news18-telugu
Updated: November 16, 2020, 11:21 AM IST
ప్రతీకాత్మకచిత్రం
PM-
KISAN scheme: దేశ వ్యాప్తంగా రైతన్నలకు ఆర్థిక సాయం అందించేందకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన ప్రారంభించింది. దీని కింది ఇప్పటికే 11.17 కోట్ల మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు పంపారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం కింది మొత్తం 14.5 కోట్ల సాగుదారులకు ఈ ప్రయోజనం అందాల్సి ఉంది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పథకం కింద రైతుకు డబ్బు రాకపోతే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు నేరుగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయవచ్చు. పీఎం కిసాన్ స్కీమ్(
PM-
KISAN scheme ) కింద ఏడాదికి రూ.6,000 వస్తాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు. మూడు విడతల్లో అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమవుతుంది. అంటే ఒక్కో ఇన్‌స్టాల్‌మెంట్‌కు రూ.2,000 వస్తాయి.
డబ్బులు ఖాతాలో పడకుంటే ఏం చేయాలి అంటే...మొదట మీ ప్రాంతానికి చెందిన వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. మీ ఖాతాకు సంబంధించిన సమాచారం ఇవ్వాలి. ఒక వేళ మీ సమస్య పరిష్కార కాకపోతే, మీరు దీనికి సంబంధించిన హెల్ప్‌లైన్‌కు కూడా కాల్ చేయవచ్చు. సోమవారం నుండి శుక్రవారం వరకు, PM-KISAN హెల్ప్ డెస్క్ సంబధించిన ఫోన్ నంబర్ 011-23381092 (డైరెక్ట్ హెల్ప్‌లైన్) కు కాల్ చేసి వివరాలకు తెలపవచ్చు. లేకపోతే
pmkisan-ict@gov.inలో ద్వారా ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయవచ్చు.
ఒకవేళ ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే, అది ఏ సందర్భంలోనైనా సరిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంటోంది. 'ప్రతి రైతుకు దీని ప్రయోజనాలు లభించడం తమ ప్రయత్నం. ఇందుకోసం మాన్యువల్‌గా దరఖాస్తు చేసుకునే సౌకర్యం కూడా కల్పించినట్లు' మంత్రిత్వ శాఖ తెలిపింది.
రైతుల నుంచి వస్తున్న ప్రధాన ఫిర్యాదులు ఇవే..
>> గత కొన్ని నెలలుగా, కిసాన్ సమ్మన్ నిధి పథకం గురించి ఫిర్యాదులు వస్తున్నాయి. రిజిస్టర్డ్ రైతులు డబ్బు రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి.
>> కొన్ని గ్రామాల్లో కొంతమంది రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు ఐదు నుంచి ఆరు సార్లు పొరపాటున జమఅవ్వగా, మరి కొంతమంది రైతుల ఖాతాల్లో మాత్రం మొదటి విడత డబ్బులు కూడా పడలేదు.>> కొంతమంది రైతుల ఖాతాల్లో మాత్రం మొదటి విడత డబ్బులు పడితే, రెండవ విడత ఇంకా పడలేదు. ఇలాంటి సమస్యలు తలెత్తాయి.
ఇదిలా ఉంటే మొదట లబ్ధిదారులు అసలు జాబితాలో తమ పేరు ఉందా లేదా అని వ్యవసాయ అధికారిని అడగాలి. ఒక వేళ నమోదు కాకపోయి ఉంటే, వెంటనే నమోదు చేయించుకోండి. నమోదు అయినా కూడా డబ్బు పడకపోతే అప్పుడు పథకం యొక్క హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి. దేశంలోని మొత్తం 14.5 కోట్ల మంది రైతులకు డబ్బు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి ఏ అధికారి అయినా అవరోధంగా మారుతుంటే, అతనిపై కూడా ఫిర్యాదు చేసే వీలుంది. మీరు ఈ పథకం దుర్వినియోగం అవుతుందని భావించి ఫిర్యాదు చేయాలనుకుంటే కేంద్ర రైతు సంక్షేమ విభాగాన్ని సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్ 011-23382401, ఇమెయిల్ ఐడి (
pmkisan-hqrs@gov.in).
అంతేకాదు దేశంలోని ఏ ప్రాంతంలోని రైతు అయినా నేరుగా వ్యవసాయ మంత్రిత్వ శాఖను సంప్రదించవచ్చు.
పిఎం కిసాన్ టోల్ ఫ్రీ నంబర్: 18001155266
పిఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబర్: 155261
పిఎం కిసాన్ ల్యాండ్‌లైన్ నంబర్లు: 011—23381092, 23382401
PM కిసాన్ యొక్క కొత్త హెల్ప్‌లైన్: 011-24300606
పిఎం కిసాన్‌కు మరో హెల్ప్‌లైన్ ఉంది: 0120-6025109
ఇమెయిల్ ID: pmkisan-ict@gov.in
Published by:
Krishna Adithya
First published:
November 16, 2020, 11:21 AM IST