Home /News /business /

HEAVY DISCOUNTS ON ALL CARS YEAR END OFFER 2020 MK GH

New Year Car Sale: కొత్త సంవత్సరం కొత్త కారు కొంటున్నారా...అయితే బంపర్ ఆఫర్లు ఇవే..రూ.50 వేల డిస్కౌంట్...

Maruti Suzuki: 
(Image source: Maruti Suzuki India) ప్రతీకాత్మక చిత్రం

Maruti Suzuki: (Image source: Maruti Suzuki India) ప్రతీకాత్మక చిత్రం

దాదాపు అన్ని కార్ల తయారీ సంస్థలు(Carmakers) ఈ నెలాఖరు వరకు ఇయర్ ఎండ్ సేల్(year- end sale) ను నిర్వహిస్తున్నాయి. సేల్లో భాగంగా తమ ఉత్పత్తులపై క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

కరోనా(Carona)తో మందగించిన అమ్మకాలను పునరుద్దరించడానికి, తమ డీలర్షిప్ల వద్ద ఉన్న స్టాక్ క్లియర్ చేసుకోవడానికి దాదాపు అన్ని కార్ల తయారీ సంస్థలు(Carmakers) ఈ నెలాఖరు వరకు ఇయర్ ఎండ్ సేల్(year- end sale) ను నిర్వహిస్తున్నాయి. సేల్లో భాగంగా తమ ఉత్పత్తులపై క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులపై అందిస్తున్న భారీ ఆఫర్లపై ఓ లుక్కేయండి.

Maruti Suzuki

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా పేరొందిన మారుతి (Maruti) ఇయర్ ఎండ్ సేల్లో భాగంగా ఎస్-ప్రెస్సో(S-–Presso) వాహనంపై సుమారు రూ .50,000 డిస్కౌంట్ను అందిస్తుంది. భారతీయుల అత్యంత ప్రియమైన మారుతి స్విఫ్ట్(Maruti Swift), వాగన్ ఆర్(Wagon R) కార్ల కొనుగోలుపై వరుసగా రూ.45,000, రూ .30,000 విలువైన బెనిఫిట్స్ను అందిస్తుంది.

Hyundai

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్(Hyundai) డిసెంబర్ డిలైట్స్ ఆఫర్‌ను ప్రకటించింది. హ్యుందాయ్ ఎలంట్రా(Elantra) మోడల్పై రూ .70,000 విలువైన క్యాష్ బెనిఫిట్స్ను అందిస్తోంది. గ్రాండ్ ఐ 10 నియోస్(Grand i10 Nios )పై రూ .60,000 వరకు బెనిఫిట్స్, గ్రాండ్ ఐ 10(Grand i10 )పై రూ .50 వేల విలువైన బెనిఫిట్స్ను అందిస్తోంది.

TATA Motors

భారతీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) ఇయర్ ఎండ్ సేల్లో భాగంగా తమ ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటించింది. సేల్లో భాగంగా టియాగో(Tiago), నెక్సాన్ ఎస్‌యూవీ(Nexon SUV) వేరియంట్లపై సుమారు రూ .25 వేల డిస్కౌంట్, రూ .15 వేల బెనిఫిట్స్ ను అందిస్తుంది. టాటా హారియర్ కామో, డార్క్ ఎడిషన్, XZ+, XZA+ మోడళ్లపై రూ .40,000 విలువైన డిస్కౌంట్లను అందిస్తుంది. హారియర్‌ ఎడిషన్ పై సుమారు రూ .40,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ పొందవచ్చు.

Honda Cars

ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా(Honda) కంపెనీ తన సివిక్ సెడాన్‌(Civic sedan) మోడల్పై భారీ డిస్కౌంట్ అందిస్తుంది. సివిక్ డీజిల్ మోడల్పై రూ. 2,50,000, పెట్రోల్ మోడల్‌పై రూ .1 లక్ష వరకు క్యాష్ డిస్కౌంట్ ను ప్రకటించింది. దీనితో పాటు హోండా జాజ్‌(Honda Jazz )పై రూ .40,000, WR-–V ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌పై రూ .25 వేల బెనిఫిట్స్ అందిస్తుంది. హోండా అమేజ్‌పై మొత్తం రూ .37,000 విలువైన బెనిఫిట్స్ ను ప్రకటించింది. దీనిలో భాగంగా రూ .15 వేల డిస్కౌంట్, రూ .27 వేల బెనిఫిట్స్ ను అందిస్తుంది. 5వ తరం హోండా సిత్(Cith 5th generation )పై రూ .30,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ ను కూడా ప్రకటించింది.

మహీంద్రా & మహీంద్రా

భారతీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా Alturas G4 మోడల్ పై రూ. 3,06,000 భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది. దీనితో పాటు XUV500పై రూ .51,000 డిస్కౌంట్, స్కార్పియోపై రూ .30 వేల బెనిఫిట్స్ ను అందిస్తోంది.
Published by:Krishna Adithya
First published:

Tags: CAR, Cars

తదుపరి వార్తలు