హోమ్ /వార్తలు /బిజినెస్ /

New EV Cars: లాంచింగ్‌కు సిద్ధమైన టాటా మోటార్స్‌ టియాగో.. ఈ నెలలో లాంచ్ కానున్న ఇతర ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

New EV Cars: లాంచింగ్‌కు సిద్ధమైన టాటా మోటార్స్‌ టియాగో.. ఈ నెలలో లాంచ్ కానున్న ఇతర ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎలక్ట్రిక్ వెహికల్స్‌(EV)కు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతుండడంతో ఈ సెగ్మెంట్‌లో ప్యాసింజర్ వెహికల్స్‌పై తయారీ సంస్థలు ప్రధానంగా దృష్టిసారిస్తున్నాయి. అందులోనూ పండుగ సీజన్ కావడంతో ఈవీకి సంబంధించిన ఆఫర్స్, లాంచ్, గ్లిమ్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కావడంతో ఆటోమొబైల్ (automobile) కంపెనీలు తమ మార్కెట్‌ను పెంచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ (EV)కు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతుండడంతో ఈ సెగ్మెంట్‌లో ప్యాసింజర్ వెహికల్స్‌పై తయారీ సంస్థలు ప్రధానంగా దృష్టిసారిస్తున్నాయి. అందులోనూ పండుగ సీజన్ కావడంతో ఈవీకి సంబంధించిన ఆఫర్స్, లాంచ్, గ్లిమ్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ నెలలో లాంచ్ కానున్న ఈవీ మోడల్స్

ఈ నెలలో చాలా కంపెనీలు తమ ఈవీలను లాంచ్ చేసి మార్కెట్‌ను మరింత పెంచుకోవాలని చూస్తున్నాయి. ఈ జాబితాలో దిగ్గజ తయారీ సంస్థ టాటా మోటార్స్ కూడా ఉంది. ఈ సంస్థకు చెందిన టియాగో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ఈనెల 28న భారత మార్కెట్లలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. లగ్జరీకార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్-బెంజ్ కూడా ఈ నెలలోనే EQS 580 ఎలక్ట్రిక్ వెర్షన్ లగ్జరీ కారును లాంచ్ చేయనుంది. ఇండియాలో మొదటిసారిగా అసెంబుల్ చేసిన లగ్జరీ కారు ఇదే కావడం గమనార్హం. దీన్ని సెప్టెంబర్ 30న లాంచ్ చేయటానికి ఏర్పాట్లు చేస్తోంది.

Cheapest EV: తక్కువ ధరతో ఎక్కువ మైలేజీ ఇచ్చే 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. ఓ లుక్కేయండి

టాటా మోటర్స్ టియాగో ఈవీ

టియాగో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ఈ నెలాఖరులో భారత మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది. ఇప్పటికే నెక్సాన్‌, నెక్సాన్ మ్యాక్స్, టిగోర్‌ ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తూ.. ఈ సెగ్మెంట్‌లో దేశీయంగా 88 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టియాగో ఈవీను కూడా తీసుకొచ్చి తన మార్కెట్‌ను మరింత విస్తృత పరచుకోవాలని టాటా మోటార్స్ భావిస్తోంది. లాంచ్ అయిన తర్వాత దీని ధర రూ.10 లక్షల వరకు ఉండవచ్చు.

EV Charging Stations: ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. రూ.లక్షల్లో సబ్సిడీ పొందే అవకాశం

మహీంద్రా XUV400 EV

ఇక మహీంద్రా కంపెనీ XUV400 మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ SUVను ఈ నెల ప్రారంభంలో ప్రదర్శించింది. దీన్ని 2023 జనవరిలో లాంచ్ చేయనుంది. XUV400ను మొదటగా ఆటో ఎక్స్‌పో -2020లో ప్రదర్శించారు. సదరు తయారీ సంస్థ చెన్నైలోని తన SUV ప్రూవింగ్ గ్రౌండ్స్‌లో XUV400 EVని పరీక్షించింది. వచ్చే ఏడాది జనవరిలో లాంచ్ కానున్న ఈ ఈవీ ధర దాదాపు రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉండవచ్చని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మెర్సిడెస్-బెంజ్ EQS 580 EV

విలాసవంతమైన కార్ల తయారీకి మెర్సిడెస్-బెంజ్ ప్రసిద్ధి చెందింది. ఇటీవల కాలంలో ఈ కంపెనీ ఈవీలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే పర్ఫార్మెన్స్-బేస్డ్ ఎలక్ట్రిక్ వెర్షన్ AMG EQS 53ను గత నెలలో లాంచ్ చేసింది. దీన్ని ధర రూ.2.45 కోట్లు (ఎక్స్ షోరూమ్). తాజాగా ఈవీలో మరో లగ్జరీ కారు EQS 580ను లాంచ్ చేయటానికి ఏర్పాట్లు చేస్తోంది. పూణేలోని చకన్ ప్లాంట్‌లో దీన్ని తయారు చేశారు. దీని ధర రూ.2కోట్ల లోపు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇతర తయారీ సంస్థలు కూడా కొత్త మోడళ్లను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. MG మోటార్ ఇండియా సరసమైన ధరలో EVను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఇక హ్యుందాయ్ కూడా Ioniq 5కు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Automobiles, Electric cars, Electric Vehicles

ఉత్తమ కథలు