సురక్షితమైన భవిష్యత్తు కోసం, అనుకోని అవసరాలకు అప్పులపాలయ్యే ముప్పు నుంచి తప్పించుకోవడానికి ప్రజలు డబ్బును దాచుకుంటారు. ప్రస్తుతం చాలా రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి, మెరుగైన రాబడిని అందిస్తున్నాయి. ఇలాంటి ప్రయోజనాలతో కాంట్రిబ్యూషన్ పెన్షన్ సిస్టమ్ అయిన నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS)ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ఇండియన్ సిటిజన్స్‌కు ప్రణాళికబద్ధంగా పొదుపు చేస్తూ, మెరుగైన రాబడి అందుకునే అవకాశం కల్పించింది.
NPSని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నిర్వహిస్తుంది. అయితే దేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ఎన్‌పీఎస్ స్కీమ్ ద్వారా ఆకర్షణీయమైన మార్కెట్-లింక్డ్ రిటర్న్‌లను అందిస్తుంది. సబ్‌స్క్రైబర్‌లకు ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్‌లు కూడా అందిస్తుంది. ఎస్‌బీఐలో ఎన్‌పీఎస్ అకౌంట్ ఓపెన్ చేస్తే లభించే ట్యాక్స్ బెనిఫిట్స్, ఇతర ప్రయోజనాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.
* ఎన్‌పీఎస్ అకౌంట్ రకాలు
రెండు రకాల NPS అకౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అవి టైర్ I, టైర్ II. టైర్ I ఎన్‌పీఎస్ అకౌంట్ తప్పనిసరి, ఇది పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. సబ్‌స్క్రైబర్‌లకు ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి కనీసం రూ.500 కాంట్రిబ్యూషన్ అవసరం. ఒక సంవత్సరంలో కనీసం రూ.1,000 ఇన్వెస్ట్ చేయాలి. అదే విధంగా టైర్ II ఎన్‌పీఎస్ అకౌంట్ ట్యాక్స్ బెనిఫిట్స్‌ను అందించదు. ఇది ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్. ఈ ఆప్షనల్ అకౌంట్‌ను ఓపెన్ చేయడానికి కనీసం రూ.1,000 కాంట్రిబ్యూషన్ అవసరం. అయితే టైర్ II అకౌంట్ ఎప్పుడైనా ఫండ్స్ విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందిస్తుంది.
* అర్హత ప్రమాణాలు, ట్యాక్స్ బెనిఫిట్స్
సబ్‌స్క్రైబర్ కచ్చితంగా భారతీయ పౌరుడై ఉండాలి. ప్రవాస భారతీయులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తప్పనిసరిగా 18-70 సంవత్సరాల వయసులోపు ఉండాలి. ఉద్యోగి కాంట్రిబ్యూషన్‌కు సంబంధించి.. NPS టైర్ I అకౌంట్ 80CCD (1B) కింద రూ.50,000 కాంట్రిబ్యూషన్‌పై ట్యాక్స్ డిడక్షన్ అందిస్తుంది. సబ్‌స్క్రైబర్‌లు మొత్తం రూ.1.50 లక్షల పరిమితిలోపు పెట్టుబడులకు (బేసిక్ & డియర్‌నెస్ అలవెన్స్‌లో 10 శాతం) u/s 80CCE కింద పన్ను రాయితీని కూడా పొందవచ్చు.
యజమాని కాంట్రిబ్యూషన్‌కి సంబంధించి, టైర్ I అకౌంట్ u/s 80CCD (2) కింద జీతంలో 10 శాతం(బేసిక్+ DA) వరకు ట్యాక్స్ బెనిఫిట్ అందిస్తుంది. ద్రవ్య పరిమితి రూ. 7.5 లక్షలకు లోబడి (సూపర్‌యాన్యుయేషన్, ప్రావిడెంట్ ఫండ్ మొదలైనవి) ఉంటుంది.
ఇది కూడా చదవండి : ఎస్‌బీఐ కస్టమర్‌లు ఫోన్‌లో ఉచితంగా పొందగలిగే 10 సేవలు ఇవే..
* ఎన్‌పీఎస్ టైర్ I అకౌంట్ నుంచి ఎలా ఎగ్జిట్ అవ్వాలి?
- సబ్‌స్క్రైబర్ 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే (అకౌంట్ ఐదేళ్ల పీరియడ్ పూర్తయిన తర్వాత): కార్పస్‌లో ఇరవై శాతం మొత్తాన్ని ఏకమొత్తంలో విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని యాన్యుటీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. మొత్తం కార్పస్ రూ.2.50 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే, అప్పుడు పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
- సబ్‌స్క్రైబర్ 60 సంవత్సరాల వయస్సుకు చేరుకుంటే: కార్పస్‌లో కనీసం 40 శాతం తప్పనిసరిగా యాన్యుటీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. మిగిలిన మొత్తాన్ని 75 సంవత్సరాల వయస్సు వరకు భాగాలు/మొత్తంలో ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ మొత్తానికి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. మొత్తం కార్పస్ రూ.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే, మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: NPS Scheme, Personal Finance, Sbi