Home /News /business /

HERE ARE THE LIST OF 5 BANS WHICH ARE GIVING HOME LOANS WITH LOW INTEREST RATES FULL DETAILS HERE PRN GH

Home Loan: మీకు హోమ్ లోన్ కావాలా..? తక్కువ వడ్డీకి అందిస్తున్న ఐదు బ్యాంకులు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇల్లు కట్టేందుకు కొంత మొత్తం ఉన్నా బ్యాంకు లోన్‌లపై ఆధారపడాలి. ప్రస్తుతం హోంలోన్లను(Home Loan) తక్కువ వడ్డీ రేట్లకు(Interest) బ్యాంకులు అందిస్తున్నాయి. 6.5 పర్సెంట్‌తోనే వడ్డీ రేట్లు మొదలవుతున్నాయి.

సొంత ఇల్లు (Home) అనేది ఎవరికైనా జీవితంలో పెద్ద కల. చాలా మంది సొంత ఇంటిని నిర్మించుకోవాలని లక్ష్యంగా పెట్టుకొంటారు. అయితే అందరికీ సొంతింటిని నిర్మించుకొనే అంత ఆర్థిక బలం ఉండకపోవచ్చు. కొంత మొత్తం ఉన్నా బ్యాంకు లోన్‌లపై ఆధారపడాలి. ప్రస్తుతం హోంలోన్లను(Home Loan) తక్కువ వడ్డీ రేట్లకు(Interest) బ్యాంకులు అందిస్తున్నాయి. 6.5 పర్సెంట్‌తోనే వడ్డీ రేట్లు మొదలవుతున్నాయి. మొదటిసారి హోంలోన్‌ తీసుకోవాలనుకొనేవారికి ప్రస్తుతం అనుకూలంగా వడ్డీ రేట్లు ఉన్నాయి. హోంలోన్లు దీర్ఘకాలికంగా తిరిగి చెల్లించాల్సినవి. దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల వరకు తిరిగి చెల్లించేలా ఉంటాయి. ఏ బ్యాంకు తక్కువ వడ్డీ రేటుతో హోమ్ లోన్‌ అందిస్తుందో తెలుసుకోకుండా ముందుకు వెళ్తే చాలా పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుంది.

హోమ్ లోన్లు అందించే బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులు, ప్రాపర్టీ విలువను బట్టి నిబంధనలు విధిస్తుంటాయి. అన్ని బ్యాంకులు ఒకే తరహా నిబంధనలను అనుసరించవు. కొన్ని బ్యాంకులు మహిళలకు వడ్డీరేట్లను తగ్గించి హోమ్ లోన్‌ సదుపాయం కల్పిస్తాయి. లోన్‌ తీసుకొనే వారు తక్కువ వడ్డీరేట్లనే కాకుండా నియమ నిబంధనలను కూడా గమనించాల్సి ఉంటుంది. అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థల వడ్డీరేట్లను, నిబంధనలను పరిశీలించి, ఎక్కడ లోన్‌ తీసుకొంటే మంచిదో నిర్ణయించుకోవాలి. తక్కువ వడ్డీకి లోన్‌ అందితే ప్రతి నెలా చెల్లించాల్సిన ఈఎంఐ భారం తగ్గుతుంది.

ఇది చదవండి: మహాశివరాత్రికి ఆర్టీసీ స్పెషల్ బస్సులు... ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్..


క్రెడిట్‌ స్కోరు ఎక్కువగా ఉన్న వారికి తక్కువ వడ్డీలకు లోన్లు అందజేస్తారు. హోమ్ లోన్‌ కోసం ప్రయత్నించే ముందు క్రెడిట్‌ స్కోరును పరిశీలించుకొని, ప్రస్తుతం బ్యాంకులు అందిస్తున్న వడ్డీరేటును పరిశీలించి, ఎక్కడ లోన్‌ తీసుకోవాలని నిర్ధారించుకోవాలి. మహిళతో కలిసి మీరు హోమ్ లోన్‌కు అప్లై చేస్తుంటే మీకు అదనంగా వడ్డీలో 0.05 శాతం తగ్గుతుంది. భార్యతో కలిసి హోమ్ లోన్‌కు అప్లై చేసే వారికి తక్కువ వడ్డీరేటుకు హోమ్ లోన్‌ లభించే అవకాశాలు ఎక్కువ.

ఇది చదవండి: వారికి ఫిక్స్​డ్​ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ అందిస్తున్న బ్యాంక్స్ ఇవే.. ఓ లుక్కేయండి..


తక్కువ వడ్డీకి హోమ్ లోన్‌ ఇస్తున్న బ్యాంకులు ఇవే..
యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 6.4 శాతం, బ్యాంక్‌ ఆప్‌ మహారాష్ట్ర 6.4శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 6.5 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 6.5 శాతం, కొటక్‌ మహింద్ర బ్యాంకు 6.55 శాతం వడ్డీతో హోమ్ లోన్‌ అందిస్తున్నాయి.

ఇది చదవండి: ఇక్కడ బిర్యానీ తింటే కిక్కుతో పాటు లక్ష చెక్కు మీదే..! వైరల్ అవుతున్న ఫుడ్ ఛాలెంజ్


హోమ్ లోన్‌ అప్లై చేసే అందరికీ బ్యాంకు మార్జిన్‌ ఒకేలా ఉంటుంది. కానీ రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా సర్క్యులర్‌ మేరకు బ్యాంకులు లోన్‌ తీసుకొనే వారికి రిస్కు ప్రీమియం విధించే వెసులుబాటు ఉంటుంది. లోన్‌ కోసం అప్లై చేసిన వ్యక్తి క్రెడిట్‌ హిస్టరీని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిశీలించి బ్యాంకులు రిస్కు ప్రీమియంను నిర్ధారిస్తాయి. కాబట్టి రిస్కు ప్రీమియం అందరికీ ఒకే తరహాలో ఉండదు. క్రెడిట్‌ హిస్టరీని బట్టి మారుతుంది. బ్యాంకులు మూడు నెలలకు ఒకసారి లోన్‌ వడ్డీరేట్లను మార్చాలి. కొత్తవాటిని ప్రకటించాలి. బ్యాంకుల వడ్డీరేట్లు ఎక్ట్సెర్నల్‌ బెంచ్‌ మార్కుకు ముడిపడి ఉంటాయి. ఎక్ట్సెర్నల్‌ బెంచ్‌ మార్కులో చేసిన ఏమార్పును అయినా మూడు నెలల్లో బ్యాంకులు వినియోగదారులకు అందజేయాలి.

ఈఎంఐ ఎలా లెక్కించాలి?
హోమ్ లోన్‌ ఈఎంఐ లెక్కించేందుకు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చాలా వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. ET Wealth ఆన్‌లైన్‌ హోమ్ లోన్‌ కాల్యుకులేటర్‌ను వినియోగించి నెలవారీగా ఈఎంపై రిపోర్టును పొందవచ్చు.
Published by:Purna Chandra
First published:

Tags: Bank, Bank loans, Business, Home loan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు