HEALTH INSURANCE PORTING VS BUYING NEW PLAN 2022 WHAT IS BETTER GH VB
Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టింగ్ వర్సెస్ కొత్త హెల్త్ పాలసీ కొనుగోలు.. రెండిట్లో ఏది బెస్ట్ ఆప్షన్..?
ప్రతీకాత్మక చిత్రం
హెల్త్ ఇన్సూరెన్స్‌ను సైతం ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి పోర్ట్ (Health Policy Proting) చేయడం సాధ్యమవుతుందని మనలో చాలామందికి తెలియదు. అయితే ఇలా చేయడం మంచిదేనా? చేస్తే క్లెయిమ్ సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు చూద్దాం..
ఆరోగ్య బీమా పాలసీ ఉన్నవారు.. ప్లాన్ ముగిసిన అనంతంర కొత్త ప్లాన్‌ను తీసుకుంటారు. కానీ మొబైల్ నంబర్ పోర్టింగ్ లాగానే, హెల్త్ ఇన్సూరెన్స్‌ను (Health Insurance) సైతం ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి పోర్ట్ (Health Policy Proting) చేయడం సాధ్యమవుతుందని మనలో చాలామందికి తెలియదు. అయితే ఇలా చేయడం మంచిదేనా? చేస్తే క్లెయిమ్ సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. దేశవ్యాప్తంగా కొవిడ్(Covid) మహమ్మారి విజృంభణ మొదలైనప్పటి నుంచి ఆరోగ్య బీమా(Health) పాలసీల(Policy)పై అవగాహన పెరిగింది. ఇక కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గతేడాది చేసుకున్న పాలసీని(health insurance plans) ఉపయోగించుకోని వారు.. పోర్టింగ్ చేసుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. అయితే.. ప్రస్తుత బీమా కంపెనీ అవసరమైన సమయంలో కవరేజీ అందించకుండా పాలసీదారులను ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు ఉన్నాయి.
దీనితో మెరుగైన సేవలందించే బీమా కంపెనీల వైపు పాలసీదారులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పాలసీ తీసుకోవాలా? లేదంటే.. పాత ప్లాన్‌నే పోర్ట్ చేసుకోవచ్చా? అలా చేసుకుంటే మంచిదేనా? అంటే.. ఆరోగ్య బీమా ప్లాన్‌ను పోర్ట్ చేసేందుకే ప్రయత్నించాలని సూచిస్తున్నారు నిపుణులు. అయితే ఇప్పటికే ఉన్న పాలసీని పోర్ట్ చేయడమనేది కొత్త బీమా కంపెనీ అంగీకారం సహా ఇతర షరతులపై ఆధారపడి ఉంటుంది.
కారణాలు చెప్పాల్సిందే...
ఒక కంపెనీ నుంచి మరో కంపెనీ అందించే బీమా పాలసీకి మారినప్పుడు మెరుగైన సేవలు(health insurance benefits), అధిక కవరేజీ వర్తిస్తాయి. అయితే మీరు ఎందుకు పాలసీ పోర్టింగ్చేయాలనుకుంటున్నారు అనే విషయాన్ని తెలియజేయడం ముఖ్యం. ఉదాహరణకు.. ప్రస్తుత బీమా సంస్థ సేవలతో సంతృప్తి చెందనప్పుడు, పారదర్శకత లోపించినప్పుడు, ప్రయోజనాలు అవసరాలకు సరిపోవడం లేదని భావించిన సందర్భాల్లో పాలసీ పోర్టింగ్‌కు అనుమతి ఉంటుంది. ఆరోగ్య బీమా పాలసీని పోర్ట్ చేయడం మంచిదే. అయితే పోర్టింగ్‌కు వెళ్లే ముందు సరైన అవగాహన ఏర్పరచుకోవడం ముఖ్యం. పోర్టింగ్ చేస్తున్నారంటే.. మునుపటి పాలసీలో పేర్కొనని వ్యాధుల వెయిటింగ్ పీరియడ్ పరంగా కొనసాగింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.
బీమా పోర్టింగ్.. పరిగణించవలసిన కారణాలు..
ఆరోగ్య బీమా పోర్టింగ్ చేయడానికి ముందు పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఉన్న వ్యాధుల వివరాలు, కొత్త బీమా సంస్థకు పోర్ట్ చేయడం సాధ్యాసాధ్యాలు, ప్రీ-మెడికల్ స్క్రీనింగ్ అవసరం.. వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
పోర్టింగ్-వయస్సు..
చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు వృద్ధులకు కవరేజీని మంజూరు చేసేందుకు వెనుకాడుతున్నాయి. వారి ఆరోగ్య పరిస్థితులు, నష్టాలను దృష్టిలో ఉంచుకుని.. అదనపు ప్లాన్‌ను కొనుగోలు చేయాలని సూచిస్తుంటాయి. అందువల్ల చిన్న వయస్సులోనే పాలసీని పోర్ట్ చేయడం లేదా కొనుగోలు చేయడం మంచిది.
బీమా మొత్తంలో మార్పులు..
పోర్టింగ్ చేసుకుని ఎంచుకున్న కొత్త బీమా సంస్థ ప్రస్తుత పాలసీలో ఉన్న కచ్చితమైన బీమా మొత్తాన్ని అందించకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో అధిక మొత్తంలో బీమాను ఎంచుకోవాల్సి ఉంటుంది. కొత్త బీమా కంపెనీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎక్కువ మొత్తం బీమా చేయవలసి రావచ్చు.
చివరిగా ఏ బీమా సంస్థ మీ పాలసీని పోర్ట్ చేయడానికి సిద్ధంగా లేదంటే .. మీ కవరేజీకి అనుబంధంగా మరో కొత్త పాలసీని తీసుకోవడమే మేలు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.