యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలను అందించే ఉబర్ తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను తీసుకువస్తోంది. కస్టమర్ల ప్రొటెక్షన్ కోసం తాజాగా ఉబర్ (Uber) యాప్ కొన్ని సెక్యూరిటీ ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ఫీచర్స్ సహాయంతో యూజర్‌లు ఎమర్జెన్సీ బటన్‌ను యాక్సెస్ చేయడానికి, యాప్ ఆధారిత టాక్సీ అగ్రిగేటర్‌కి డైరెక్ట్ రిపోర్ట్స్ సెండ్ చేయడానికి వీలు కలుగుతుంది. అంతేకాకుండా క్యాబ్‌లలో (Cab) ప్రయాణించే వ్యక్తులు రైడ్‌ను ట్రాక్ చేసే సదుపాయం ఉంటుంది. వారి రైడ్ వివరాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవడానికి కూడా ఉబర్ సెక్యూరిటీ ఫీచర్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.
ఎమర్జెన్సీ బటన్‌తో అత్యవసర సేవలు
ఏదైనా సమస్య తలెత్తితే యూజర్‌లు ఉబర్ యాప్‌లో ఎమర్జెన్సీ బటన్‌ను ఉపయోగించి అధికారులను సంప్రదించవచ్చు. అవసరమైన సహాయం కోసం అభ్యర్థించవచ్చు. కస్టమర్ లొకేషన్, ట్రిప్ సమాచారాన్ని ఈ యాప్ డిస్‌ప్లే చేస్తుంది. దీంతో కస్టమర్ అత్యవసరంగా సేవలకు పొందడానికి అవకాశం ఉంటుంది.
రోజుకు రూ.10 ఇచ్చి బంగారం కొనండిలా!
ఎమర్జెన్సీ బటన్‌ను ఉపయోగించే విధానం
మొదట ఉబర్ యాప్‌లో స్క్రోల్ అప్ చేసి, రైడ్ డీటెయిల్ మెనులో సేఫ్టీ బటన్ ట్యాప్ చేయాలి. అనంతరం కాల్ 112 లేదా సెఫ్టీ లైన్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఈ రెండు ఆప్షన్‌లలో ఏదైనా ఒకదాని సాయంతో కాల్ ఉబర్ మేనేజ్‌మెంట్‌కు వెళుతుంది.
ట్రిప్ వివరాలను షేర్ చేసే సదుపాయం
ఉబర్ రైడ్ వివరాలను ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. ఇందుకు.. ఉబర్ రైడ్ కన్ఫామ్ అయిన తర్వాత, డీటైల్ పేజీకి వెళ్లి షేర్ యువర్ ట్రిప్ బటన్‌పై క్లిక్ చేయాలి. ట్రిప్ స్టేటస్ పంపాలనుకుంటున్న వారి కాంటాక్ట్ సెలక్ట్ చేసుకుని సెండ్ బటన్‌ను ప్రెస్ చేయాలి. రైడ్ స్టేటస్‌ను ఇన్‌ఫామ్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న కుటుంబసభ్యులు, స్నేహితులు రైడ్ ప్రొగ్రెస్‌ను ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది.
చౌక వడ్డీకే బంగారంపై రుణాలు ఇస్తున్న 5 బ్యాంకులు ఇవే
రైడ్‌చెక్ ఫీచర్
ఉబర్ మరో సెక్యూరిటీ ఫీచర్‌ను పరిచయం చేసింది. యూజర్‌లు RideCheck ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే, ఒకవేళ ట్రిప్ అనుకున్న విధంగా జరగకపోతే అది డ్రైవర్, రైడర్‌ను ఆలర్ట్ చేస్తుంది.
రైడ్‌చెక్ ఫీచర్ ఉపయోగించే విధానం
ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో ఉబర్ యాప్‌ను ఓపెన్ చేయాలి. స్క్రీన్ రైట్‌సైడ్ డౌన్ కార్నర్‌లో ఉన్న అకౌంట్ బటన్ ట్యాప్ చేయాలి. ఆ తరువాత సెట్టింగ్స్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అనంతరం స్క్రోల్ డౌన్ చేసి, సేఫ్టీ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. తరువాత రైడ్‌చెక్ ఆప్షన్‌పై ట్యాప్ చేసి, రైడ్‌చెక్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.