HDFC Q1: అదరగొట్టిన హెచ్‌డీఎఫ్‌సీ...46 శాతం పెరిగిన లాభాలు...

క్యూ1 ఫలితాల్లో ఏకంగా 46 శాతం నికర లాభం నమోదు చేసింది. క్యూ1లో హెచ్‌డీఎఫ్‌సీ రూ. 3203 కోట్ల నికర లాభం ఆర్జించగా, గత సంవత్సరం గత సంవత్సరం రూ.2190 కోట్లుగా ఉంది.

news18-telugu
Updated: August 2, 2019, 4:37 PM IST
HDFC Q1: అదరగొట్టిన హెచ్‌డీఎఫ్‌సీ...46 శాతం పెరిగిన లాభాలు...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 2, 2019, 4:37 PM IST
గృహరుణాల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ, హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాల్లో అదర గొట్టే ఫలితాలను నమోదుచేసింది. ట్రేడింగ్ వారాంతంలో ప్రకటించిన క్యూ1 ఫలితాల్లో ఏకంగా 46 శాతం నికర లాభం నమోదు చేసింది. క్యూ1లో హెచ్‌డీఎఫ్‌సీ రూ. 3203 కోట్ల నికర లాభం ఆర్జించగా, గత సంవత్సరం గత సంవత్సరం రూ.2190 కోట్లుగా ఉంది. ఇక నికర వడ్డీ ఆదాయం సైతం 42.9 శాతం వృద్ధి చెంది రూ.3129 కోట్లుగా నమోదైంది. పెట్టుబడుల ద్వారా రూ. 1894 కోట్ల లాభం ఆర్జించింది. ఈ ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ షేరు 2 శాతం లాభంతో కొనసాగుతోంది. అలాగే కంపెనీ లోన్ బుక్ సైతం 11.2 శాతం వృద్ధి చెంది రూ.4.16 లక్షల కోట్లకు చేరింది. అలాగే నికర ఎన్పీఏలు సైతం కొద్ది మేర పెరగగా, 1.22 నుంచి 1.29 శాతానికి చేరింది.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...