జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాల ప్రకారం ఈరోజు నుంచి కొత్త ట్యాక్స్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ICU మినహాయించి, ఆసుపత్రిలో ఒక రోగికి రోజుకు రూమ్ రెంట్ రూ.5,000 దాటితే 5 శాతం జీఎస్టీ(GST) వసూలు చేయనున్నారు. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆప్షన్ లేకుండా పన్ను ఉంటుంది. కొత్త నిబంధన జులై 18 సోమవారం నుంచి అమలులోకి వస్తుంది. గత నెల చివరిలో సమావేశమైన 47వ జీఎస్‌టీ కౌన్సిల్, లార్జర్ ట్యాక్స్ రేట్ రేషనలైజేషన్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఆసుపత్రి గది అద్దెపై జీఎస్‌టీ రోగులకు ఆరోగ్య సంరక్షణ ఖర్చును పెంచుతుంది. అలాగే పరిశ్రమకు కాంప్లియన్స్, సంబంధిత సవాళ్లను పరిచయం చేస్తుంది. రోజుకు రూ.6,000 గది అద్దెపై, రోగి రూ.300 జీఎస్టీ చెల్లించాలి. రోగి 3 రోజులు ఆసుపత్రిలో ఉంటే, జీఎస్టీ 900 అవుతుంది. అంటే రోగి ఇప్పుడు ఆసుపత్రిలో మూడు రోజుల పాటు ఉండేందుకు రూ.18,900 చెల్లించాలి. అంతకుముందు చెల్లించే మొత్తం రూ.18,000 ఉండేది.
PSL అడ్వకేట్స్ & సొలిసిటర్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ సమీర్ జైన్ మాట్లాడుతూ..‘రోజుకు రూ.5,000 కంటే ఎక్కువ ఉన్న హాస్పిటల్ గదులపై 5 శాతం జీఎస్‌టీ వినియోగదారులకు ఆరోగ్య సంరక్షణ ఖర్చును పెంచడానికి సిద్ధంగా ఉంది. ఇంకా జీఎస్‌టీలో ఇన్‌పుట్ క్రెడిట్ అందుబాటులో లేకుంటే, పన్ను క్రెడిట్‌గా పొందలేము. ఆసుపత్రులు విధించిన జీఎస్‌టీకి పెరిగిన కాంప్లియన్స్ అమలు చేయాలి. చాలా మంది రోగులు ఎక్కువ కాలం అడ్మిట్ అవుతున్నారని పరిగణనలోకి తీసుకుంటే, పన్ను ప్రభావం వినియోగదారులపై భారం పడుతుంది.’ అని చెప్పారు.
జూన్ చివరలో జరిగిన GST కౌన్సిల్ 47వ సమావేశంలో కొత్త లెవీని సిఫార్సు చేశారు. ఈ సిఫార్సులు జులై 18 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆసుపత్రి గదులపై 5 శాతం జీఎస్‌టీతో పాటు, ప్రీ-ప్యాకేజ్డ్ ఫుడ్స్ సహా అనేక వస్తువులపై పన్నును కూడా కౌన్సిల్ సూచించింది. వాటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనేక రోజువారీ నిత్యావసర వస్తువులపై రేట్లను పెంచాలని కౌన్సిల్ నిర్ణయించింది. 25 కిలోల బరువున్న తృణధాన్యాలు, పప్పులు, పిండి వంటి ఆహార పదార్థాల సింగిల్ ప్యాకేజీలను ‘ప్రీప్యాకేజ్డ్ అండ్ లేబుల్’గా పరిగణిస్తామని, జులై 18 నుంచి 5 శాతం జీఎస్‌టీకి లోబడి ఉంటుందని పన్ను శాఖ తెలిపింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(CBIC) సోమవారం ఒక ప్రకటనలో.. ‘2022 జులై 18 నుంచి ఈ నిబంధన మార్పునకు లోనవుతుంది. తదుపరి ప్రశ్నలలో వివరించిన విధంగా లీగల్ మెట్రాలజీ చట్టంలోని నిబంధనలను ఆకర్షించే ‘ప్రీ ప్యాకేజ్డ్ అండ్ లేబుల్’ వస్తువుల సరఫరాపై జీఎస్టీ వర్తిస్తుంది. ఉదాహరణకు పప్పు దినుసులు, బియ్యం, గోధుమలు, పిండి (ఆటా) వంటి తృణధాన్యాలు బ్రాండెడ్, యూనిట్ కంటైనర్‌లో ప్యాక్ చేసినప్పుడు 5 శాతం చొప్పున జీఎస్‌టీ చెల్లించాలి. పెరుగు, లస్సీ, పఫ్డ్ రైస్ మొదలైన కొన్ని ఇతర ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై కూడా 5 శాతం చొప్పున జీఎస్‌టీ అమలవుతుంది.’ అని పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, GST, GST Council, Taxes