హోమ్ /వార్తలు /బిజినెస్ /

Highest Mileage Bikes: ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ ల కోసం వెతుకుతున్నారా? అయితే, ఈ 3 బైక్ లపై ఓ లుక్కేయండి

Highest Mileage Bikes: ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ ల కోసం వెతుకుతున్నారా? అయితే, ఈ 3 బైక్ లపై ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెట్రోల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో అత్యధికంగా మైలేజ్ ఇచ్చే బైక్ ల కోసం వెతుకున్నారా? అయితే, అత్యధికంగా మైలేజ్ ఇచ్చే ఈ 3 బైక్ లపై ఓ లుక్కేయండి.

పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే. దీంతో బైక్‌ ను బయటకు తీయాలంటేనే కష్టంగా మారిన పరిస్థితి. ఖర్చు తగ్గించుకోవడానికి భారీగా మైలేజ్ వచ్చే బైక్ ల కోసం అంతా వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో హీరో కంపెనీ నుంచి అత్యధికంగా మైలేజీనిచ్చే కొన్ని అత్యుత్తమ బైక్‌లను చూద్దాం. హీరో నుండి వచ్చిన ఈ బైక్ లు ఆధునిక మరియు అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ హీరో బైకులు ఎక్కువ మైలేజీని ఇస్తాయి. 1 లీటర్ పెట్రోల్ తో హీరో బైక్ చాలా దూరం వెళ్లగలదు. హీరో భారతదేశంలో చాలా పాపులర్ కంపెనీ. హీరో కంపెనీ బడ్జెట్‌లో వివిధ రకాల బైక్‌లను కలిగి ఉంది. ఆ బైక్‌లన్నీ శక్తివంతమైన ఇంజన్‌, గేర్‌బాక్స్‌లను కలిగి ఉంటాయి. ఫలితంగా, హీరో బైక్‌లు సులభంగా ఎక్కువ మైలేజీని అందిస్తాయి. ఈ బైక్ చమురును ఆదా చేస్తుంది.

హీరో సూపర్ స్ప్లెండర్ -

ఈ హీరో బైక్‌లో 124.6 సీసీ ఇంజన్ ఉంది. ఈ బైక్ లీటర్ కు దాదాపు 60 కి.మీల మైలేజీని ఇస్తుంది. ఈ హీరో బైక్ ధర దాదాపు రూ.83,898. ఫలితంగా ఈ బైక్‌లు తక్కువ పెట్రోల్‌తో చాలా దూరం వెళ్లగలవు.

Third-Party Motor Insurance: వాహనదారులకు షాక్.. భారీగా పెరగనున్న మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం.. ఎంతంటే?

హీరో HF డీలక్స్ -

ఈ హీరో బైక్‌లో BS6 ఇంజన్ ఉంటుంది. ఈ ధర ప్రతి ఒక్కరి బడ్జెట్‌లో ఉంటుంది. ఈ Hero బైక్ ధర రూ.52,036 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్ మైలేజ్ లీటరుకు 63 కి.మీ. ఈ బైక్‌లో ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజన్ ఉంది. ఇదొక స్టైలిష్ మోడల్ బైక్.

Cyborg: ఈవీ స్టార్టప్ నుంచి మూడు ఎలక్ట్రిక్ బైక్స్... ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు

హీరో స్ప్లెండర్ ప్లస్ -

ఈ హీరో బైక్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కంప్యూటరైజ్డ్ బైక్. ఈ బైక్‌లో 8 PS మరియు 6.05 Nm టార్క్ ఉత్పత్తి చేయగల 96.2 cc ఇంజన్ ఉంది. ఈ హీరో బైక్ మూడు వేరియంట్లలో భారతదేశంలో అందుబాటులో ఉంది. ఈ హీరో బైక్ మైలేజ్ లీటరుకు 60.8 కి.మీ.

First published:

Tags: Bike, Hero moto corp, Petrol bikes

ఉత్తమ కథలు