‘‘ఇళ్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’’ అనే సామెతను మనం అనేక సార్లు వినే ఉంటాం. ఈ రెండు సందర్భాల్లో మనం పెట్టే ఖర్చు తిరిగి రాకపోవడంతోనే ఈ సామెతకు అంత ప్రాధాన్యత ఉంది. ఈ రెండింటి వెనక శ్రమ మామూలుది కాదు. డబ్బులున్న వారి సంగతి అటుంచితే.. సామాన్యుడు ఇళ్లు కొనడం (New Home) అంటే అతనికి ఇది మామూలు విషయం కాదు. దీంతో బ్యాంకులను (Bank Loan) ఆశ్రయించి లోన్ల ద్వారా తమ సొంతింటి కలను నెరవేర్చుకుంటారు అనేక మంది. అయితే.. మీరు ఏదైనా బ్యాంక్ లోన్ ద్వారా సొంతింటి కలను నెరవేర్చుకోవాలని భావిస్తే.. మీరు ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకోవడం మంచిది.
1) ఆర్థిక స్థితిపై అవగాహన..
మీరు ఇంటిని కొనుగోలు చేసే ముందు మీరు మీ ఆర్థిక స్థితిని మరియు డౌన్ పేమెంట్‌లు మరియు ఈఎంఐ గురించి ఆలోచించుకోవాలి. మీ ఆదాయం, ఖర్చు తదితర వివరాలను పరిగణలోకి తీసకుని ఈఎంఐ ఎంత ఉండాలనేది ప్లాన్ చేసుకోవాలి. ఎన్ని ఏళ్లు మనం ఈఎంఐ చెల్లించాలి. అప్పటివరకు మనకు పెరగబోయే ఖర్చులు ఏంటనేది కూడా ముందుగానే అంచనా వేసుకుని నిర్ణయం తీసుకోవాలి.
Home Loan EMIs: భారీ షాకిచ్చిన బ్యాంకులు.. లోన్లపై వడ్డీ రేట్లు పెంపు.. హోమ్ లోన్ ఈఎంఐ ఇక భారమే..
2) క్రెడిట్ స్కోర్ చెక్ చేయండి!
మీ కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, మీ క్రెడిట్ స్కోర్ తప్పనిసరిగా 750 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అయితే లోన్ కోసం బ్యాంకును సంప్రదించే ముందు మీరు ఇప్పటికే ఉన్న చిన్న చిన్న ఈఎంఐలను, లోన్లను క్లీయర్ చేసుకోవడం మంచిది.
3) RERA మరియు ఇతర పత్రాలు
గృహ కొనుగోలుదారులు ముందుగా తాము కొనుగోలు చేసే ప్రాపర్టీకి అవసరమైన ధృవీకరణ పత్రాలు, చట్టపరమైన గుర్తింపు మరియు పర్మిషన్లు ఉన్నాయా? లేదా? అన్నది నిర్ధారించుకోవాలి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) వద్ద ఆస్తి రిజిస్టర్ చేయబడిందో లేదో మీరు తనిఖీ చేయాలి.
4) టైటిల్ డీడ్ మరియు ఇంక్యుబేషన్ సర్టిఫికేట్
మీ కొత్త ఇంటిలో పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు తనిఖీ చేయవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆస్తి లేదా ప్రాజెక్ట్ ఆధారిత భూమి టైటిల్ డీడ్. టైటిల్ డీడ్ అనేది ఆస్తి యజమాని, యాజమాన్యాన్ని విక్రయించే లేదా బదిలీ చేసే హక్కు. పత్రాలను సమీక్షించడానికి మీరు న్యాయవాది సహాయాన్ని కూడా పొందవచ్చు.
5) స్టాంప్ ఫీజు మరియు ఇతర రుసుములు
కొత్త ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు మీరు అనేక ఇతర రుసుములను చెల్లించవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతర ఛార్జీలతో మీ ఇంటికి అయ్యే ధర మరింతగా పెరుగుతుంది. జీఎస్టీ కూడా ఉంటుంది. ఇళ్లు కొనడానికి ముందే ఈ అంశాలపై అవగాహన పెంచుకోవడం మంచిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Home loan, Real estate