CNG Cars: పెట్రోల్ ధరల పెంపుతో సిఎన్​జి కార్ల వైపు చూస్తున్నారా? అయితే.. ఈ టాప్​ 5 కార్లను పరిశీలించండి

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆ భారం తట్టుకోలేక ప్రజలు ప్రత్యామ్నాయ ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాల వైపు చూస్తున్నారు.

  • Share this:
దేశంలో ఆకాశాన్నంటుతున్న పెట్రోల్​, డీజిల్​ ధరలతో ప్రజలు ప్రత్యామ్నాయ వాహనాల వైపు చూస్తున్నారు. తద్వారా ఎలక్ట్రిక్​ వాహనాలతో పాటు, సీఎన్​జీ వాహనాలకు డిమాండ్​ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి వాహన తయారీ సంస్థలు సిఎన్​జి కార్లను విక్రయిస్తున్నాయి. ఇవి డీజిల్​, పెట్రోల్​ వాహనాలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్​లో లభిస్తున్న టాప్-5 సీఎన్​జీ కార్లను పరిశీలిద్దాం.
Tata Altroz: అదిరిపోయే లుక్​తో టాటా ఆల్ట్రోజ్ డార్క్ ఎడిషన్ లాంచ్.. ధర ఎంతో తెలుసా..?

మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio)
దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి నుంచి విడుదలైన సెలెరియో కారు సిఎన్​జి ఆప్షన్‌లో కూడా లభిస్తుంది. ఈ మోడల్​ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది 31.79 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని పెట్రోల్ వేరియంట్​ మాత్రం 21.63 కిలోమీటర్ల మైలేజీని మాత్రమే ఇస్తుంది. సెలెరియో సిఎన్​జి వేరియంట్​ విఎక్స్​ఐ, విఎక్స్​ఐ (ఓ) ట్రిమ్​ వేరియంట్లలో లభిస్తుంది. ఈ వేరియంట్లు రూ. 4.46 లక్షల నుంచి 5.73 లక్షల ధరల శ్రేణిలో అందుబాటులో ఉంటాయి.

మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto)
భారతదేశంలోని అన్ని సిఎన్‌జి కార్లలో కెల్లా ఉత్తమ మైలేజీని అందిస్తుంది. మొత్తం 6 వేరియంట్లలో లభించే ఈ కారు రోజువారీ ప్రయాణానికి అనువుగా ఉంటుంది. ఈ 5 సీట్ల వాహనంలో 177 లీటర్ బూట్ స్పేస్​ను అందించారు. దీనిలోని 0.8 లీటర్ ఇంజిన్ గరిష్టంగా 48 పిఎస్, 69 ఎన్ఎమ్ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆల్టో సిఎన్‌జి కారు రూ .2.88 నుంచి 4.09 లక్షల మధ్య లభిస్తుంది.

హ్యుందాయ్ సాంట్రో (Hyundai Santro)
హ్యుందాయ్​ సాంట్రో భారతదేశంలో అత్యంత పాపులర్​, సక్సెస్ అయిన​ కార్లలో ఒకటిగా నిలిచింది. ఈ సిఎన్‌జి వాహనం దాని పెట్రోల్ వేరియంట్​తో పోల్చితే ఎక్కువ మైలేజీ ఇస్తుంది. తద్వారా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ఒక కిలో సీఎన్​జీ గ్యాస్​తో 30.48 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ధర విషయానికి వస్తే ఇది రూ. 4.58 లక్షల నుంచి 6.26 లక్షలు మధ్య లభిస్తుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ (Hyundai Grand i10 Nios)
ఇది హ్యుందాయ్​​ ప్రసిద్ధ, స్టైలిష్​ సిఎన్‌జి మోడల్​. ఈ కారు యజమానులకు ఉత్తమమైన పనితీరును అందిస్తుంది. ఇది 1.2 లీటర్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ కారు గరిష్టంగా 69 పిఎస్ శక్తిని, 95 ఎన్ఎమ్ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. కిలో సిఎన్​జి గ్యాస్​తో 20.7 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. భారత మార్కెట్​లో ఈ కారు రూ .6.63 లక్షల ధర వద్ద లభిస్తుంది.

హ్యుందాయ్ ఆరా (Hyundai Aura)
ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న ఉత్తమ సిఎన్‌జి సెడాన్​ కార్లలో ఇది ఒకటి. దీన్ని ఇటీవలే CNG కిట్, BS-VI ఎమిషన్​ స్టాండర్డ్స్​తో అప్​గ్రేడ్​ చేసింది. హ్యుందాయ్​ ఆరా ఎస్ వేరియంట్​లో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 1.2 లీటర్ ఇంజిన్‌ను అందించింది. ఇది 83PS,114Nm గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సగటున 25.4 కిలోమీటర్ల మైలేజీతో వస్తుంది. భారత మార్కెట్​లో ఇది 57.28 లక్షల ధర వద్ద లభిస్తుంది.
Published by:Nikhil Kumar S
First published: