Home /News /business /

HERE IS A QUICK LOOK AT THE CARS THAT ARE LAUNCHING DURING THIS FESTIVAL SEASON GH SRD

New Cars: ఫెస్టివల్ సీజన్‌లో ఇండియాలో రిలీజ్ అవుతున్న కార్లు ఇవే.. ధరలు, స్పెసిఫికేషన్లు తెలుసుకోండి...

Maruti Suzuki Grand Vitara (PC : Maruti Suzuki)

Maruti Suzuki Grand Vitara (PC : Maruti Suzuki)

New Cars: పండుగల సీజన్ సందర్బంగా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త కార్లను రిలీజ్ చేస్తున్నాయి. వాటిపై ఒక లుక్కేద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
భారతదేశంలో ఫెస్టివల్ సీజన్ (Fesival Season) సందడి స్టార్ట్ అయింది. ప్రజలు సరికొత్త ఫోన్లు (New Phones), బట్టలు ఇంకా వాహనాలు (Vehicles) కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ పండుగ రోజుల్లో వాహనాలు కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందనే సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రముఖ ఆటోమొబైల్(Automobile) కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త కార్లను రిలీజ్ చేస్తున్నాయి. మార్కెట్ ట్రెండ్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ఇప్పటికే టాటా, మెర్సిడెస్-బెంజ్, మారుతి వంటి కంపెనీలు నయా కార్లను త్వరలోనే లాంచ్ చేసేందుకు సిద్ధం అయ్యాయి. వాటిపై ఒక లుక్కేద్దాం. * మారుతి సుజుకి గ్రాండ్ విటారా SUV మారుతి సుజుకి గ్రాండ్ విటారా SUV ఇండియాలో సెప్టెంబర్ నెలలో లాంచ్ కానుంది. ఈ ప్రీమియం SUV కారు ధరలను ఈ వారంలో ప్రకటించే అవకాశం ఉంది. దీనిని ఇప్పటికే చాలామంది బుక్ కూడా చేసుకున్నారు. దేశంలో మారుతి బ్రాండ్ నుంచి వస్తున్న తొలి హైబ్రిడ్ వాహనం ఇది. ఈ 5 సీటర్ SUV మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ అనే రెండు వేర్వేరు వెర్షన్లలో వస్తుంది. ఈ కారు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా హారియర్ వంటి కార్లకు పోటీగా నిలవనుంది. సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా, జీటా, ఆల్ఫా+ అనే ఆరు విభిన్న ట్రిమ్ ఆప్షన్స్‌లో ఈ SUV రిలీజ్ కానుంది. * MG హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ MG హెక్టర్ బెస్ట్ సెల్లింగ్ SUVగా రాణిస్తోంది. అయితే కాస్మోటిక్స్ మార్పులతో మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ కారును కంపెనీ రిలీజ్ చేస్తోంది. ఈ MG హెక్టర్ SUV అప్‌డేటెడ్ డిజైన్, కొత్త ఫీచర్ల, పెద్ద ఫ్రంట్ గ్రిల్‌, 14-అంగుళాల పోర్ట్రెయిట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో చెప్పుకోదగిన ఫీచర్లు. దీని ధర, మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. అక్టోబర్ 15న ఈ కారు లాంచ్ కావచ్చని సమాచారం. * టాటా టియాగో ఈవీ టాటా టియాగో EV సెప్టెంబర్ 28న అత్యంత తక్కువ ధరతో రిలీజవుతోంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఒకే ఛార్జ్‌పై 360 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని టాక్. దీనిని కంపెనీ రూ.10 లక్షల ధరలో తీసుకురావచ్చని తెలుస్తోంది. టాటా మోటార్స్ జిప్‌ట్రాన్ టెక్నాలజీ, టాటా టిగోర్ EV వంటి ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌ ఈ అప్‌కమింగ్ కార్‌లో ఆఫర్ చేసినట్లు ఆటోమొబైల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది కూడా చదవండి : దీపావళికి కొత్త కార్ కొంటున్నారా? కొత్త రూల్ రాబోతోంది * మెర్సిడెస్ బెంజ్ EQS 580 మెర్సిడెస్ బెంజ్ EQS 580 సెప్టెంబర్ 30 న విడుదల కానుంది. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారును భారతదేశంలో స్థానికంగా అసెంబుల్ చేయడం విశేషం. పుణే ఫ్యాక్టరీలో అసెంబుల్ అయిన ఈ లగ్జరీ EV బుకింగ్స్‌ రూ.25 లక్షల టోకెన్ ప్రైస్‌తో ప్రారంభమయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ కారు 516 BHP, 856 Nm ప్రొడ్యూస్ చేస్తోందని తెలుస్తోంది. ఇందులో 107.8 kWh బ్యాటరీ ఆఫర్ చేయగా ఇది 770 కిమీ డ్రైవింగ్ రేంజ్‌ అందిస్తుంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, Festival, MARUTI SUZUKI, New cars, Tata cars

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు