Health insurance రెన్యువల్​ ఫీజు పెరిగిందా?.. అయితే మీ పాలసీని వేరే సంస్థకు ఇలా బదిలీ​ చేసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రస్తుతం మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్​పై అసంతృప్తిగా ఉంటే.. తక్కువ ప్రీమియం రేటుకు అవే ప్రయోజనాలు అందించే ఇతర బీమా సంస్థకు ప?

  • Share this:
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్​ వేవ్​ విజృంభిస్తుండటంతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే క్లెయిమ్​ల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. దీంతో అనేక బీమా సంస్థలు హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం రేట్లను పెంచేస్తున్నాయి. సాధారణంగా, ఇదివరకే తీసుకున్న బీమా ప్రీమియం రేట్లు పెంచడానికి, ప్రయోజనాలు తగ్గించడానికి అనుమతి లేదు. కానీ, చాప్టర్ – IIIలోని క్లాజ్(జి) ప్రకారం బీమా ప్రీమియం రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని గత కొన్ని నెలలుగా అనేక బీమా సంస్థలు తమ ప్రీమియం రెన్యూల్​ రేట్లను 30 నుంచి 100 శాతం మేర పెంచేశాయి. ప్రస్తుతం క్లెయిమ్​ల సంఖ్య పెరుగుతున్నందున.. నష్టాల నుంచి గట్టెక్కాలంటే ప్రీమియం రేట్లు పెంచక తప్పడం లేదని బీమా సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.

ఇలా ప్రీమియం రెన్యువల్​ రేట్లు పెంచడం ద్వారా పాలసీదారుడిపై అదనపు భారం పడుతోంది. దీని నుంచి ఉపశమనం పొందేందుకు పాలసీని పోర్టబుల్​ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి బీమా సంస్థలు. ప్రస్తుతం మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్​పై అసంతృప్తిగా ఉంటే.. తక్కువ ప్రీమియం రేటుకు అవే ప్రయోజనాలు అందించే ఇతర బీమా సంస్థకు పాలసీని మార్చుకోవచ్చు. మీరు ఒక వ్యక్తిగత బీమా పాలసీ నుంచి కుటుంబ పాలసీకి మారడానికి అవకాశం ఉంటుంది. కానీ, సాధారణ పాలసీ నుంచి క్రిటికల్​ ఇల్​నెస్​ పాలసీకి మారలేరు.

మీ పాలసీని ఎలా పోర్ట్ చేయాలి?
1. మీ ప్రస్తుత పాలసీ రెన్యువల్​కు కనీసం 45 రోజుల ముందు పోర్టింగ్ ప్రక్రియను ప్రారంభించండి. క్రొత్త పాలసీకి పోర్ట్ చేసుకునే ముందు నియమ నిబంధనలు, ప్రీమియం రేట్లను బాగా పరిశీలించండి.

2. మీరు బదిలీ చేయాలనుకుంటున్న కొత్త బీమా సంస్థకు చెందిన పోర్టబిలిటీ ఫారమ్ నింపండి. దీనికి మీ వ్యక్తిగత సమాచారం, ఇప్పటికే ఉన్న వ్యాధులు, మెడికల్​ హిస్టరీ ఫారమ్​లో పేర్కొనండి.

3. బీమా పోర్ట్​కు అభ్యర్థించే సమయంలో ప్రపోజల్ ఫారమ్​, పోర్టబిలిటీ ఫారమ్​, ఐడెంటిటీ, రెసిడెన్సీ ప్రూఫ్​, మెడికల్​ హిస్టరీ, గత క్లెయిమ్​లు, కొత్తగా నిర్ధారణ అయిన వ్యాధి ఏవైనా ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, పాలసీ సర్టిఫికేట్లు, రెన్యువల్​ స్లిప్స్, సెల్ఫ్​ డిక్లరేషన్​, ఇన్వెస్టిగేషన్​ రిపోర్ట్, డిస్​ఛార్జ్​ సమ్మరీ వంటి డాక్యుమెంట్స్​ సమర్పించాలి.

4. పోర్ట్​కు సంబంధించిన ప్రక్రియ, నియమ నిబంధనల కోసం ఐఆర్​డీఏఐ అధికారిక పోర్టల్‌ను సందర్శించవచ్చు. ప్రస్తుత బీమా సంస్థ మీ మెడికల్, క్లెయిమ్‌ల హిస్టరీకి సంబంధించిన సమాచారాన్ని కొత్త బీమా సంస్థకు అందిస్తుంది.

5. అన్ని వివరాలను స్వీకరించిన తరువాత, కొత్త బీమా సంస్థ మీ ప్రతిపాదనను పరిశీలించి, 15 రోజుల్లోపు అంగీకరణ లేదా తిరస్కారణ విషయాన్ని పాలసీదారునికి తెలియజేయాలి. అలా చేయకపోతే, ఆటోమేటిక్​గా మీ పాలసీ అంగీకరించినట్లుగా పరిగణించబడుతుంది.

6. మీరు పోర్ట్​ చేసుకున్న క్రమంలో మీ నుంచి కొత్త బీమా సంస్థ అదనపు పోర్టబిలిటీ ఛార్జీలను వసూలు చేయదు. కేవలం ప్రీమియం మాత్రమే తీసుకుంటుంది. మీరు 45 ఏళ్లు పైబడి ఉంటే లేదా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైతే ప్రీ మెడికల్ చెకప్​ చేయించుకోవాల్సి ఉంటుంది.
Published by:Sumanth Kanukula
First published: