హోమ్ /వార్తలు /బిజినెస్ /

Wedding Insurance-Explained: పెళ్లికి కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు.. ఎలాంటి సందర్భాల్లో పరిహారం వస్తుందంటే?

Wedding Insurance-Explained: పెళ్లికి కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు.. ఎలాంటి సందర్భాల్లో పరిహారం వస్తుందంటే?

పెళ్లికి కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు.. ఎలాంటి సందర్భాల్లో పరిహారం వస్తుందంటే?

పెళ్లికి కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు.. ఎలాంటి సందర్భాల్లో పరిహారం వస్తుందంటే?

ఈ కరోనా కారణంగా వివాహాలు ఎప్పుడు జరుగుతాయో? ఏ క్షణంలో వాయిదా పడతాయో తెలియని దుస్థితి నెలకొంది. ఇలాంటి సందర్భాలు మాత్రమే కాకుండా ఇతర ఏ కారణంగా చేత వివాహం వాయిదా పడినా పరిహారం పొందే అవకాశాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అందిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

ఇంకా చదవండి ...

రెండేళ్ల ముందు వరకు వరకు వివాహ వేడుకలంటే (Marriage Celebration) వందలు, వేల మంది బంధుమిత్రుల సమక్షంలో సంబరంగా జరిగేవి. అయితే కరోనా (Corona) ఎంటర్ అయినప్పటి నుంచి ఆ పరిస్థితి మారింది. కేవలం పరిమిత సంఖ్యలోనే బంధువులను ఆహ్వానించి వేడుకను జరిపించాల్సిన పరిస్థి ఏర్పడింది. అయితే ఎప్పుడు ఎక్కడ కేసులు వస్తాయో.. ఎప్పుడు ప్రభుత్వం వేడుకలను (Covid 19 Restrictions) నిషేధిస్తుందో తెలియని పరిస్థితి. దీంతో వివాహాలు (Marriages) చేసుకునే వారితో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం ఇబ్బంది పడుతున్నారు. వివాహం రెండు, మూడు రోజులు ఉందనగా ప్రభుత్వ ఆంక్షల కారణంగా రద్దు చేసిన ఘటనలు సైతం అనేకం. కుటుంబ సభ్యులే కాకుండా కాబోయే వధూవరులకే కరోనా సోకడంతో వివాహాలు వాయిదా వేసిన సందర్భాలు కూడా అనేకం. ఇలాంటి పరిస్థితుల్లో వివాహం కోసం చేసిన ఏర్పాట్లు, పెట్టిన ఖర్చు అంతా వృథా అవుతోంది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కు సంబంధించిన కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ లాక్ డౌన్ లేదా ఆంక్షలు విధిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వివాహాలకు ప్లాన్ చేసుకున్న అనేక మంది టెన్షన్ పడుతున్నారు. అయితే.. అలాంటి వారి కోసం ఇన్సూరెన్స్ చేసుకునే సదుపాయన్ని తీసుకువచ్చాయి ఇన్సూరెన్స్ సంస్థలు. వివాహాలను రీషెడ్యూల్ చేసుకున్న సందర్భంగా ఏర్పడే ఆర్థిక నష్టాన్ని నివారించడానికి వివాహ బీమాను చేయించుకోవచ్చు.

Health Insurance: వారి హెల్త్ ఇన్స్యూరెన్స్ తిరస్కరించకూడదు... సుప్రీం కోర్టు తీర్పు

బీమా చేయడానికి ఎంత ఖర్చవుతుంది?

వివాహ భీమామొత్తం అనేది మీ పెళ్లి బడ్జెట్‌పై ఆధారపడి ఉంటుంది. బీమాపై విధించే ప్రీమియం మొత్తం బీమా మొత్తంలో 0.7-2% మధ్య ఉంటుంది. రూ.10 లక్షల వివాహ బీమా పొందాలంటే రూ.7,500 నుంచి రూ.15,000 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వివాహాలు వాయిదా లేదా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు వివాహ బీమా మీరు చేసిన మేజర్ ఖర్చులను కవర్ చేస్తుంది.

Health Insurance: నెలకు రూ. 85తో రూ. 5 లక్షల వరకు బీమా.. కొత్త హెల్త్ పాలిసీ.. వివరాలు ఇవే

వివాహానికి సంబంధించిన బీమా పాలసీలు సాధారణంగా నాలుగు రకాలుగా ఉంటాయి..

Coverage of Liabilities: వివాహం అనేది చాలా మందితో కూడుకున్న వేడుక. అయితే కొన్ని సార్లు వివాహాల సందర్భంగా ప్రమాదాలు, అపశృతులు చోటు చేసుకుంటాయి. ప్రమాదం లేదా గాయం కారణంగా వివాహ వేడుకలో ఎవరికైనా నష్టం వాటిల్లితే ఈ కేటగిరీకి చెందిన ఇన్సూరెన్స్ దానిని కవర్ చేస్తుంది.

Cancellation Coverage: వివాహాన్ని ఆకస్మికంగా లేదా ఊహించని కారణంతో రద్దు చేయడం వల్ల కలిగే నష్టాలను కేటగిరీ కవర్ చేస్తుంది.

Damage to Property: వివాహ వేడుకల్లో కొన్ని సార్లు అనుకోని ప్రమాదం జరిగి ఆస్తి నష్టం వాటిల్లుతుంది. ఈ కేటగిరీ అలాంటి నష్టాలను కవర్ చేస్తుంది.

Personnel Accident: ఈ కేటగిరీ ప్రమాదం కారణంగా వధూవరుల ఆసుపత్రికి అయ్యే ఖర్చును కవర్ చేస్తుంది.

వివాహానికి సంబంధించిన బీమా ఈ కింది ఖర్చులను కవర్ చేస్తుంది..

1. క్యాటరింగ్ కోసం ఇచ్చిన అడ్వాన్స్.

2. వివాహ వేదిక కోసం ముందస్తుగా చెల్లించిన అడ్వాన్స్.

3. ట్రావెల్ ఏజెన్సీలకు చేసిన ముందస్తు చెల్లింపులు.

4. హోటల్ గదులను బుక్ చేయడానికి ఇచ్చిన అడ్వాన్స్.

5. వివాహ డెకరేషన్ కు అయిన ఖర్చు

6. మ్యారేజ్ లో ఎంటర్టైన్మెంట్ కోసం ఏర్పాటు చేసిన కచేరి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చిన అడ్వాన్స్ సంగీతం.

7. అలంకరణ మరియు వివాహ సెట్ కే చేసిన ఖర్చు.

ఈ సందర్భాల్లో బీమా కంపెనీకి తెలియజేయాలి..

వివాహ వేడుకకు ముందు కానీ, జరుగుతున్న సమయంలో కానీ అనూహ్య సంఘటన జరిగితే మీరు వెంటనే భీమా సంస్థకు సమాచారాన్ని అందించాలి. అనంతరం బీమా కంపెనీ వాస్తవాలను పరిశీలిస్తుంది. మీకు జరిగిన నష్టం సరైన కారణంతో అని వారు నిర్ధారిస్తే ఆ ఖర్చు మీకు తిరిగి చెల్లించబడుతుంది.


ఉగ్రవాద దాడి, సమ్మె, వధూవరులను కిడ్నాప్ చేయడం, పెళ్లికి వచ్చిన అతిథుల దుస్తులు మరియు వ్యక్తిగత వస్తువులు కోల్పోవడం, వివాహ వేదిక ఆకస్మికంగా అందుబాటులో లేకపోవడం, పాలసీదారుడి ఆదేశానుసారమే వివాహ వేదికకు నష్టం వాటిల్లడం వంటి సందర్భాల్లో క్లెయిమ్‌లకు ఎలాంటి పరిహారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించవు. నిర్లక్ష్యం లేదా పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆస్తి నష్టం జరిగినట్లు కూడా నిర్ధారణ అయితే వారికి ఎలాంటి పరిహారాలు చెల్లించబడవు.

First published:

Tags: Corona, Corona marriages, Covid 19 restrictions, Insurance, Marriage

ఉత్తమ కథలు