుందాయ్ ఆరా టర్బో ట్రిమ్​ వేరియంట్​పై రూ. 50,000 విలువైన డిస్కౌంట్​ అందిస్తోంది. ఈ సీఎన్​జీ వేరియంట్‌పై మరో రూ. 15 వేల బెనిఫిట్స్​ కూడా పొందవచ్చు.

మారుతి సుజుకి ఆల్టో 800(Maruti Suzuki Alto 800):
మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఎంచుకునే మారుతి సుజుకి ఆల్టో 800పై రూ. 48 వేల విలువైన డిస్కౌంట్​ అందిస్తోంది. ఇందులో రూ. 30 వేల విలువైన క్యాష్ బెనిఫిట్​​, రూ. 15 వేల విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్ వంటివి ఉన్నాయి. అదనంగా, రూ. 3 వేల విలువైన కార్పొరేట్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు.

టాటా హారియర్(Tata Harrier):
భారత మార్కెట్లో లభించే అత్యుత్తమ ఎస్​యూవీల్లో ఒకటైన టాటా హారియర్ అతి తక్కువ సమయంలోనే మంచి ఆదరణ పొందింది. న్యూ ఇయర్​ సందర్భంగా టాటా హారియన్​పై రూ. 40,000 విలువైన డిస్కౌంట్​ అందిస్తోంది. అదనంగా రూ. 25 వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్​ కూడా పొందవచ్చు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nikhil Kumar S
First published:

Tags: CAR, Cars, New Year 2022, Year Ender

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు