Satya Nadella | సత్యనాదెళ్లకు ఊహించనంత జీతం పెంచిన మైక్రోసాఫ్ట్

సత్యనాదెళ్ల (Image;Microsoft)

మైక్రోసాఫ్ట్ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ నిన్నే 1 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను టచ్ చేసింది. గత కొన్నేళ్లుగా మైక్రోసాఫ్ట్ ఎంత వేగంగా వృద్ధి చెందుతుందో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు.

  • Share this:
    మైక్రోసాఫ్ట్ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ నిన్నే 1 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను టచ్ చేసింది. గత కొన్నేళ్లుగా మైక్రోసాఫ్ట్ ఎంత వేగంగా వృద్ధి చెందుతుందో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఈ ఘనత కచ్చితంగా సీఈవో సత్యనాదెళ్లకే చెందుతుంది. మైక్రోసాఫ్ట్‌ను పరుగులు పెట్టించడంలో, భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో సత్యనాదెళ్ల కృషి ఎంతో ఉంది. అందుకు తగ్గట్టే ఆయనకు భారీ ఇంక్రిమెంట్ కూడా లభించింది. సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం... సత్యనాదెళ్లకు జీతంలో 66శాతం ఇంక్రిమెంట్ లభించింది. మైక్రోసాఫ్ట్ వార్షిక నివేదికను అనుసరించి 2018-19 సంవత్సరానికి సత్య నాదెళ్లకు 42.9 మిలియన్ డాలర్ల వేతనం లభించింది. (అందులో అత్యధిక శాతం స్టాక్స్ రూపంలో) గత ఏడాది సత్యనాదెళ్ల వార్షిక వేతనం 25 మిలియన్ డాలర్లు. అంతకు ముందు సంవత్సరం 20 మిలియన్ డాలర్లు. అంటే రెండేళ్లలోనే సత్యనాదెళ్ల వేతనం రెండింతలైంది.

    2014వ సంవత్సరంలో సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిలటైజేషన్ 302 బిలియన్ డాలర్లు. 2018 సెప్టెంబర్ 4 నాటికి అది 850 మిలియన్ డాలర్లకు పెరిగింది. సత్య నాదెళ్ల వ్యూహాత్మక ఎత్తుగడలు, నాయకత్వం, కొత్త కొత్త సాంకేతికతను వినియోగదారులకు అందించడం ద్వారా కంపెనీని మరింత వేగంగా వృద్ధిలోకి తీసుకొచ్చాయని సంస్థ ఇండిపెండెంట్ బోర్డు అంగీకరించింది. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్‌లో సత్యనాదెళ్ల వ్యూహం మైక్రోసాఫ్ట్‌కు ప్లస్ అయింది.

    మైక్రోసాఫ్ట్ అధికారిక లెక్కల ప్రకారం ఆ సంస్థ ఆదాయంలో 14 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో 125.8 బిలియన్ డాలర్ల ఆదాయం లభించింది. కంపెనీ నికర ఆదాయం 137 శాతం (39.2 బిలియన్ డాలర్లు) పెరిగింది.

    Video: పులి పిల్లను పట్టుకుని ఎలా హింసిస్తున్నారో చూడండి

    First published: