హోమ్ /వార్తలు /బిజినెస్ /

Maruti Discount Offers: మారుతి సుజుకి కార్లపై స్పెషల్ ఫెస్టివల్ ఆఫర్లు.. ఈ మోడళ్లపై భారీ డిస్కౌంట్..

Maruti Discount Offers: మారుతి సుజుకి కార్లపై స్పెషల్ ఫెస్టివల్ ఆఫర్లు.. ఈ మోడళ్లపై భారీ డిస్కౌంట్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Maruti Discount Offers: పండుగల సీజన్ ప్రారంభమవుతున్న క్రమంలో భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి. ఆఫర్ల వివరాలు చెక్ చేద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

పండుగల సీజన్ ప్రారంభమవుతున్న క్రమంలో భారీ డిస్కౌంట్ ఆఫర్లు (Huge Discounts) ప్రకటించింది దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి (Maruti Suzuki). ఫెస్టివల్ సీజన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి చాలా కీలకం. కంపెనీ వార్షిక అమ్మకాలలో అత్యధిక సేల్స్ ఈ పండుగల సమయంలో (Festive Season)నే అంటే ఈ రెండు నెలల్లోనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో పలు మోడళ్లపై సెప్టెంబర్ నెల నుంచి డిస్కౌంట్లు అందిస్తామని ప్రకటించింది. ఆఫర్ల వివరాలు చెక్ చేద్దాం.

* మారుతీ సుజుకి సెలెరియో

మారుతీ సుజుకి మారుతీ సెలెరియో మోడల్‌ మాన్యువల్ వేరియంట్స్‌పై రూ.49,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఆటోమేటిక్ (AMT) వెర్షన్స్‌పై రూ.34,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది.

* మారుతీ సుజుకి ఆల్టో 800

భారతీయ మార్కెట్‌లో చాలా ఏళ్లుగా ఎక్కువగా సేల్ అవుతున్న మోడల్ మారుతీ సుజుకి ఆల్టో 800 (The Alto 800). ఈ మోడల్‌పైన రూ.29,000 వరకు డిస్కౌంట్ రానుంది. కస్టమర్ ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి డిస్కౌంట్ ఆఫర్ చేంజ్ అవుతుంది. మైలేజీ పరంగా గొప్పగా ఉండే ఈ వెహికల్‌ సరసమైన ధరకు ఇండియన్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

* మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో

మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso) రగ్గ్‌డ్ హ్యాచ్‌బ్యాక్‌పై రూ.49,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎస్-ప్రెస్సో ఆటోమేటిక్ ఏఎంటీ వేరియంట్స్‌పైన (AMT Variants) మాత్రం రూ.34,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. 1.0 లీటర్ పెట్రోల్ లేదా CNG పవర్ ట్రెయిన్‌తో ఎస్-ప్రెస్సో మోడల్ లభిస్తుంది.

* మారుతీ సుజుకి స్విఫ్ట్

పాపులర్ హ్యాచ్‌బ్యాక్‌లపై మారుతీ కంపెనీ ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తోంది. స్విఫ్ట్ (Swift) ఆటోమేటిక్ (AMT) వేరియంట్స్‌పైన రూ.45,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. మ్యానువల్ వేరియంట్స్‌పైన మాత్రం రూ.25,000 బెనిఫిట్ ఉంటుంది.

* మారుతీ సుజుకి డిజైర్

మారుతీ సుజుకి డిజైర్ (Maruti Suzuki DZire) (AMT) వేరియంట్లపై కంపెనీ రూ.రూ.40,000 డిస్కౌంట్ అందిస్తుంది. మ్యానువల్ వేరియంట్లపై రూ.20,000 ధర తగ్గనుంది.

ఇది కూడా చదవండి : మారుతి సుజుకి గ్రాండ్ విటారా వర్సెస్ టయోటా అర్బన్ క్రూయిజర్ హై రైడర్.. రెండు SUVలను పోల్చి చూడండి..

* మారుతీ సుజుకి వ్యాగన్ఆర్

వ్యాగన్ ఆర్ (Maruti Suzuki WagonR) ప్రస్తుతం 1.0 లీటర్ పెట్రోల్, 1.0 బయో ఫ్యుయల్, 1.2 లీటర్ పెట్రోల్.. వంటి మూడు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఆఫర్లో భాగంగా మ్యానువల్ వేరియంట్లపై రూ.39,000, ఏఎంటీ(AMT) వేరియంట్లపై రూ.34,000 వరకు ధర తగ్గుతుంది.

మారుతీ సుజుకి కంపెనీ ఇస్తున్న డిస్కౌంట్ ఆఫర్ల ద్వారా రూ.49,000 వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్స్ ప్రస్తుతం ఆటోమేకర్ అరేనా లైనప్ కార్లపై అందిస్తోంది. ఇందులో కార్పొరేట్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలిసి ఉంటాయి. కాగా, మారుతీ సుజుకి ఎర్టిగా CNG వేరియంట్‌లతో పాటు కొత్త ఆల్టో K10, బ్రెజ్జాపై మాత్రం ఎలాంటి డిస్కౌంట్లు ప్రకటించలేదు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, MARUTI SUZUKI, New cars

ఉత్తమ కథలు