Home /News /business /

HERE IS HOW TO GET ANSWERS FOR YOUR NPS QUERIES ON WHATSAPP UMG GH

NPS Service: నేషనల్ పెన్షన్ స్కీమ్‌ గురించి డౌట్స్ ఉన్నాయా? వాట్సాప్‌లో ఇలా క్లియర్ చేసుకోండి..

వాట్సాప్‌లోనే వివరాలు పొందొచ్చు.

వాట్సాప్‌లోనే వివరాలు పొందొచ్చు.

NPS చందాదారులు స్కీమ్‌కు సంబంధించిన వివరాలను వాట్సాప్‌ (Whats app)లోనే పొందవచ్చు. +91 8588852130 నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా వాట్సాప్‌లోనే ఎన్‌పీఎస్ పథకానికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వాట్సాప్ యూజర్లందరూ ఈ సర్వీసు పొందవచ్చు.

ఇంకా చదవండి ...
సాధారణంగా ఉద్యోగం చేస్తున్నప్పుడు చేతినిండా డబ్బులు ఉంటాయి. కానీ పదవీ విరమణ (Retirement) పొందిన తర్వాత కనీస అవసరాలకు సరిపడా డబ్బు కూడా ఉండదు. అందుకే ప్రతి ఒక్కరూ జీతం వస్తున్నప్పుడే పదవీ విరమణ తరువాత స్థిర ఆదాయం పొందేలా పెన్షన్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఈ స్కీమ్స్‌లో జాతీయ పింఛను పథకం (National Pension Scheme) బాగా ప్రజాదరణ పొందుతోంది. కాగా తాజాగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ (NPST) తన సేవలను వాట్సాప్‌లో లాంచ్ చేసింది. ఈ సర్వీస్ ద్వారా ఎన్‌పీఎస్ (NPS) చందాదారులు స్కీమ్‌కు సంబంధించిన వివరాలను వాట్సాప్‌లోనే పొందవచ్చు. +91 8588852130 నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా వాట్సాప్‌లోనే ఎన్‌పీఎస్ పథకానికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వాట్సాప్ యూజర్లందరూ ఈ సర్వీసు పొందవచ్చు.

వాట్సాప్‌లో ఎన్‌పీఎస్ వివరాలు తెలుసుకునేందుకు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ 

స్టెప్ 1: మొదట మీ ఫోన్ కాంటాక్ట్స్‌లో +91 8588852130 నంబర్ సేవ్ చేసుకోవాలి.

స్టెప్ 2: వాట్సాప్ ఓపెన్ చేసి +91 8588852130 నంబర్‌కు 'హాయ్' అని మెసేజ్ పంపాలి.

స్టెప్ 3: అప్పుడు మీకు ఎన్‌పీఎస్, పీఎఫ్& కంట్రిబ్యూషన్, సీఆర్ఏ వంటి ఆప్షన్లతో ఒక మెసేజ్ వస్తుంది.

స్టెప్ 4: ఇప్పుడు, ఎన్‌పీఎస్ కోసం 1 నొక్కి సెండ్ బటన్‌పై నొక్కాలి. ఎంట్రీ ఏజ్, బెనిఫిట్స్, అర్హతలు వంటి వివరాలు తెలుసుకునేందుకు మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి.

స్టెప్ 5: మీరు ఆప్షన్స్ లిస్ట్‌లో మీకు కావాల్సిన ఆప్షన్ లేనట్లయితే, 'నీడ్ మోర్ హెల్ప్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

స్టెప్ 6: ఆపై మీకు grievances@npstrust.org.in కు మెయిల్ చేయమని కోరుతూ NPS ట్రస్ట్ నుంచి ఒక రిప్లై వస్తుంది. ఈ మెసేజ్‌లోనే 011-47207700 డయల్ చేయడం ద్వారా NPSTని కాంటాక్ట్ చేయవచ్చని కనిపిస్తుంది.

మరింత సహాయం కోసం ఎన్‌పీఎస్ ఖాతాదారులు eNPS హెల్ప్‌లైన్ నంబర్‌కు 022-2499 3499 కూడా కాల్ చేయవచ్చు. లేదా టోల్-ఫ్రీ నంబర్ 1800 222 080ని కూడా సంప్రదించవచ్చు. ఎన్‌పీఎస్ అనేది ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక సోషల్ సెక్యూరిటీ స్కీమ్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ఆధ్వర్యంలోని ఈ పథకం ద్వారా పోస్ట్ రిటైర్‌మెంట్ లైఫ్ కోసం ఆర్థిక నిధి ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు చిన్న మొత్తాల్లోనైనా ఇన్వెస్ట్ చేసి రెగ్యులర్‌గా పెన్షన్ ఇన్‌కమ్ అందుకోవచ్చు. సాయుధ దళాలతో పనిచేసే వ్యక్తులు మినహా ప్రభుత్వ, ప్రైవేట్, అసంఘటిత రంగాల ఉద్యోగులు ఈ పెన్షన్ పథకంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇన్వెస్టర్లు ప్రతి నెలా లేదా క్రమమైన వ్యవధిలో నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రిటైర్‌మెంట్ తర్వాత కార్పస్‌లోని కొంత శాతాన్ని తీసుకుని.. మిగిలిన మొత్తాన్ని నెలవారీ పెన్షన్‌గా పొందవచ్చు. ఇన్‌కమ్‌ ట్యాక్స్ యాక్ట్‌లోని సెక్షన్ 80సీ కింద ఈ కంట్రిబ్యూషన్లపై పన్ను మినహాయింపు పొందవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: BUSINESS NEWS, Nps, NPS Scheme, Whatsapp

తదుపరి వార్తలు