హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Balance: మిస్డ్ కాల్‌తో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోండిలా!

Bank Balance: మిస్డ్ కాల్‌తో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోండిలా!

Bank Balance: మిస్డ్ కాల్‌తో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోండిలా!

Bank Balance: మిస్డ్ కాల్‌తో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోండిలా!

SBI Account | మీరు బ్యాంక్ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో క్షణాల్లో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే చాలు. బ్యాలెన్స్ ఎంతో చూడొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

SBI News | బ్యాంక్ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవడం చిటికెలో పని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ (Phone) ఉంటే చాలు.. బ్యాంకింగ్ సేవలు చాలా వరకు ఇంట్లో నుంచే పొందొచ్చు. నెట్ బ్యాంకింగ్, లేదంటే మొబైల్ బ్యాంకింగ్ ద్వారా సులభంగానే బ్యాంక్ (Bank) బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఒకవేళ నెట్ బ్యాంకింగ్ లేకపోతే? ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేదంటే? అప్పుడు ఎలా బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవాలి?

అయితే మీరు ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటివి పని చేయకపోయినా మీరు సులభంగానే బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిన పని లేదు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ.18,500.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్!

దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. వీటిల్లో మిస్డ్ కాల్ సర్వీస్ కూడా ఉంది. మీరు కేవలం మిస్డ్ కాల్ ద్వారా బ్యాంక్ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ప్రాసెస్ గురించి తెలుసుకోవాల్సిందే.

ఎస్‌బీఐ అద్భుత స్కీమ్.. చేరితే రూ.15 లక్షలు మీవే!

మీరు 9223766666 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు. మీరు ఈ నెంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకుంటే చాలు. మీరు ఎప్పుడు కావాల్సి వస్తే.. అప్పుడు మిస్డ్ కాల్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవచ్చు. మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత మీ ఫోన్ నెంబర్‌కు బ్యాంక్ మెసేజ్ పంపిస్తుంది. ఇందులో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఉంటుంది.

మిస్డ్ కాల్ లేదటే ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీరు బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మీరు పైన ఇచ్చిన నెంబర్‌కు బీఏఎల్ అని టైప్ చేసి మెసేజ్ పంపొచ్చు. తర్వాత మీకు బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది. బ్యాంక్ అకౌంట్‌లో ఎంత డబ్బులు ఉందో తెలుస్తుంది. అయితే మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ద్వారానే మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదా ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. మీరు ఇతర నెంబర్ల ద్వారా కాల్ చేస్తే ప్రయోజనం ఉండదు. అలాగే వేరే నెంబర్ల ద్వారా ఎస్ఎంఎస్ పంపినా మీరు ఈ బెనిఫిట్స్ పొందలేరు.

First published:

Tags: Bank, Bank account, Bank news, Sbi, State bank of india

ఉత్తమ కథలు