హోమ్ /వార్తలు /బిజినెస్ /

HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం.. కస్టమర్లకు అదిరే శుభవార్త!

HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం.. కస్టమర్లకు అదిరే శుభవార్త!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం.. కస్టమర్లకు అదిరే శుభవార్త!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం.. కస్టమర్లకు అదిరే శుభవార్త!

Fixed Deposit | డబ్బులు దాచుకోవాలని భావించే వారికి హెచ్‌‌డీఎఫ్‌సీ బ్యాంక్ తీపికబురు అందించింది. స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. దీని వల్ల కస్టమర్లకు ఊరట కలుగనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

    HDFC FD Rates | ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా తీపికబురు అందించింది. కస్టమర్లకు ఊరట కలిగే ప్రకటన చేసింది. స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) స్కీమ్ గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. సీనియర్ సిటిజన్స్‌కు దీని వల్ల ఊరట కలుగనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ పేరుతో స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇది సీనియర్ సిటిజన్స్‌కు (Senior Citizens) మాత్రమే వర్తిస్తుంది. 2020 మే 18 నుంచి ఈ పథకం అందుబాటులో ఉంది.

    ఈ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌లో చేరిన సీనియర్ సిటిజన్స్‌కు అధిక వడ్డీ లభిస్తుంది. కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితులు, తక్కువ వడ్డీ రేట్లు కారణంగా బ్యాంక్ సీనియర్ సిటిజన్స్‌కు ఊరట కలిగించేందుకు పలు మార్లు ఈ స్కీమ్ గడువును పొడిగిస్తూ వచ్చింది. సాధారణంగా ఈ స్కీమ్ గడువు సెప్టెంబర్ 30నే ముగిసింది. అయితే బ్యాంక్ మాత్రం మళ్లీ ఈ పథకాన్ని కొనసాగించింది. స్కీమ్‌ గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

    దసరా, దీపావళి ఆఫర్లు.. ఏకంగా రూ.50,000 తగ్గింపు ప్రకటించిన కంపెనీ

    సీనియర్ సిటిజన్స్‌కు అదనపు ప్రీమియం బెనిఫిట్‌ను అందుబాటులో ఉంచినట్లు బ్యాంక్ తెలిపింది. సాధారణంగా సీనియర్ సిటిజన్స్‌కు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 0.5 శాతం అధిక వడ్డీ లభిస్తుంది. స్పెషల్ స్కీమ్‌లో చేరితే ఈ అదనపు వడ్డీకి మళ్లీ అదనంగా 0.25 శాతం వడ్డీ వస్తుంది. రూ.5 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. అలాగే ఐదేళ్లు లేదా ఆపైన టెన్యూర్‌లోని ఎఫ్‌డీలకు మాత్రమే ఈ బెనిఫిట్ ఉంటుంది.

    ఎస్‌బీఐ శుభవార్త.. రూ.40 వేల భారీ తగ్గింపు!

    కేవలం భారతీయ పౌరులకు మాత్రమే ఈ అదనపు వడ్డీ బెనిఫిట్ ఉంటుంది. కొత్తగా ఎఫ్‌డీ అకౌంట్ తెరిచే వారు ఈ అదనపు వడ్డీ ప్రయోజనం పొందొచ్చు. లేదంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లను రెన్యూవల్ చేసుకునే వారికి కూడా ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. కాగా ఈ స్పెషల్ డిపాజిట్ స్కీమ్‌లో చేరిన వారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. మెచ్యూరిటీ కన్నా ముందే డబ్బులు తీసుకుంటే.. అంటే ఐదేళ్ల కన్నా ముందే డబ్బులు విత్‌డ్రా చేస్తే.. అప్పుడు వడ్డీ రేటు 1 శాతం తగ్గుతుంది. అదే ఐదేళ్ల తర్వాత ముందుగానే డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే అప్పుడు వడ్డీ రేటు 1.25 శాతం తగ్గుతుంది.

    అలాగే మరోవైపు ఐడీబీఐ బ్యాంక్ కూడా స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌ను పొడిగించింది. అక్టోబర్ 31 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుందని తెలిపింది. దేశీ అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న ఎస్‌బీఐ కూడా స్పెషల్ డిపాజిట్ స్కీమ్ గడువు పొడిగించింది. ఉయ్ కేర్ డిపాజిట్ పథకం వచ్చే ఏడాది మార్చి వరకు అందుబాటులో ఉంటుంది.

    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Banks, FD rates, Fixed deposits, HDFC bank, Money, Personal Finance

    ఉత్తమ కథలు