HERE IS A SIMPLE STEP BY STEP GUIDE TO FILE INCOME TAX RETURNS IN THE NEW PORTAL NS GH
IT returns: కొత్త IT పోర్టల్‌లో రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి
ప్రతీకాత్మక చిత్రం
ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి తుది గడువు డిసెంబర్ 31 వరకు ఉంది. ఈసారి ఐటీ రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియ ఇంతకు ముందు కంటే భిన్నంగా ఉంది. కొత్త ఆదాయ పన్ను రిటర్న్ ఫైలింగ్ పోర్టల్ ద్వారా మాత్రమే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
అసెస్మెంట్ ఈయర్ 2021-22కు (2020-21 ఆర్థిక సంవత్సరం) సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్స్(ITR) దాఖలు చేయడానికి తుది గడువు డిసెంబర్ 31 వరకు ఉంది. ఈసారి ఐటీ రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియ ఇంతకు ముందు కంటే భిన్నంగా ఉంది. కొత్త ఆదాయ పన్ను రిటర్న్ ఫైలింగ్ పోర్టల్ ద్వారా మాత్రమే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎంచుకున్న పన్ను విధానాన్ని సూచించాల్సిన మొదటి అసెస్మెంట్ సంవత్సరం ఇది. జీతం పొందే ట్యాక్స్ పేయర్లు రిటర్న్ దాఖలు చేసే సమయంలో రెండు పన్ను విధానాల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొత్త పోర్టల్‌లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఈ స్టెప్స్ పాటించి ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చు.
- జీతం పొందే పన్ను చెల్లింపుదారులు ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్న్స్ ఫైల్ చేసేందుకు అనుసరించాల్సిన ప్రక్రియ..
- గత సంవత్సరం రిటర్న్‌లు, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు, ఫారమ్-16, ఫారమ్ 26AS వంటి కీలకమైన పత్రాలను పన్ను చెల్లింపుదారులు సిద్ధం చేసుకోవాలి.
- మెయిన్ డ్రాప్‌డౌన్ మెనూ నుంచి ఈ-ఫైల్ ట్యాబ్‌కి వెళ్లండి.
- ఇక్కడ ఆన్లైన్, ఆఫ్‌లైన్ మోడ్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అసెస్మెంట్ సంవత్సరాన్ని కూడా సెలక్ట్ చేసుకోవాలి. ప్రైవేట్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ల మాదిరిగానే దీని ద్వారా కూడా మొత్తం ప్రక్రియను ఆన్లైన్లో పూర్తి చేయవచ్చు. ఇంతకుముందు ITR-1, ITR-4Sకి మాత్రమే దీన్ని పరిమితం చేశారు.
- మీరు ఉపయోగించాల్సిన ITR ఫారమ్‌ను ఎంచుకోండి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో చాలా మంది వేతన పన్ను చెల్లింపుదారులు (salaried tax-payers) మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్, నికర మూలధన లాభాల్లో (net capital gains) పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నందువల్ల.. ITR-2ని ఎంచుకుంటే తరువాతి ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం. ITR Filing: మీ ఆదాయ పన్ను రిటర్న్‌ను వెరిఫై చేయడం మర్చిపోయారా? ఐతే ఇలా చేయండి
- ఐటీఆర్ ఫారంను సెలక్ట్ చేసుకున్న తరువాత రిటర్న్స్ దాఖలు చేసే నిర్దిష్ట విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిక్లరేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. .
- ఇక్కడ సంబంధిత షెడ్యూల్స్‌ను పూరించండి. ముందుగా నింపిన సమాచారాన్ని అవసరమైన విధంగా సవరించుకోవచ్చు. జీతం షెడ్యూల్లో మొత్తం సమాచారం, తగ్గింపులను మరోసారి తనిఖీ చేసి నమోదు చేయండి.
- జీతం, తగ్గింపులు, మూలధన లాభాలు వంటి వివరాలను ధ్రువీకరించండి. మీ రిటర్న్ సారాంశాన్ని (return summary) పూర్తిగా తనిఖీ చేసిన తరువాత రిటర్న్స్ సమర్పించండి. అయితే రిటర్న్ సమర్పించే ముందు వెరిఫికేషన్ మెథడ్‌ను ఎంచుకోవాలి.
- అనంతరం రిటర్న్స్‌ను వెరిఫై చేయడం మర్చిపోకూడదు. నెట్‌బ్యాంకింగ్, ఆధార్-OTP, డీమ్యాట్ అకౌంట్ లేదా ATM ద్వారా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (EVC)ని జెనరేట్ చేసి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. మీ రిటర్న్‌లను.. మెయిన్ మెనూ> ఈ-ఫైల్> ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్> ఈ-వెరిఫై రిటర్న్స్.. వంటి స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా ధ్రువీకరించవచ్చు. రిటర్న్ దాఖలు చేసిన 120 రోజులలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.