HERE IS THE FOUR LOAN OPTIONS FOR TO BUY AC FRIDGE THIS SUMMER NS GH
Buy AC, fridge: ఏసీ, ఫ్రిజ్ కొనడానికి డబ్బులు లేవా? అయితే, ఈ సూపర్ లోన్ ఆప్షన్లు మీ కోసమే..
ప్రతీకాత్మక చిత్రం
వేసవిలో సాధారణంగా ఏసీ, ఫ్రిజ్ లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అనేక మంది ఎండ వేడిమి తట్టుకోలేక వీటిని కొనాలనుకోవడమే ఇందుకు కారణం. అయితే ఏసీ, ఫ్రిజ్ కొనడానికి లోల్ కూడా పొందొచ్చు. ఆ వివరాలు మీ కోసం..
వేసవి వచ్చేసింది.. భానుడు భగభగమండుతున్నాడు.. వేసవి తాపం తట్టుకోలేక ప్రజలు బయటకి వెళ్లాలంటే జంకుతున్నారు. ఒకవైపు కరోనా తీవ్రత.. మరోవైపు ఎండలు మండుతుండటంతో ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. దీనితో పాటు కిందటి ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. దీంతో ఉక్కపోత నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు, రిఫ్రిజిరేటర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో, వేసవిలో కూలర్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వేసవి కాబట్టి వీటికి పెద్ద డిస్కౌంట్లు కూడా ఏమీ ప్రకటించట్లేదు సంస్థలు. అయినప్పటికీ స్మార్ట్ లోన్ ఆప్షన్ల ద్వారా వీటిని కొనుగోలు చేసి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. ఈ వేసవిలో ఏసీ, రిఫ్రిజిరేటర్ వంటి కన్స్యూమర్ డ్యూరబుల్స్ కొనడానికి మీకు అందుబాటులో ఉన్న లోన్ ఆప్షన్లపై ఓలుక్కేయండి.
పర్సనల్ లోన్
ఏసీ, రిఫ్రిజిరేటర్ వంటి కన్స్యూమర్ డ్యూరబుల్స్ కొనుగోలుకు చేసేందుకు వివిధ బ్యాంకులు పర్సనల్ లోన్లు మంజూరు చేస్తాయి. అత్యవసరంగా డబ్బు కావాలంటే వ్యక్తిగత రుణాలు మంచి ఎంపిక అనే విషయం తెలిసిందే. అయితే, ఎంత రుణం ఇవ్వాలి? ఎంత వడ్డీరేట్లను నిర్ణయించాలి? అనే విషయాలు మీ క్రెడిట్ స్కోరు, నెలవారీ ఆదాయం, ఉద్యోగ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వ్యక్తిగత రుణాలపై 9% నుండి 16% వడ్డీ రేట్లు వసూలు చేస్తుంటాయి ఆయా బ్యాంకులు. మీ నెలవారీ జీతాన్ని బట్టి 1 నుండి 5 సంవత్సరాల మధ్య లోన్ టెన్యూర్‌తో రూ .30 లక్షల వరకు పర్సనల్ లోన్ సులభంగా పొందవచ్చు. కొన్ని బ్యాంకులు పర్సనల్ లోన్లపై ఏడేళ్ల టెన్యూర్‌ను కూడా ఇస్తున్నాయి.
క్రెడిట్ కార్డ్ ఈఎంఐ
అనేక ఈ–కామర్స్ వెబ్సైట్లు, రిటైలర్లు క్రెడిట్ కార్డ్ కొనుగోలుదారులకు ప్రత్యేకమైన డిస్కౌంట్లు, నోకాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీని అందిస్తున్నాయి. దీని కోసం క్రెడిట్ కార్డు జారీచేసే సంస్థలు వివిధ ఎలక్ట్రానిక్ కంపెనీలు లేదా తయారీదారులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. కొన్ని క్రెడిట్ కార్డ్ సంస్థలు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో పాటు అడిషనల్ డిస్కౌంట్‌ను కూడా అందజేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ–కామర్స్ వెబ్సైట్లలో ఈ ఆఫర్లను పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.
కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్
కొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థలు ఎన్బిఎఫ్సి, బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకొని కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్ అందజేస్తున్నాయి. ఆఫ్‌లైన్ స్టోర్ల నుండి కన్స్యూమర్ డ్యూరబుల్స్ కొనుగోలు చేసేవారికి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను అందిస్తున్నాయి. ఎటువంటి వడ్డీ లేకుండానే.. వస్తువు మొత్తం ధరను 6, 9, 12 సమాన వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అమ్మకాలను పెంచుకునేందుకు క్యాష్ బ్యాక్లను కూడా అందిస్తున్నాయి. క్రెడిట్ కార్డు లేని కస్టమర్లకు ఈ కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్ అనుకూలంగా ఉంటుంది.
క్రెడిట్ కార్డుపై పర్సనల్ లోన్
సకాలంలో క్రెడిట్ కార్డు బిల్ చెల్లింపు చేసే కస్టమర్లకు కొన్ని క్రెడిట్ కార్డు సంస్థలు ప్రీ అప్రూవుడ్ లోన్స్ అందిస్తున్నాయి. ఈ రుణాలు ముందస్తుగా ఆమోదించబడినందున, వీటికి ప్రాసెసింగ్ టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది. దరఖాస్తు చేసిన కొద్ది గంటల్లోనే మీ మొత్తం రుణం బదిలీ చేయబడుతుంది. అయితే, తీసుకున్న రుణాన్ని ఆరు నెలల నుండి ఐదు సంవత్సరాల మధ్య చెల్లించవచ్చు. వడ్డీ రేట్లు మీ క్రెడిట్ ప్రొఫైల్, ఎంచుకున్న లోన్ టెన్యూర్‌ను బట్టి నిర్ణయిస్తారు. సాధారణంగా ఈ వడ్డీరేట్లు 15% నుండి ప్రారంభమవుతాయి. అయితే, మిగతా ఎంపికలతో పోలిస్తే వీటి వడ్డీ రేట్లు కాస్త ఎక్కువనే చెప్పాలి. అందుకే, దీన్ని లాస్ట్ ఆప్షన్‌గా పెట్టుకోండి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.