హోమ్ /వార్తలు /బిజినెస్ /

Loan On WhatsApp: స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? క్షణాల్లో అకౌంట్‌లోకి రూ.5,000 పొందండిలా!

Loan On WhatsApp: స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? క్షణాల్లో అకౌంట్‌లోకి రూ.5,000 పొందండిలా!

Loan On WhatsApp: స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? క్షణాల్లో అకౌంట్‌లోకి రూ.5,000 పొందండిలా!

Loan On WhatsApp: స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? క్షణాల్లో అకౌంట్‌లోకి రూ.5,000 పొందండిలా!

Whatsapp Loan | మీరు డబ్బులు పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. వాట్సాప్ ద్వారా కూడా సులభంగానే రుణం పొందొచ్చు. ఎలానో తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Personal Loan | డబ్బులతో పని పడిందా? అయితే చేతిలో మనీ లేదా? ఏం చేయాలో తెలియడం లేదా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. వెంటనే లోన్  (Loan) పొందొచ్చు. అది కూడా ఎక్కడికీ వెళ్లకుండానే. స్మార్ట్‌ఫోన్ (Smartphone) ఉంటే చాలు. వాట్సాప్ ద్వారానే లోన్ పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మనం వాట్సాప్ ద్వారా లోన్ ఎలా పొందొచ్చొ ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ క్యాషేతో వాట్సాప్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా యూజర్లు క్షణాల్లో ఇన్‌స్టంట్ లోన్స్ పొందొచ్చు. క్యాషే సులభంగానే కేవైసీ పూర్తి చేస్తుంది. అలాగే జియో హ్యాప్టిక్ ద్వారా ఈజీగానే పని పూర్తవుతుంది. వెరిఫై పూర్తి చేసుకున్న కస్టమర్లు సులభంగానే డబ్బులు పొందొచ్చు. క్రెడిట్ ఫెసిలిటీని వాడుకోవచ్చు.

లోన్ తీసుకొవాలనుకునే వారికి ఎస్‌బీఐ అదిరే పండుగ ఆఫర్లు!

పాన్ కార్డు మీద ఉన్న పేరు తెలియజేస్తే చాలు క్యాషే తన పని పూర్తి చేస్తుంది. కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసేస్తుంది. అర్హత కలిగిన కస్టమర్లకు క్షణాల్లో రుణం లభిస్తుంది. లేదంటే లేదు. వాట్సాప్ ద్వారా లోన్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం వాట్సాప్ వాడే వారు ఒక నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. 8097553191 అనే నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోండి.

ఈ ప్రభుత్వ స్కీమ్‌లో చేరితే రూ. 41 లక్షలు మీవే.. ఎలానో తెలుసుకోండి!

తర్వాత ఈ నెంబర్‌కు మీరు వాట్సాప్ ద్వారా హాయ్ అనే మెసేజ్ పంపాలి. మీరు హాయ్ అని పంపిన తర్వాత మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. గెట్ ఇన్‌స్టంట్ క్రెడిట్ లైన్, ఆప్షన్స్ అనేవి ఇవి. ఇందులో మీరు గెట్ ఇన్‌స్టంట్ క్రెడిట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీరు మీ పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఏఐ బాట్ మీ వివరాలను వెరిఫై చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మీకు ప్రిఅప్రూవ్డ్ క్రెడిట్ లైన్ వస్తుంది. రూ. 5 వేల వరకు డబ్బులు పొందొచ్చు. అది కూడా క్షణాల్లోనే. అయితే మీకు రూ. 5 వేల కన్నా ఎక్కువ డబ్బులు కావాలంటే నేరుగా క్యాషే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ. 4 లక్షల వరకు లోన్ పొందొచ్చు.

అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. కేవలం ఉద్యోగులకు మాత్రమే ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. మీకు కూడా లోన్ కావాలంటే క్యాషే ద్వారా అప్లై చేసుకోవచ్చు. కాగా ఇలాంటి ఫిన్‌టెక్ కంపెనీల్లో రుణాలపై వడ్డీ రేట్లు కూడా ఎక్కువగానే ఉంటాయని గుర్తించుకోవాలి. అయితే అర్హత ఉంటే మాత్రం త్వరితగతిన రుణాలు పొందొచ్చు.

First published:

Tags: 5g smart phone, Banks, Personal Loan, Smartphone, Whatsapp

ఉత్తమ కథలు