HERE ARE THE DETAILS OF THE INTEREST RATES AVAILABLE IN DIFFERENT BANKS VB
Intrest Rates: హోమ్ లోన్ తీసుకున్నారా.. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో తెలుసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
Intrest Rates: కరోనా సెకండ్ వేవ్ ఎంతటి విలయతాండవం స్పష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది ఆర్థికాంగా కూడా ఎంతో నష్టపోయారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు చాలావరకు తగ్గాయి. వాటిని ఇక్కడ తెలుసుకుందాం..
కరోనా సెకండ్ వేవ్ ఎంతటి విలయతాండవం స్పష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది ఆర్థికాంగా కూడా ఎంతో నష్టపోయారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. రెపోరేటు తగ్గడంతో చాలా బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు చాలా వరకు తగ్గాయి. 2019 సెప్టెంబర్ నాటికి అతి తక్కువ హోమ్ లోన్ వడ్డీ రేటు 8.40 శాతంగా ఉండగా.. ప్రస్తుతం ఏకంగా 6.49 శాతం నుంచి 6.95 శాతం మధ్య ఉన్నది. ఈ సందర్భంగా రెపోరేటు తగ్గించడం వల్ల వడ్డీ రేట్లు రెండు శాతం వరకు తగ్గాయి. ప్రస్తుతం 16 బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు రూ.75 లక్షలకు పైగా హోమ్ లోన్‌ను ఏడు శాతం కంటే తక్కువ వడ్డీ రేటుకు అందిస్తున్నాయి. ఈ బ్యాంకుల్లోను ప్రయివేటు రంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంకు, ప్రభుత్వరంగ పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులు తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. ఈ బ్యాంకుల్లో వడ్డీ రేటు 6.65 శాతం మాత్రం ఉన్నాయి.. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో 6.95 శాతం, ప్రయివేటు రంగ దిగ్గజం Housing Development Corporation Fo India (HDFC) లో హోమ్ లోన్ వడ్డీ రేటు 7 శాతంగా ఉంది.
ఇప్పటికే హోమ్ లోన్ తీసుకొని హోమ్ లోన్ ఈఎంఐ చెల్లిస్తున్న వారు కూడా తక్కువ హోమ్ లోన్ వడ్డీ రేటు ఉన్న బ్యాంకుకు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. తద్వారా వారు తమ వడ్డీ రేటు భారాన్ని తగ్గించుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా 2019 , అక్టోబర్ 1వ తేదీ కి ముందు హోమ్ లోన్ తీసుకున్న వారికి ఇది ప్రయోజనం. ఎందుకంటే ఆ తర్వాత వడ్డీ రేట్లు తగ్గిపోయాయి కాబట్టి. ఏ బ్యాంక్ లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ బ్యాంకులో అయినా రూ.75 లక్షల హోమ్ లోన్ 20 సంవత్సరాల కాల పరిమితికి తీసుకుంటే దాని వడ్డీ రేట్లు, ఈఎంఐ ఇలా ఉండే అవకాశం ఉటుంది. ముందుగా కొటాక్ మహీంద్రా బ్యాంకు, పంజాబ్ అండ్ సిండ్ బ్యాంకులు రెండింట్లో కూడా వడ్డీ రేటు 6.65 శాతం ఉండగా EMI(Equated Monthely Instalment)రూ.56,582 గా ఉంది. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, బజాజ్ ఫిన్ సర్వ్ లల్లో వడ్డీ రేటు అనేది ఒకే విధంగా ఉన్నాయి. అయితే ఈ రెండింట్లో EMI మాత్రం రూ.57,027గా ఉంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో మాత్రం వడ్డీ రేటు 6.80 శాతం ఉండగా.. ఈఎంఐ రూ.57,250 గా ఉండనుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఈ మూడు బ్యాంకుల్లో మాత్రం వడ్డీ రేటు 6.85 శాతంగా ఉంది. వాటిలో మాత్రం ఈఎంఐ రూ.57,474 గా ఉండనుంది. ఐదు బ్యాంకులలు, రెండు ఫైనాన్స్ సంస్థల్లో అంటే కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మరియు టాటా క్యాపిటల్ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల్లో వడ్డీ రేటు 6.90 శాతంగా ఉంది. దీనిలో ఈఎంఐ మాత్రం రూ.57,698 గా ఉండనుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.