హోమ్ /వార్తలు /బిజినెస్ /

Health Insurance: తీవ్ర అనారోగ్య సమస్యల కోసం పాలసీ కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ విషయాలు మీ కోసమే..

Health Insurance: తీవ్ర అనారోగ్య సమస్యల కోసం పాలసీ కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ విషయాలు మీ కోసమే..

 (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Health Insurance: డబ్బు సంపాదించేవారు నిర్దిష్ట వ్యాధికి చికిత్స చేయించుకోవడానికి పొదుపులో ఎక్కువ భాగాన్ని పోగొట్టుకోవడం సరైన నిర్ణయం కాదు. అందుకే సరైన క్రిటికల్ ఇన్సూరెన్స్‌ పాలసీపై అవగాహన పెంచుకుంటే మంచిది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

సరైన ఆర్థిక ప్రణాళికలు పాటించని వారు భవిష్యత్తు (Future)లో అనుకోని అత్యవసరాలు ఎదురైనప్పుడు తీవ్రంగా నష్టపోతారు. అప్పటి వరకు పొదుపు చేసిన డబ్బును మొత్తం వినియోగించాల్సి వస్తుంది. అక్కడితో అవసరాలు తీరకపోగా అప్పులు చేయాల్సి వస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ పక్కకుపోతాయి. దీంతో వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. భారతదేశంలో పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ద్రవ్యోల్బణం కూడా ఆందోళనను పెంచుతోంది. కాబట్టి జీవితంలోని ఏ దశలోనైనా, ఒక నిర్దిష్ట వ్యాధికి చికిత్స చేయించుకోవడానికి పొదుపులో ఎక్కువ భాగాన్ని పోగొట్టుకోవడం సరైన నిర్ణయం కాదు. అందుకే సరైన క్రిటికల్ ఇన్సూరెన్స్‌ పాలసీ(critical Illness Policy)ని కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.* ఫైనాన్షియల్‌ బ్యాకప్‌
మెరుగైన ప్రయోజనాలు పొందేందుకు కాంప్రహెన్సివ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీతోపాటు క్రిటికల్ ఇల్నెస్‌(CI) ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ కూడా ముఖ్యం. ఇది సాధారణ మెడిక్లెయిమ్ పాలసీ లేదా ఇన్సూరెన్స్‌ ప్రొడక్ట్‌కు అదనపు కవర్‌ని జోడిస్తుంది. ఈ ప్లాన్‌లు పాలసీదారుడికి లంప్‌ సమ్‌ అమౌంట్‌ను అందించడమే కాకుండా, అవసరమైన ఫైనాన్షియల్‌ బ్యాకప్‌ను అందిస్తాయి.
* ఏ వ్యాధులు కవర్‌ అవుతాయి?
క్రిటికల్‌ ఇల్నెస్‌ కింద కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలు కవర్‌ పొందుతాయి. వీటిలో కొన్ని స్టేజ్‌ల వరకు క్యాన్సర్, గుండెపోటు(మొదటిసారి), ఓపెన్-హార్ట్ కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్, కోమా ఆఫ్‌ స్పెసిఫైడ్‌ సివియారిటీ, సాధారణ డయాలసిస్ అవసరమయ్యే కిడ్నీ ఫెయిల్యూర్‌ వంటివి ఉన్నాయి.


* ప్లాన్‌ ఎలా పని చేస్తుంది?
క్రిటికల్ ఇల్నెస్‌ ప్లాన్‌ సాధారణ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌కు భిన్నంగా ఉంటుంది. దీని ద్వారా కస్టమర్‌కు మెరుగైన ఫైనాన్షియల్‌ బ్యాకప్‌ లభిస్తుందని CNBC-TV18.comతో చెప్పారు బజాజ్ క్యాపిటల్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ లిమిటెడ్ సీఈవో వెంకటేష్ నాయుడు.
ఇది కూడా చదవండి : ఇన్సూరెన్స్ ఏజెంట్లకు గుడ్ న్యూస్.. ఆ ప్రపోజల్‌పై వెనక్కి తగ్గిన IRDAI..
* ప్లాన్‌ నిబంధనలు, షరతులు
క్రిటికల్ ఇల్నెస్‌ ప్లాన్‌కు సంబంధించి వెయిటింగ్ పీరియడ్ సాధారణంగా పాలసీ జారీ చేసిన తేదీ నుంచి 90 రోజులు ఉంటుంది. పాలసీ జారీ చేసిన 90 రోజులలోపు చేసిన క్లెయిమ్‌లను సంబంధిత ఇన్సూరెన్స్‌ కంపెనీ అంగీకరించదని వెంకటేష్‌ నాయుడు చెప్పారు. క్లెయిమ్ ఫైల్ చేయడానికి పాలసీదారుడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని నిర్ధారించిన తర్వాత కనీసం 30 రోజులు వరకు జీవించి ఉంటే చాలా మంది ఇన్సూరెన్స్‌ కంపెనీలు క్లెయిమ్‌లను సెటిల్‌ చేస్తాయని వివరించారు.
* ప్లాన్‌ ఎందుకు ముఖ్యం?
క్రిటికల్ ఇల్నెస్‌ బారిన పడినప్పుడు వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుందని వెంకటేష్‌ నాయుడు పేర్కొన్నారు. ఆర్థిక భారాలను తగ్గించుకోవడానికి కస్టమర్లు క్రిటికల్‌ ఇల్నెస్‌(CI) ప్లాన్‌ను కొనుగోలు చేయడం మేలని సూచించారు. దీని ద్వారా అత్యవసర సమయాల్లో ఫైనాన్షియల్‌ సపోర్ట్‌ లభిస్తుందని చెప్పారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Health Insurance, Personal Finance

ఉత్తమ కథలు