హోమ్ /వార్తలు /బిజినెస్ /

Medical Insurance: అవసరాలకు అనుగుణంగా మెడికల్ ఇన్సూరెన్స్‌ను ఇలా మార్చుకోండి..!

Medical Insurance: అవసరాలకు అనుగుణంగా మెడికల్ ఇన్సూరెన్స్‌ను ఇలా మార్చుకోండి..!

Medical Insurance: అవసరాలకు అనుగుణంగా మెడికల్ ఇన్సూరెన్స్‌ను ఇలా మార్చుకోండి..!

Medical Insurance: అవసరాలకు అనుగుణంగా మెడికల్ ఇన్సూరెన్స్‌ను ఇలా మార్చుకోండి..!

Medical Insurance: ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేవారు అన్ని అవసరాలకు సరిపోయే ప్లాన్‌ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనికోసం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని ఆప్టిమైజ్‌ చేసుకోవచ్చు. వ్యక్తిగత వైద్య అవసరాలకు అనుగుణంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భవిష్యత్తులో ఎదురయ్యే ఊహించని ఆరోగ్య సమస్యల నుంచి రక్షించుకోవడానికి ఒక సమగ్ర హెల్త్‌ ఇన్సూరెన్స్‌ (Health Insurance) పాలసీ అందరికీ అవసరం. వైద్య ఖర్చులతో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఈ స్కీమ్స్ (Schemes) ఉపయోగపడతాయి. అనేక రకాల వైద్య ఖర్చులను హెల్త్ ఇన్సూరెన్స్‌ కవర్‌ చేస్తుంది. అయితే వైద్య అవసరాలు అందరికీ ఒకేలా ఉండవు. వయసు, జీవనశైలి, ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా మెడికల్ నీడ్స్ (Medical Needs) మారుతుంటాయి. అందుకే అన్ని అవసరాలకు సరిపోయే ఇన్సూరెన్స్‌ పాలసీని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనికోసం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని ఆప్టిమైజ్‌ చేసుకోవచ్చు. వ్యక్తిగత వైద్య అవసరాలకు అనుగుణంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను ఎలా ఆప్టిమైజ్‌ చేయాలో? ఇప్పుడు చూద్దాం.

* యాడ్-ఆన్ రైడర్స్

దాదాపు అన్ని సాధారణ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు అనేక ఆప్షనల్‌ రైడర్‌లు లేదా యాడ్-ఆన్‌లతో వస్తాయి. నామమాత్రపు అదనపు ప్రీమియం చెల్లించి వీటిని పొందవచ్చు. మెటర్నిటీ బెనిఫిట్, రోజువారీ హాస్పిటల్ ఖర్చులు, క్రిటికల్ ఇల్నెస్‌ కవర్ మొదలైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత, భవిష్యత్తు వైద్య అవసరాల ఆధారంగా రైడర్లను ఎంచుకోవచ్చు.

* సూపర్ టాప్-అప్‌

బేస్ హెల్త్ ప్లాన్‌ కొనుగోలు చేసిన వారు సూపర్‌ టాప్‌ అప్‌ ద్వారా ఎక్కువ కవర్‌ పొందుతారు. థ్రెషోల్డ్ లిమిట్ దాటినప్పుడు సూపర్ టాప్-అప్ ప్లాన్ కింద కవరేజ్ ప్రారంభమవుతుంది. ఇన్సూరెన్స్‌ ఒక కంపెనీలో.. టాప్‌ అప్‌ పాలసీ మరొక కంపెనీలో ఉండవచ్చు. ఇది బేస్ పాలసీ మొత్తం బీమా మొత్తానికి సమానంగా ఉండాలి.

* ఎక్కువ కవరేజీ

పాలసీదారుల అవసరాల ప్రకారం బీమా మొత్తాన్ని పెంచుకునే ఆప్షన్ అందిస్తున్నాయి ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీలు. అయితే పాలసీదారులు తక్కువ ప్రీమియం గురించి ఆలోచించకుండా.. బీమా అనేది మీ మొత్తం అవసరాలకు సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. సాధారణంగా యువకులు తక్కువ కవరేజీని ఎంచుకోవచ్చు.పెద్దయ్యాక కవరేజీని పెంచుకునే ప్లాన్లను అదనంగా సెలక్ట్ చేసుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులకు కవర్‌ పొందవచ్చు.

ఇది కూడా చదవండి : రైతులకు అలర్ట్... పీఎం కిసాన్ 12వ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడంటే

* EMI ఆప్షన్స్

ఈ రోజుల్లో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లింపులకు నెలవారీ, త్రైమాసిక లేదా ద్వివార్షిక వాయిదాల సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు. ముందస్తుగా చెల్లించాల్సిన వార్షిక ప్రీమియంతో పోలిస్తే మొత్తం ప్రీమియం లెక్కింపు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. తమకు, కుటుంబానికి ఉత్తమంగా సరిపోయే ప్లాన్‌ను నిర్ణయించే ముందు, పూర్తి అంశాలను తెలుసుకోవాలి.

* బేస్ ప్లాన్స్‌ కాంబినేషన్‌

కుటుంబంలో తక్కువ వయసు ఉన్న సభ్యుల కోసం ఫ్యామిలీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ను ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ద్వారా కస్టమైజ్‌ చేయవచ్చు. బేస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతో వృద్ధుల అవసరాలను సీనియర్ సిటిజన్ ప్లాన్‌లు లేదా క్రిటికల్‌ ఇల్నెస్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా తీర్చుకోవచ్చు. వివిధ వయసుల్లో ఉండే సభ్యులు ఉన్న కుటుంబాలకు ఈ ఆప్షన్‌ ఉపయోగపడుతుంది.

* పోర్టింగ్‌ ప్లాన్‌

ప్రస్తుత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌తో పాలసీదారులు అసంతృప్తి చెందితే.. ఇలాంటి ప్రీమియం చెల్లింపులకు మెరుగైన ప్రయోజనాలను అందించే మరొక బీమా కంపెనీకి తమ పాలసీని పోర్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించిన ప్రాసెస్, గైడెన్స్ కొత్త ఇన్సూరెన్స్‌ కంపెనీపై ఆధారపడి ఉంటాయి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Health Insurance, Insurance, Personal Finance

ఉత్తమ కథలు