HEALTH INSURANCE PHONEPE STARTS RS 999 HEALTH INSURANCE AIMED AT YOUNG FIRST TIME BUYERS GH SK
PhonePe: రూ.999కే హెల్త్ ప్లాన్.. ఫోన్‌పే నుంచి కొత్త ఇన్సూరెన్స్ పాలసీ.. పూర్తి వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
Phonepe Health Insurance: డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఫోన్ పే(PhonePe) కొత్త ఆరోగ్య బీమా పాలసీని తీసుకొచ్చింది. మొదటి సారి హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేవారికి తక్కువ ధరలోనే పాలసీని అందించనున్నట్లు తెలిపింది. వారికోసం ప్రత్యేకంగా రూ.999కే ఆరోగ్య బీమా పాలసీని గురువారం ప్రారంభించింది.
డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఫోన్ పే(PhonePe) కొత్త ఆరోగ్య బీమా పాలసీ ( Health Insurance Policy) ని తీసుకొచ్చింది. మొదటి సారి హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేవారికి తక్కువ ధరలోనే పాలసీని అందించనున్నట్లు తెలిపింది. వారికోసం ప్రత్యేకంగా రూ.999కే ఆరోగ్య బీమా పాలసీని గురువారం ప్రారంభించింది. ఈ ప్లాన్‌లో వివిధ రకాల ఆఫర్లు ఉన్నట్లు ఫోన్‌పే పేర్కొంది. ఇన్ పేషెంట్, ఐసీయూ హాస్పిటలైజేషన్ (ICU hospitalization) , డేకేర్ పాలసీ (Day care policy), అంబులెన్స్ ఛార్జీలు (Ambulance charges), ఆయూష్ చికిత్స (Ayush Treatment)తో పాటు ఆసుపత్రి ఖర్చులకు ఈ ప్లాన్ కవరేజీ అందిస్తుంది. దేశంలోని 7600 నెట్‌వర్స్ ఆసుపత్రుల్లో ఈ బీమా పాలసీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారి (Corona pandemic) కారణంగా భారతీయులు ఆరోగ్య బీమా పాలసీ కొనుగోళ్లపై ఎక్కువగా దృష్టి పెట్టారు. దీంతో ఆన్ లైన్ లో హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే వారి సంఖ్యం గణనీయంగా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఫోన్ పే యువ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుత పాలసీ కొనుగోలును సులభతరం చేయడానికి మూడు దశల ప్రక్రియను తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది.
ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి వినియోగదారులు పేరు, వయస్సు, లింగం, ఈమెయిల్ ఐడీ, వంటి వివరాలను మాత్రమే అందిస్తే సరిపోతుంది. ఫోన్ పే యాప్ లో సులభంగా ఈ ఆఫర్ కొనుగోలు చేయవచ్చని ఫోన్ పే ఇన్సూరెన్స్ వైస్ ప్రెసిడెంట్ గుంజన్ ఘాయ్ అన్నారు. 335 మిలియన్ల ఫోన్ పే వినియోగదారులు ఈ ప్లాన్ తో గొప్ప ప్రయోజనం పొందుతారని తెలిపారు. విద్య, ఆదాయాలతో సంబంధం లేకుండా అధిక నాణ్యత, సరసమైన ఆరోగ్య బీమాను అందించాలనే ఉద్దేశంతో ఈ పాలసీని తీసుకొచ్చామని స్పష్టం చేశారు.
పేమెంట్ సేవల విభాగంలో ఫోన్ పే 47 శాతం వాటాతో అతిపెద్ద యూపీఐ సంస్థగా అవతరించింది. అనంతరం కంపెనీ తన ఆర్థిక సేవల ఆఫర్ల పరిధిని విస్తరించడం ప్రారంభించింది. 2020లో ఇన్సూరెన్స్ కార్పొరేట్ ఏజెంట్ లైసెన్స్‌తో బీమా రంగంలోకి ప్రవేశించింది. హెల్త్, లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ కెటగిరీల్లో మూడు బీమా కంపెనీలతో ఫోన్‌పే ఒప్పందం చేసుకుంది. అంతేకాకుండా ఈ సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ కూడా పొందింది. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రయాణ బీమా, జీవిత బీమా, కోవిడ్-19 కోసం ప్రత్యేక బీమా, ప్రమాద బీమా లాంటి వివిధ రకాల ప్రొడక్టులను ఫోన్‌పే అందిస్తోంది.
ఇన్సూరెన్స్ విభాగంతో పాటు మ్యూచువల్ ఫండ్ సెక్టార్ లోకి కూడా ఫోన్ పే అడుగుపెట్టింది. ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ లాంటి వర్గాల్లో పెట్టుబడులను అందిస్తోంది. కంపెనీకి ప్రధాన ప్రత్యర్థి అయిన పేటీఎం వాలెట్ మాదిరిగానే చెల్లింపులు, లావాదేవీలతో పాటు ఇతర సేవలను కూడా ఫోన్‌పే సమర్థవంతంగా అందిస్తోంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.