ప్రపంచంలో చాలా దేశాలు క్రిప్టో కరెన్సీ (Crypto Currency)లను లాంచ్ చేశాయి. అధికారికంగా ట్రాన్సాక్షన్లు (Transcations) నిర్వహించుకునే అవకాశం కల్పిస్తున్నాయి. అయితే భారత ప్రభుత్వం (Indian Government) క్రిప్టోకరెన్సీ లాంచ్ చేయడానికి నిరాకరించింది. క్రిప్టోకరెన్సీ వంటి వర్చువల్ అసెట్స్‌పై భారీగా పన్నులు విధిస్తోంది. ఈ క్రమంలోనే ఇండియా డిజిటల్ రూపాయిని తీసుకొచ్చింది. ఇప్పటికే హోల్‌సేల్ సెగ్మెంట్లో నవంబర్ 1న డిజిటల్ రూపాయి పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. అదే విధంగా రిటైల్ డిజిటల్ రూపాయి(e₹-R) పైలట్ ప్రాజెక్ట్‌ను 2022 డిసెంబర్ 1న ప్రారంభించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank Of India) మంగళవారం తెలిపింది. ఆర్బీఐ దీన్ని డిజిటల్ లీగల్ టెండర్‌గా నిర్వచించింది. డిజిటల్ రూపాయి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
* నాలుగు బ్యాంకులతో మొదలు
ప్రస్తుతానికి ఈ రిటైల్ డిజిటల్ రూపాయి ప్రాజెక్ట్‌లో ఎస్బీఐ, ఐసీఐసీఐ, యొస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ పాల్గొంటున్నాయి. హోల్‌సేల్ తరహాలోనే రిటైల్ డిజిటల్ రూపాయిని ఎంపిక చేసిన ప్రాంతాల్లో, ఎంపిక చేసిన వినియోగదారులకు, వ్యాపారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తారు.
డిజిటల్ రూపాయి ప్రస్తుత కరెన్సీలతో సమానంగా మారవచ్చని, పేమెంట్స్‌కు కూడా సురక్షితంగా మారుతుందని ఫోర్బ్ ఓ నివేదికలో పేర్కొంది. CBDCని ఇ₹-ఆర్ లేదా డిజిటల్ రూపాయి అని కూడా పిలుస్తారు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన కొత్త కరెన్సీ. ఇది డిజిటల్ ట్రాన్సాక్షన్లు సులువుగా నిర్వహించేలా చేస్తుంది. క్రిప్టోకరెన్సీ తీసుకురావడానికి నిరాకరించిన సెంట్రల్ బ్యాంక్.. డిజిటల్ రూపాయిని లాంచ్ చేసింది.
* క్రిప్టోకరెన్సీ
క్రిప్టోకరెన్సీ అనేది డీసెంట్రలైజ్డ్ మనీ. ఇది ఏ ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంక్ నియంత్రణలో ఉండదు. క్రిప్టోకరెన్సీ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. హ్యూమన్ ట్రాన్సాక్షన్లు సెక్యూర్‌గా ఉండటానికి క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తుంది. వాటిని డూప్లికేట్ చేయడం అసాధ్యం. అయితే 2010 ఆగస్ట్‌లో.. ఒక హ్యాకర్ బిట్‌కాయిన్ ప్రోటోకాల్‌లో లోపాన్ని కనుగొన్నాడు. బ్లాక్చెయిన్లోకి లాగిన్ చేయడానికి ముందు మల్టిపుల్ ట్రాన్సాక్షన్లు చేయడం ద్వారా ఇన్ఫైనెట్ బిట్కాయిన్లను జనరేట్ చేశాడు.
* క్రిప్టోకరెన్సీ ఎలా క్రియేట్ అవుతుంది?
అన్ని క్రిప్టోకరెన్సీలు మైనింగ్ అని ప్రాసెస్ ద్వారా క్రియేట్ అవుతాయి. ఇందుకు మైనర్స్ వివిధ సంక్లిష్ట గణిత సమస్యలు, పజిల్‌లను పరిష్కరించడానికి హై-ఎండ్ GPUలతో కూడిన కంప్యూటర్లను ఉపయోగిస్తారు. ప్రజలు కరెన్సీ యజమానులు, ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి క్రిప్టోకరెన్సీలను కొనుగోలు చేయవచ్చు. అలాగే వాటిని ఇతర వ్యక్తులకు విక్రయించవచ్చు.
ఇది కూడా చదవండి : పీఎఫ్ ఖాతాల్లోకి డబ్బుకు వడ్డీ.. కానీ ఈ రకమైన ఖాతాల్లోకి మాత్రం వడ్డీ చెల్లించరు..
క్రిప్టోకరెన్సీలు డిజిటల్ వాలెట్లలో ఉంచుతారు. అవి హాట్ లేదా కూల్‌గా ఉంటాయి. హాట్ వాలెట్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. కోల్డ్ స్టోరేజ్ అసెట్స్‌ను ఆఫ్‌లైన్‌లో ఉంచుతుంది. క్రిప్టోకరెన్సీలను స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించి ట్రాన్సాక్షన్లు చేయవచ్చు. వినియోగదారులు తమ క్రిప్టో హోల్డింగ్లను నగదుగా మార్చుకోవడానికి వారి బ్యాంక్ ఖాతాలు లేదా P2P ట్రాన్సాక్షన్లు వినియోగించుకోవచ్చు.
* క్రిప్టోకరెన్సీ, డిజిటల్ రూపాయి మధ్య తేడా?
CBDC అనేది డిజిటల్ రూపంలో సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన చట్టపరమైన టెండర్. ఇది ప్రస్తుతం ఉన్న ఫిజికల్ మనీకి సమానంగా ఉంటుంది. దీని ద్వారా అన్ని రకాల ట్రాన్సాక్షన్లు నిర్వహించవచ్చు. బ్యాంకులు, ఇతర యూపీఐ ట్రాన్సాక్షన్లను నిర్వహించవచ్చు. దాని రూపం మాత్రమే భిన్నంగా ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. CBDC అనేది RBI వంటి సెంట్రల్ బ్యాంక్‌లు జారీ చేసే పేపర్ కరెన్సీకి డిజిటల్ రూపం. అయితే ఇది క్రిప్టోకరెన్సీల వంటి డీసెంట్రలైజ్డ్ అసెట్ కాదు. డిజిటల్ రూపాయికి చట్టబద్ధత ఉంటుంది.
* క్రిప్టోపై ఇండియా స్పందన
2018లో వర్చువల్ కరెన్సీలు చట్టబద్ధం కావని భారతదేశంలోని ప్రజలను హెచ్చరించినట్లు ఫోర్బ్స్ నివేదిక తెలిపింది. భారతదేశంలో క్రిప్టోకరెన్సీ బిల్లును రూపొందించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 2019లో ఒక బిల్లు క్రిప్టోకరెన్సీ మైనింగ్, హోల్డింగ్, అమ్మకం, జారీ చేయడం, బదిలీ చేయడం, ఉపయోగించడాన్ని నిషేధించింది. చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానా లేదా పదేళ్ల వరకు జైలు శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది.
సుప్రీంకోర్టు 2020 మార్చిలో ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 నవంబర్‌లో రాజ్యసభలో క్రిప్టోకరెన్సీ సమస్యను లేవనెత్తారు. భారతదేశంలో క్రిప్టోకరెన్సీ ప్రకటనలను నిషేధించడానికి ప్రభుత్వం కచ్చితమైన చర్యలు తీసుకోనప్పటికీ, RBI, SEBI ద్వారా అవగాహన కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు. యూనియన్ బడ్జెట్ 2022-23లో భారత ప్రభుత్వం క్రిప్టోకరెన్సీ లను గుర్తించింది. అలాంటి ఏవైనా వర్చువల్ అసెట్స్‌పై 30% పన్ను విధించాలని నిర్ణయించింది. అప్పుడే డిజిటల్ రూపాయి(CBDC)ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government, Cryptocurrency, Digital currency, Digital Rupee