మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పాలసీలివి!

బీమా... ప్రతీ ఒక్కరికీ అవసరం. అది మీ జీవితంలో ఓ భాగంగా మారిపోవాలి. మరి ఏఏ పాలసీలు ఉండాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: September 12, 2018, 4:54 PM IST
మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పాలసీలివి!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇంటి యజమానికి ఓ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే చాలని గతంలో అనుకునేవారు. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. పరిస్థితులు, అవసరాలు మారుతున్నా కొద్దీ బీమా కవర్ తీసుకోవాలన్న స్పృహ పెరుగుతోంది. ఎందుకంటే ఆరోగ్య అత్యవసర పరిస్థితి వస్తే ఇన్సూరెన్స్ పాలసీ ఆదుకోదు. దానికి మెడిక్లెయిమ్ ఉండాల్సిందే. ఇలా జీవితంలో ఒక్కో అవసరానికి ఒక్కో తరహా పాలసీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

జీవిత బీమా

ఇది ప్రతీ ఒక్కరికీ ఉండాల్సిన బీమా. టర్మ్ ప్లాన్ తీసుకోవడం చాలా అవసరం. ఇది మూడు రకాలుగా ఉపయోగపడుతుంది. ఆకస్మిక మరణం, ప్రాణాంతక రోగాలబారిన పడటం, వైకల్యం... ఈ మూడు పరిస్థితుల్లో టర్మ్ ప్లాన్ ఆదుకుంటుంది. వార్షిక ఆదాయం కన్నా 10 రెట్లు టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలన్నది అందరూ పాటించే నియమం.

ఆరోగ్య బీమా
టర్మ్ ప్లాన్ ఎంత ముఖ్యమో... హెల్త్ ప్లాన్ కూడా అంతే ముఖ్యం. మీ కంపెనీ ఇచ్చినదానికన్నా ఎక్కువే హెల్త్ ప్లాన్ తీసుకోండి. కనీసం రూ.5 లక్షల ఆరోగ్య బీమా తప్పనిసరి. రూ.20 లక్షల వరకు తీసుకోవడం మంచిది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రూ.25 లక్షల వరకు ఉండాలని అంటుంటారు నిపుణులు.

వాహన బీమా
మీకు జీవిత బీమా ఉన్నా, వాహనానికి ఇన్సూరెన్స్ ఉన్నా... థర్డ్ పార్టీ కవర్ తప్పనిసరి. ఎందుకంటే మీ వాహనం కారణంగా ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే... ఆ బాధితుడికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా పరిహారం అందించొచ్చు. ఇవి కాకుండా ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్, రోడ్ అసిస్టెన్స్ కవర్, జీరో డిప్రిసియేషన్ కవర్ పేరుతో కొన్ని పాలసీలున్నాయి.

ఇంటికో పాలసీ
మీ ఇంటికి హోమ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు షాప్ ఉంటే... 'షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్' తీసుకోవచ్చు. హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తికి బ్యాంకులు ఇన్సూరెన్స్‌లు ఇస్తాయి. ఎందుకంటే... హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే మిగతా ఈఎంఐలు ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది.

రిటైర్మెంట్ పాలసీ
మీరు రిటైర్ అయ్యాక నెలనెలా కొంత ఆదాయం కావాలనుకుంటే మాత్రం ఇప్పట్నుంచే రిటైర్మెంట్ పాలసీ తీసుకోవాలి. రిటైర్ అయ్యాక మీరు బతికున్నన్నాళ్లు ఇన్సూరెన్స్ కంపెనీ నెలనెలా డబ్బులు చెల్లిస్తుంది.

చైల్డ్ ఎడ్యుకేషన్ పాలసీ
ఈ రోజుల్లో చదువులు చాలా ఖరీదయ్యాయి. వీటిని దృష్టిపెట్టుకొని కంపెనీలు చైల్డ్ పాలసీలను అందిస్తున్నాయి. పిల్లలు పెద్దయ్యాక వారి మంచి కోర్సుల్లో చేరే సమయానికి పాలసీ క్లెయిమ్ చేసుకోవచ్చు.

అయితే మీరు ఏ పాలసీ తీసుకోవాలన్నా ముందుగా కంపెనీల ట్రాక్ రికార్డుతో పాటు... పాలసీలను, వచ్చే లాభాలను పోల్చి చూసుకోవాలి. లేదా గైడెన్స్ కోసం ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కలవడం మంచిది.

ఇవి కూడా చదవండి:

పెట్రోల్ పొదుపు చేయడానికి 20 మార్గాలు

పెట్రోల్ బండి కన్నా ఇ-వెహికిల్ బెటరా?

జియో ఫోన్‌లో వాట్సప్ వచ్చేసింది!

పర్సనల్ లోన్: ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!
Published by: Santhosh Kumar S
First published: September 12, 2018, 4:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading