Home /News /business /

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? మీ కుటుంబం మొత్తానికి ఎంత కవరేజీ అవసరమో తెలుసుకోండి

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? మీ కుటుంబం మొత్తానికి ఎంత కవరేజీ అవసరమో తెలుసుకోండి

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? మీ కుటుంబం మొత్తానికి ఎంత కవరేజీ అవసరమో తెలుసుకోండి

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? మీ కుటుంబం మొత్తానికి ఎంత కవరేజీ అవసరమో తెలుసుకోండి

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఫ్యామిలీ కోసం ఆరోగ్య బీమా తీసుకోవడం అత్యంత ఆవశ్యకంగా మారింది. అయితే ఆరోగ్య బీమా హామీ మొత్తం ఎంత ఉండాలనే విషయంపై చాలామంది తప్పుగా అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఫ్యామిలీ కోసం ఆరోగ్య బీమా (Health Insurance) తీసుకోవడం అత్యంత ఆవశ్యకంగా మారింది. అయితే ఆరోగ్య బీమా హామీ మొత్తం ఎంత ఉండాలనే విషయంపై చాలామంది తప్పుగా అంచనా వేస్తున్నారు. ఆర్థిక సలహాదారుల ప్రకారం, నానాటికీ వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో బీమా హామీ మొత్తం ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడటం చాలా అవసరం. మందులు, మెడికల్ టెస్టులు, ఆసుపత్రి, కన్సల్టేషన్ ఫీజులు స్థిరంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మీరు మీ పిల్లలు, భాగస్వామి, తల్లిదండ్రుల వైద్య ఖర్చుల కవరేజీ కోసం తగినంత హామీ మొత్తంతో ఆరోగ్య బీమా తీసుకోవాలి. మరి బీమా పాలసీ కవరేజీ మొత్తం భవిష్యత్తులో వైద్య ఖర్చులకు అనుగుణంగా ఉండేలా ఎలా జాగ్రత్త పడాలో చూద్దాం.

రూ. 5 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ సరిపోదు
మొత్తం ఫ్యామిలీకి రూ.5 లక్షల కవరేజీ అనేది ఏమాత్రం సరిపోదు. వైద్య ద్రవ్యోల్బణం (medical inflation) అనేది ఆసుపత్రిలో చేరే ఖర్చుపై 15 శాతం ప్రభావం చూపినా.. భవిష్యత్తులో ఖర్చులు భగ్గుమనే అవకాశం ఉంది. 15 శాతం వైద్య బిల్లులు పెరుగుతాయి అనుకుంటే.. ఈరోజు ఆసుపత్రిలో రూ.4 లక్షలు ఖర్చయ్యే చికిత్సకు పదేళ్ల తర్వాత రూ.16 లక్షలు ఖర్చవుతుంది. 20 ఏళ్ల తర్వాత ఆ ఖర్చు రూ.65 లక్షలకు చేరుకుంటుంది. పాలసీని పెద్ద వయసులో కొనుగోలు చేసినట్లయితే.. వార్షిక ప్రీమియం ధర పెరుగుతూనే ఉంటుంది. అందువల్ల తక్కువ ధరలో అధిక విలువ కలిగిన కవర్‌ల కోసం ముందుగానే సైన్ అప్ చేయడం ఎల్లప్పుడూ మంచిది.
PhonePe: రూ.999కే హెల్త్ ప్లాన్‌.. ఫోన్‌పే నుంచి కొత్త ఇన్సూరెన్స్ పాలసీ.. పూర్తి వివరాలివే

చిన్నపిల్లలు, వయసు పైబడిన తల్లిదండ్రులు ఉన్న కుటుంబానికి ఐదులక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ (family floater) ప్లాన్ అనేది చాలదు. ఇలాంటి చిన్న కవరేజీతో హామీ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వైద్య ఖర్చుల భారం అధికమై మీరు ఆర్థికంగా చేతికి పోయే ప్రమాదముంది. అందుకే ముందు చూపుతో చిన్న వయసులోనే ఎక్కువ కవరేజీ గల హామీ తీసుకోవడం ముఖ్యం. అలాగే మీరు మీ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ను మూడేళ్లకు ఒకసారి సమీక్షించడం ఉత్తమం.
Health Insurance: సీనియర్ సిటిజన్లకు మొదటి రోజు నుంచే కవరేజ్... ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి కొత్త పథకం

రెగ్యులర్‌గా టాప్-అప్ సమ్ అష్యూర్డ్
ఏ వయసులో ఉన్న వారైనా ఆస్పత్రుల పాలయ్యే ప్రమాదం ఉంది. చిన్నపిల్లలు బయట ఆడుకుంటూ గాయాలపాలయ్యే అవకాశం ఉంది. పెద్దలు రోడ్డు ప్రమాదాలకు గురి కావచ్చు. సీనియర్ సిటిజన్లు ఆల్రెడీ ఏదో ఒక వ్యాధితో బాధ పడుతూ ఉండొచ్చు. అందుకే చిన్న పిల్లలతో పాటు తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని అందుబాటులో ఉన్న కాంబినేషన్ ప్రొడక్ట్స్ ఎంచుకోవడం మేలు. కేవలం ఒకే ఒక్క పాలసీపై ఎప్పుడూ కూడా ఆధారపడకూడదు. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ సద్వినియోగం చేసుకుంటూ, మీ సంస్థకు సంబంధించిన గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్ తో సహా తల్లిదండ్రుల్లో ఇద్దరికీ ఇండివిడ్యువల్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం చాలా ముఖ్యం. రూ. 10 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్(family floater)తో టాప్-అప్ కోసం సైన్ చేస్తే, మీరు రూ. 1 కోటి బీమా కవరేజీని సులభంగా ఎంచుకోవచ్చు.

తల్లిదండ్రుల కోసం వ్యక్తిగత ప్లాన్స్ కొనుగోలు చేయండి
మీ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లో మీ తల్లిదండ్రులని యాడ్ చేస్తే మీరు చాలా నష్టపోతారు. ఎందుకంటే, గ్రూప్‌లోని పెద్ద సభ్యుని వయస్సు ఆధారంగా ప్రీమియం ఖర్చును బీమా కంపెనీలు డిసైడ్ చేస్తాయి. పెద్ద సభ్యుడు కవర్ కోసం గరిష్ట వయస్సును చేరుకోగానే పాలసీ గడువు ముగుస్తుంది. ఫలితంగా ఎవరికీ ఉపయోగం లేకుండా పోతుంది. మరోవైపు వ్యక్తిగత బీమా పథకం(individual insurance plan) వృద్ధులకు మరింత సమగ్రమైన కవరేజీని అందిస్తుంది. వ్యక్తిగత ప్లాన్ కింద, పాలసీదారు అత్యవసర వైద్య పరిస్థితుల కోసం విస్తృత కవరేజీని పొందవచ్చు.

ఈ కవరేజీలో ప్రివెంటివ్ హెల్త్ చెకప్ లు, ఇన్-పేషెంట్ ఆసుపత్రి ఖర్చులు, ప్రీ & పోస్ట్-హాస్పిటల్ కేర్, అంబులెన్స్ ఛార్జీలు మొదలైనవి ఉంటాయి. సగటున రూ.10 లక్షల వ్యక్తిగత ప్లాన్ విడిగా ప్రతి పేరెంట్ కోసం తీసుకుంటే దాదాపు అన్ని వైద్య ఖర్చులు కవర్ అవుతాయి. ఆరోగ్య పరిస్థితిని బట్టి భవిష్యత్తులో తగిన టాప్-అప్‌ని ఎంచుకోండి.

ఎంప్లాయర్ గ్రూప్ కవర్
ఎంప్లాయి బెనిఫిట్ ప్రోగ్రామ్స్ అనేవి సరసమైన ఇన్సూరెన్స్ ప్లాన్స్ అని అనడంలో సందేహం లేదు. ఈ ప్లాన్‌లు మీకు, మీ కుటుంబ సభ్యులకు సరసమైన సమగ్ర కవరేజీని అందిస్తాయి. ఈ నగదు రహిత క్లెయిమ్ ముందుగా ఉన్న అనారోగ్యాలకు, అలాగే ప్రసూతి ఖర్చులకు పెరుగుతుంటాయి. ఇందులో ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేదు. ఇవి అత్యవసర వైద్య ఖర్చుల కోసం ఉపయోగపడతాయి.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Health Insurance, Insurance, Life Insurance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు