Home /News /business /

HEALTH INSURANCE BEWARE OF MISTAKES IN HOSPITAL FORMS POSSIBILITY OF DIFFICULTIES IN INSURANCE CLAIM GH VB

Health Insurance: హాస్పిటల్ ఫారమ్‌లలో తప్పులతో జాగ్రత్త.. ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చిన్న చిన్న పొరపాట్లు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లను దూరం చేయవచ్చు. కొన్నిసార్లు, ఫుడ్ పాయిజనింగ్ లేదా జ్వరం కారణంగా హాస్పిటలైజేషన్‌(Hospitalisation)కు సంబంధించిన క్లెయిమ్‌లను ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదనే కారణంతో బీమా సంస్థలు తిరస్కరించే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...
చిన్న చిన్న పొరపాట్లు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లను(Health Insurance Claim) దూరం చేయవచ్చు. ఓ వ్యక్తి నవంబర్‌లో(November) అకస్మాత్తుగా ఇంట్లో కుప్పకూలినప్పుడు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి(Hospital) తరలించారు. చిన్న స్ట్రోక్‌ (Stroke) రావడంతో ఇలా జరిగిందని వైద్యులు(Doctors) తెలిపారు. దీంతో కేవలం రెండు రోజులు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. ఇది ఆ కుటుంబానికి ఉపశమనం కలిగించింది. త్వరగా డిశ్చార్జి(Discharge) అవుతున్నందుకు ఆనందించారు. అయితే బీమా(Insurance) సంస్థ అతడు చేసుకొన్న రూ.57,000 హాస్పిటలైజేషన్ క్లెయిమ్‌ను తిరస్కరించింది. ఆ వ్యక్తి ఈ అంశాన్ని సదరు కంపెనీ దృష్టికి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(IRDAI) దృష్టికి తీసుకెళ్లారు.

ఆసుపత్రిలో చేరడం అవసరమా? అని బీమా సంస్థ అడగవచ్చు
కొన్నిసార్లు, ఫుడ్ పాయిజనింగ్ లేదా జ్వరం కారణంగా హాస్పిటలైజేషన్‌(Hospitalization)కు సంబంధించిన క్లెయిమ్‌లను ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదనే కారణంతో బీమా సంస్థలు తిరస్కరించే అవకాశం ఉంది. రోగి పరిస్థితి, అవసరమైన చికిత్సతో సంబంధం లేకుండా రోగి 24 గంటలు ఆసుపత్రిలో ఉంటే, క్లెయిమ్ చెల్లించాల్సి వస్తుందని కొన్ని ఆసుపత్రులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ఎండోస్కోపీలు చేయించుకోవాల్సిన రోగులను 24 గంటల పాటు అడ్మిట్ చేసుకుంటున్న ఉదాహరణలు ఉన్నాయి. అయితే కేవలం వైద్య పరీక్షల కోసం క్లెయిమ్‌లు చెల్లించరు. బీమా సంస్థలు రోగి పరిస్థితి, నివేదికలు, ఇతర ఆరోగ్య పరిమితులను కూడా పరిగణనలోకి తీసుకుంటాయి.

నాన్-నెట్‌వర్క్ ఆసుపత్రులలో చికిత్స
ఆరోగ్య బీమా కంపెనీలు సాధారణ చికిత్సా విధానాల ఛార్జీలకు అంగీకరించిన ఆసుపత్రులతో నగదు రహిత ఒప్పందాలను కుదుర్చుకుంటాయి. అటువంటి ఆసుపత్రులు బీమా సంస్థ నగదు రహిత నెట్‌వర్క్‌లో భాగమవుతాయి, ఇక్కడ బీమా సంస్థలు రోగి-పాలసీ హోల్డర్‌లు తమ జేబుల నుండి చెల్లించాల్సిన అవసరం లేకుండా నేరుగా బిల్లులను సెటిల్ చేస్తారు. ఈ నెట్‌వర్క్ వెలుపల ఉన్న ఆసుపత్రులలో చికిత్స పొందినట్లయితే, ముందుగా బిల్లును క్లియర్ చేసి, ఆపై మీ బీమా సంస్థ నుండి రీయింబర్స్‌మెంట్‌ను క్లెయిమ్ చేయాలి.

Repo Rate: రెపో రేటు మరో 75 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం..? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..


* కస్టమరీ, రీజనబుల్ ఛార్జీలతో నష్టం
పూర్తిగా క్లెయిమ్ తిరస్కరణలే కాకుండా, ఆరోగ్య కవర్‌లలోని 'కస్టమరీ, రీజనబుల్ ఛార్జీలు' నిబంధన కారణంగా కొంతమంది పాలసీదారులు నష్టపోతున్నారు. క్లెయిమ్‌ను సెటిల్ చేస్తున్నప్పుడు, ఆసుపత్రి ఛార్జీలు సహేతుకమైనవో కాదో నిర్ధారించుకునే హక్కు బీమా సంస్థకు ఉందని దీని అర్థం. సాధారణంగా బీమా సంస్థలు క్లెయిమ్ ట్రెండ్‌లు, లొకేషన్ నుండి డేటాను పరిగణనలోకి తీసుకుంటాయి.

* డాక్యుమెంట్స్‌లో క్లరికల్ ఎర్రర్స్
నైనిటాల్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం క్లెయిమ్ తిరస్కరణకు సంబంధించిన విచిత్రమైన కేసును ఎదుర్కొంటున్నారు. అతని చికిత్స, ప్రమాద తేదీని ధ్రువీకరిస్తున్న ఇతర డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ, ఎఫ్‌ఐఆర్, డిశ్చార్జ్ సారాంశం, ఇతర డాక్యుమెంట్‌లు సరైన తేదీని స్పష్టంగా సూచిస్తున్నప్పటికీ, మెడికో-లీగల్ సర్టిఫికేట్‌లోని ఓవర్ రైటింగ్‌పై మాత్రమే బీమా సంస్థ దృష్టి పెట్టింది. దీని కారణంగా క్లెయిమ్‌ను తిరస్కరించింది.

* కోర్టులను ఆశ్రయించవచ్చు
హాస్పిటల్ ఫారమ్స్‌లో తప్పులతో క్లెయిమ్స్ రిజెక్ట్ అయిన సందర్భంలో.. పాలసీదారులు ముందుగా బీమా సంస్థ ఫిర్యాదుల పరిష్కార అధికారికి లేఖ రాయాలి. సంతృప్తికరమైన స్పందన రాకుంటే లేదా కంపెనీ 30 రోజుల్లోగా స్పందించకుంటే, నేరుగా బీమా అంబుడ్స్‌మన్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఆర్డర్ లేదా పరిహారం మొత్తంతో సంతృప్తి చెందకపోతే, వినియోగదారులు కోర్టులను ఆశ్రయించవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Claim, Health Insurance, Hospitalised, Hospitals

తదుపరి వార్తలు