Home /News /business /

HERE FULL LIST OF BANK HOLIDAYS IN OCTOBER MONTH 2022 ACCORDING TO RBI GH SRD

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు 21 రోజులు సెలవులు.. హాలిడేస్ లిస్ట్ చెక్ చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bank Holidays: పండుగ సీజన్ కారణంగా అక్టోబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు వచ్చాయి. వచ్చే నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) విడుదల చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకింగ్‌ సేవలు (Banking Services) ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లు వాడని కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్ ద్వారానే సేవలు పొందుతున్నారు. అలాగే పెద్ద మొత్తంలో నగదు డ్రా చేయడం, డిపాజిట్‌ చేయడం వంటి పనులకు బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లాల్సిందే. ఇలాంటి ముఖ్యమైన పనులు ఉన్న సమయంలో బ్యాంకు సెలవులు (Bank Holidays) ఉంటే ఇబ్బందులు తప్పవు. అయితే ఈ అక్టోబరులో దాదాపు 21 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. పండుగ సీజన్ కారణంగా అక్టోబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు వచ్చాయి. వచ్చే నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) విడుదల చేసింది. మార్గదర్శకాల ప్రకారం.. నిర్దిష్ట రాష్ట్రాన్ని బట్టి కొన్ని ప్రాంతీయ సెలవులతో అన్ని ప్రభుత్వ సెలవు దినాల్లో బ్యాంకులు పని చేయవు. ఏ రోజుల్లో బ్యాంకులు మూతబడతాయో తెలుసుకుందాం. * గాంధీ జయంతితో మొదలు అక్టోబర్‌లో గాంధీ జయంతి, హిందువులకు ముఖ్యమైన దసరా, దీపావళి పండుగలు, శని, ఆదివారాలతో కలుపుకొని ఏకంగా బ్యాంకులకు 21 సెలవులు ఉన్నాయి. ప్రాంతీయ సెలవులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. అందువల్ల వినియోగదారులు తమ సంబంధిత బ్యాంకు శాఖలను సందర్శించే ముందు సెలవు జాబితాను తనిఖీ చేయాలి. జాబితాలోని కొన్ని సెలవులు కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయని గుర్తించాలి. అక్టోబర్ నెలలో 21 బ్యాంకు సెలవులు ఉంటాయి. మొదటి సెలవు అక్టోబర్ 2న గాంధీ జయంతి నుంచి ప్రారంభమవుతుంది. దసరా అక్టోబర్ 5న, దీపావళి అక్టోబర్ 24న వస్తున్నాయి. ఈ సెలవులను దాదాపు రాష్ట్రాలు అనుసరిస్తాయి. * అందుబాటులో ఆన్‌లైన్‌ సేవలు 21 రోజుల పాటు బ్యాంకులు మూతపడినప్పటికీ, ఆన్‌లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం కస్టమర్‌లు భౌతికంగా బ్యాంక్‌లో నగదును డిపాజిట్ చేయలేరు, విత్‌డ్రా చేయలేరు. మిగిలిన ఇంటర్నెట్ సేవలను ఎటువంటి అసౌకర్యం లేకుండా పొందవచ్చు. ఏదైనా అసౌకర్యాన్ని నివారించడానికి, ఏదైనా బ్యాంక్ సంబంధిత పని ఉంటే, సంబంధిత రాష్ట్రంలో అమలయ్యే సెలవుల వివరాలు తెలుసుకునేందుకు స్థానిక బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లడం మంచిది. * 2022 అక్టోబర్‌లో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే.. అక్టోబర్ 1- బ్యాంక్‌ అకౌంట్ల అర్ధ సంవత్సర ముగింపు అక్టోబర్ 2 - ఆదివారం & గాంధీ జయంతి సెలవు అక్టోబర్ 3 - దుర్గా పూజ (మహా అష్టమి) అక్టోబర్ 4 - దుర్గాపూజ/దసరా (మహా నవమి)/ఆయుధ పూజ/శ్రీమంత శంకర దేవుని జన్మోత్సవం అక్టోబర్ 5 - దుర్గాపూజ/దసరా (విజయ దశమి)/శ్రీమంత శంకర దేవుని జన్మోత్సవం అక్టోబర్ 6 - దుర్గా పూజ (దశైన్) అక్టోబర్ 7 - దుర్గా పూజ (దశైన్) అక్టోబర్ 8 - రెండవ శనివారం సెలవు, మిలాద్-ఇ-షెరీఫ్/ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ (ప్రవక్త మహ్మద్‌ జన్మదినం) అక్టోబర్ 9 - ఆదివారం అక్టోబర్ 13 - కర్వా చౌత్ అక్టోబర్ 14 - ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ తర్వాత శుక్రవారం అక్టోబర్ 16 - ఆదివారం అక్టోబర్ 18 - కటి బిహు అక్టోబర్ 22 - నాలుగో శనివారం అక్టోబర్ 23 - ఆదివారం అక్టోబర్ 24 - కాళీ పూజ/దీపావళి/దీపావళి (లక్ష్మీ పూజ)/నరక చతుర్దశి) అక్టోబర్ 25 - లక్ష్మీ పూజ/దీపావళి/గోవర్ధన్ పూజ అక్టోబర్ 26 - గోవర్ధన్ పూజ/విక్రమ్ సంవత్ కొత్త సంవత్సరం రోజు/భాయ్ బిజ్/భాయ్ దుజ్/దీపావళి (బలి ప్రతిపద)/లక్ష్మీ పూజ/ప్రవేశ దినం అక్టోబర్ 27 - భైదూజ్/చిత్రగుప్త జయంతి/లక్ష్మీ పూజ/దీపావళి/నింగోల్ చక్కూబా అక్టోబర్ 30 - ఆదివారం అక్టోబర్ 31 – సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పుట్టినరోజు/సూర్య పష్టి దాలా ఛత్ (ఉదయం అర్ధ)/ఛత్ పూజ
Published by:Sridhar Reddy
First published:

Tags: Bank Holidays, Banks, Personal Finance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు