హోమ్ /వార్తలు /బిజినెస్ /

ITR Refund: ఆదాయపన్ను శాఖ నుంచి అందే వివిధ రకాల నోటీసులు ఇవే.. వాటికి ఎలా స్పందించాలో తెలుసుకోండి

ITR Refund: ఆదాయపన్ను శాఖ నుంచి అందే వివిధ రకాల నోటీసులు ఇవే.. వాటికి ఎలా స్పందించాలో తెలుసుకోండి

ITR Refund

ITR Refund

ITR Refund: చెల్లించిన పన్నులు, పన్ను చెల్లింపుదారులు చెల్లించాల్సిన దాని కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే, లేదా ఇతర లోపాలను అధికారులు గుర్తిస్తే, అధికారులు నోటీస్ జారీ చేసే అవకాశం ఉంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

పన్ను (Tax) పరిధిలోకి వచ్చే భారతీయ పౌరులు (Indian Citizens) అందరూ ఏటా ఆదాయ పన్ను రిటర్న్(ITR) దాఖలు చేయాలి. ITRను సమర్పించిన తర్వాత, పన్ను శాఖ (Income Tax Department) ఈ వివరాలన్నీ సరిపోలుతున్నాయో లేదో తెలుసుకోవడానికి డిక్లరేషన్‌లు, చెల్లించిన పన్నులను తనిఖీ చేస్తుంది. చెల్లించిన పన్నులు, పన్ను చెల్లింపుదారులు చెల్లించాల్సిన దాని కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే, లేదా ఇతర లోపాలను అధికారులు గుర్తిస్తే, అధికారులు నోటీస్ జారీ చేసే అవకాశం ఉంది. ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ జారీ చేసే నోటీసులు ఏంటి, వాటికి ఎలా రెస్పాండ్ అవ్వాలి..? అనే విషయాలు తెలుసుకుందాం.


* ఇంటిమేషన్‌, నోటీసు
ట్యాక్స్ పేయర్లు ఇంటిమేషన్‌, నోటీసు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి. ఇంటిమేషన్‌ అనేది ITR ప్రాసెసింగ్ ఫలితాన్ని హైలైట్ చేస్తుంది, పన్ను చెల్లింపుదారులు దానికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అయితే నోటీసులకు మాత్రం కచ్చితంగా స్పందించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులకు డిపార్ట్‌మెంట్ పంపించే ముఖ్యమైన నోటీసులు/ఇంటిమేషన్‌లు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..* ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 143(1) ప్రకారం ఇంటిమేషన్‌

ఈ ఇంటిమేషన్‌ పన్ను చెల్లింపుదారుల ఐటీఆర్‌లోని ఆదాయ పన్ను లెక్కింపు, వారి వద్ద ఉన్న రికార్డుల ప్రకారం సరిపోతుందో, లేదో తెలియజేస్తుంది. ఈ దశలో, వివరణాత్మక పరిశీలన జరగదు. కాబట్టి, రిటర్న్ ప్రాసెస్ అయిందని అర్థం చేసుకోవాలి. ఇది ప్రాథమికంగా ధ్రువీకరణను, పన్ను లెక్కింపు, పన్ను చెల్లింపులకు సంబంధించి పన్ను శాఖ ద్వారా లోపాలను పరిష్కరిస్తుంది. ట్యాక్స్ పేయర్లకు ఏదైనా పన్ను లేదా వడ్డీ బకాయి లేదా రీఫండ్‌ చెల్లించారా? లేదా? అని నిర్ధారిస్తుంది. దీని కింద మూడు రకాల ఇంటిమేషన్‌లు ఉండవచ్చు..


- ఎటువంటి డిమాండ్ లేదా రీఫండ్‌ లేకుండా ఇంటిమేషన్‌: డిపార్ట్‌మెంట్ ఎలాంటి సర్దుబాటు చేయకుండా రిటర్న్‌ను అంగీకరిస్తే ఈ రకమైన ఇంటిమేషన్‌ పంపుతుంది.


- ఇంటిమేషన్‌ విత్‌ డిమాండ్‌: సర్దుబాట్లు చేసిన తర్వాత ఈ రకమైన ఇంటిమేషన్‌ జారీ చేస్తారు.


- ఇంటిమేషన్‌ విత్‌ ఏ రీఫండ్‌: ఆదాయపన్ను రిటర్న్‌లో నిర్ణయించిన పన్నుతో పోలిస్తే, TDS, TCS, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ రూపంలో అసెస్సీ ఎక్కువ ఆదాయ పన్ను చెల్లిస్తే ఈ రకమైన ఇంటిమేషన్‌ జారీ చేస్తారు.


* సెక్షన్ 142(1) కింద నోటీసు

ట్యాక్స్ పేయర్ల నుంచి కొంత సమాచారాన్ని సేకరించడానికి ఈ రకమైన నోటీసు జారీ చేస్తారు. రిటర్న్ అంచనా వేయడానికి ముందు ఈ నోటీసు జారీ చేస్తారు.


* సెక్షన్ 143(2) కింద నోటీసు

అసెస్సింగ్‌ ఆఫీసర్‌(AO) డాక్యుమెంట్స్‌తో లేదా అసెస్సీ రెస్పాన్స్‌తో సంతృప్తి చెందనప్పుడు డిపార్ట్‌మెంట్ ఈ నోటీసు పంపుతుంది.


* సెక్షన్ 148 కింద నోటీసు

పన్ను చెల్లింపుదారులు సరిగ్గా ఆదాయాన్ని వెల్లడించనప్పుడు లేదా తక్కువ పన్నులు చెల్లించినప్పుడు, ఆదాయ రిటర్న్‌ను అందించమని అసెస్సీకి ఈ నోటీసును అందజేస్తారు.


ఇది కూడా చదవండి : రెస్టారెంట్లు సర్వీస్‌ ఛార్జీ చెల్లించాలని డిమాండ్‌ చేస్తే ఏం చేయాలి..? ఈ హక్కుల గురించి తెలుసుకోండి..


* పన్ను చెల్లింపుదారులు ఈ ఇంటిమేషన్‌/నోటీసును అందుకుంటే ఏం చేయాలి?

నోటీసు ఎందుకు వచ్చిందనే కారణాన్ని పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాలి. అసెస్సీ దాఖలు చేసిన రిటర్న్ వివరాలను, ఇంటిమేషన్ లెటర్‌లో ఉన్న పన్ను లెక్కింపు వివరాలను తనిఖీ చేయాలి. పన్ను చెల్లింపుదారులు అన్ని వివరాలను సమీక్షించి తదనుగుణంగా సమాధానం ఇవ్వాలి. ఇంటిమేషన్ లెటర్‌కు రెస్పాన్స్ ఇవ్వడానికి టైమ్ లిమిట్.. ఇన్టిమేషన్ లెటర్‌ వచ్చిన తేదీ నుంచి 30 రోజులు. అయితే ఇంటిమేషన్ లెటర్‌కు సమాధానం ఇవ్వడంలో విఫలమైతే, రిటర్న్‌ను u/s 143(1)(a) మేరకు అవసరమైన సర్దుబాట్లు చేసి ప్రాసెస్‌ చేస్తారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Income tax, ITR, ITR Filing, Tax payers, TAX SAVING

ఉత్తమ కథలు