Home /News /business /

HERE IS HOW YOU CAN MANAGE YOUR CREDIT CARDS BETTER GH VB

Credit Cards: క్రెడిట్​ కార్డులను వాడుతున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు పాటిస్తే.. వడ్డీ భారం తగ్గుతుంది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్యాంకులు సులభంగా క్రెడిట్​ కార్డులు ఇస్తున్నాయి కాదా అని ఇబ్బడిముబ్బడిగా తీసుకుంటే భవిష్యత్తులులో ఇబ్బందులు తప్పవని గుర్తించుకోండి. క్రెడిట్​ కార్డు తీసుకునే ముందు.. ఆ బ్యాంకుకు సంబంధించిన నియమ నిబంధనలు తెలుసుకోవడం తప్పనిసరి.

అత్యవసరంగా డబ్బు కావాలంటే క్రెడిట్​ కార్డులను(Credit Cards) మించిన ప్రత్యామ్నాయం ఉండదు. అందుకే ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. గతంలో క్రెడిట్‌ కార్డు తీసుకోవాలంటే ఎంతో ప్రాసెస్‌ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. బ్యాంకులు సైతం క్రెడిట్​ కార్డు(Credit Cards) జారీ ప్రక్రియ​ను సులభతరం చేశాయి. తక్కువ శాలరీ ఉన్న వారికి, చిన్న వ్యాపారాలు చేసే వారికి సైతం క్రెడిట్​ కార్డులు జారీ చేస్తున్నాయి. అంతేకాదు, కేవలం ఫోన్‌ల ద్వారానే కస్టమర్లను కాంటాక్ట్‌ అయ్యి వాట్సాప్‌(WhatsApp), మెయిల్స్‌(Mails) ద్వారా పత్రాలను తీసుకుని వెంటనే కార్డు జారీ చేస్తున్నారు. దీంతో చాలా మంది ఒకటికి మించి ఎక్కువ క్రెడిట్​ కార్డులు వాడుతున్నారు. అయితే బ్యాంకులు సులభంగా క్రెడిట్​ కార్డులు ఇస్తున్నాయి కాదా అని ఇబ్బడిముబ్బడిగా తీసుకుంటే భవిష్యత్తులులో ఇబ్బందులు తప్పవని గుర్తించుకోండి. క్రెడిట్​ కార్డు తీసుకునే ముందు.. ఆ బ్యాంకుకు సంబంధించిన నియమ నిబంధనలు తెలుసుకోవడం తప్పనిసరి.

Infosys Fresher Jobs: ఇన్ఫోసిస్‌లో ఫ్రెషర్స్‌కి 55,000 ఉద్యోగాలు... 12 వారాల ట్రైనింగ్

క్రెడిట్​ కార్డుపై వసూలు చేస్తున్న వడ్డీ రేట్లు, రివార్డ్ పాయింట్లు, క్రెడిట్ లిమిట్​, వార్షిక రుసుము, బ్యాలెన్స్ ట్రాన్స్​ఫర్​, కస్టమర్​ ఫీడ్​బ్యాక్ వంటి పారామీటర్లను సరిపోల్చుకొని ఎంచుకోవాలి. లేదంటే క్రెడిట్​ కార్డులను సరిగ్గా నిర్వహించలేక అప్పులపాలయ్యే అవకాశం ఉంది. క్రెడిట్​ కార్డుల నిర్వహణపై mPokket సీఈఓ, వ్యవస్థాపకుడు గౌరవ్ జలన్ మాట్లాడుతూ “ఒక నిర్దిష్ట క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు మీ ఆదాయం, ఖర్చులను అంచనా వేసుకోవాలి. మీ ఆదాయానికి మించి క్రెడిట్​ కార్డు లిమిట్​ తీసుకోకపోవడమే మంచిది.

ఆఫర్లు, రివార్డు పాయింట్లు వస్తున్నాయనే ఉద్దేశ్యంతో ఎక్కువ క్రెడిట్​ కార్డులను తీసుకోవద్దు. వాటి మెయింటెనెన్స్​ భారంగా మారుతుంది. క్రెడిట్‌ కార్డు పొందిన తర్వాత వార్షిక రుసుము ఉంటుంది. మీకు కార్డు ఉచితంగా అందినప్పటికీ, తర్వాత వార్షిక ఛార్జీలను వసూలు చేస్తాయి బ్యాంకులు. అందుకే, ఎక్కువ క్రెడిట్​ కార్డులు తీసుకోకపోవడమే మంచిది. ” అని తెలిపారు.

ఆన్​లైన్​ షాపింగ్​కు తెలివిగా ఉపయోగించుకోండి..
క్రెడిట్​ కార్డులను క్యాష్​ విత్​డ్రా కోసం కాకుండా షాపింగ్, ఫ్లైట్ బుకింగ్, డైనింగ్ వంటి విభిన్న అవసరాలకు ఉపయోగించడం మంచింది. ఎందుకంటే, క్యాష్​ విత్​డ్రా ద్వారా మీరు ఎక్కువ నష్టపోతారు. అయితే, క్రెడిట్​ కార్డు బిల్లు పేమెంట్​ విషయంలో చాలా మంది మినిమం బిల్లు మాత్రమే పే చేస్తుంటారు. దీంతో, చెల్లించని క్రెడిట్‌పై వడ్డీ భారం పెరిగిపోతుంది. ఇది చివరికి రుణ ఉచ్చులో పడేలా చేస్తుంది. అందువల్ల రుణ ఉచ్చును నివారించడానికి, చెల్లింపు తేదీని జాగ్రత్తగా చూసుకుంటూ మీ ఖర్చులు, క్రెడిట్ స్టేట్‌మెంట్‌లను తెలివిగా ట్రాక్ చేసుకోవాలి.
Published by:Veera Babu
First published:

Tags: Credit cards, Income

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు