Home /News /business /

HEALTH INSURANCE DEMAND IN INDIA JUMPS TWO FOLD DURING OMICRON WAVE DIGIT INSURANCE STUDY GH VB

Health Insurance: ఒమిక్రాన్ తర్వాత రెండు రెట్లు పెరిగిన హెల్త్ ఇన్సూరెన్స్ డిమాండ్.. సర్వేలో ఆసక్తికర విషయాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వైరస్ బారిన పడి చాలా కుటుంబాలు ఆర్థికంగా కుదేలైన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ సమయంలో ఎక్కువ మంది ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద నగరాలతో పాటు చిన్న నగరాల్లోనూ ఈ మార్పులు కనిపిస్తున్నాయి.

భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ కారణంగా దేశంలో థర్డ్ వేవ్(Third Wave) ప్రభావం కొనసాగుతోంది. డిసెంబర్ నుంచి కేసుల పెరుగుదల కొనసాగుతోంది. అయితే కరోనా కేసులు పెరిగిన స్థాయిలోనే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకొనే వారి సంఖ్య కూడా పెరిగింది. వైరస్ బారిన పడి చాలా కుటుంబాలు ఆర్థికంగా కుదేలైన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ సమయంలో ఎక్కువ మంది ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద నగరాలతో పాటు చిన్న నగరాల్లోనూ ఈ మార్పులు కనిపిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు కూడా ఈ బాట పట్టాయి. ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ డిజిట్ ఇన్సూరెన్స్ చేసిన సర్వే ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. ఒమిక్రాన్ వెలుగుచూసిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు డిమాండ్ రెండింతలు అయినట్లు సర్వే రిపోర్ట్ పేర్కొంది.

ఈ సర్వే కోసం ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి సేకరించిన వినియోగదారుల వివరాలను డిజిట్ ఇన్సూరెన్స్ పరిశీలించింది. 2020తో పోలిస్తే 2021 నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 మధ్య రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ డిమాండ్ 98 శాతం పెరిగింది. బెంగళూరు, న్యూ దిల్లీ వంటి పెద్ద నగరాల్లోనే ఎక్కువ మంది పాలసీలు తీసుకున్నారు. ఇలాంటి నగరాల భాగస్వామ్యంతోనే వ్యక్తిగత ఇన్సూరెన్సు పాలసీలలో 104 శాతం పెరుగుదల కనిపించింది. సర్వేలో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కలకత్తా, ముంబై, న్యూ దిల్లీ, పుణెకు చెందిన వినియోగదారుల వివరాలను పరిశీలించారు.

RRB Group D Exam: రైల్వే జాబ్ మీ క‌ల‌నా.. సెల‌బ‌స్ అండ్ 30 డేస్ ప్రిప‌రేష‌న్ ప్లాన్!

చిన్న నగరాల్లోనూ ఇదే ధోరణి
ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ హెల్త్ ఇన్సూరెన్స్‌పై అవగాహన పెరిగినట్లు సర్వే వెల్లడించింది. దేశంలో చిన్న నగరాలైన నాసిక్, రాజ్ కోట్, వడోదరలో సైతం రిటైల్ హెల్త్ పాలసీలలో 95 శాతం పెరుగుదల నమోదైంది. గురుగ్రామ్, థానే, వడోధరలో ఎక్కువ డిమాండ్ కనిపించింది. అమృత్ సర్, అలహాబాద్, వడోధర, కోయంబత్తూర్, వేలూరు, వారణాసి వంటి ఇతర నగరాల సమాచారాన్ని కూడా పరిశీలించినట్లు డిజిట్ ఇన్సూరెన్స్ పేర్కొంది.

కార్పొరేట్ సంస్థలు సైతం తమ ఉద్యోగుల సంక్షేమం కోసం పెద్ద సంఖ్యలో పాలసీలు తీసుకున్నాయి. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. ఇందులో 174 శాతం పెరుగుదల నమోదైంది. 2020లో డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన కార్పొరేట్ గ్రూప్ పాలసీల్లో 1.52 లక్షల మందికి మెడికల్ ఇన్సూరెన్స్ ఉండగా ఆ సంఖ్య 2021నాటికి 4.15 లక్షలకు చేరింది. పాలసీలలో పెరుగుదల ఉన్నా, సరాసరి ఇన్సూరెన్సుల విలువ 17 శాతం తగ్గింది. తక్కువ మొత్తం అందించే పాలసీల వైపు వినియోగదారులు మొగ్గు చూపడమే కారణమని సర్వేలో తేలింది. 2020 నవంబర్, డిసెంబర్ లో ఇన్సూరెన్స్ సరాసరి మొత్తం రూ.81.3 లక్షలు కాగా అదే సమయానికి 2021లో రూ.6.93 లక్షలుగా ఉంది. ఎక్కువ మంది ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినా పరిమితిని పాటించినట్లు స్పష్టం చేసింది.
Published by:Veera Babu
First published:

Tags: Health, Insurence

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు