Home /News /business /

HDFC NET BANKING FOLLOW THESE SIMPLE STEPS TO UPDATE MOBILE NUMBER AND PASSWORD SS

HDFC Net Banking: హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్ ఉందా? మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయండిలా

HDFC Net Banking: హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్ ఉందా? మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయండిలా
(ప్రతీకాత్మక చిత్రం)

HDFC Net Banking: హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్ ఉందా? మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)

HDFC Net Banking | మీ లావాదేవీల వివరాలన్నీ మీ మొబైల్ నెంబర్‌కు అలర్ట్స్ వస్తుంటాయి. ఒకవేళ అలర్ట్స్ రాకపోతే నెట్ బ్యాంకింగ్ పేజీలో మీ మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయాలి. ఎలాగో తెలుసుకోండి.

    మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశారా? అయితే మీరు నెట్ బ్యాంకింగ్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తే మీరు ప్రతీ పనికి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కస్టమర్లకు అనేక రకాల ఫీచర్లతో నెట్ బ్యాంకింగ్ సేవల్ని అందిస్తోంది హెచ్‌డీఎఫ్‌సీ. అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, చివరి లావాదేవీల వివరాలు తెలుసుకోవడం, క్రెడిట్ కార్డు వివరాలు చూసుకోవడం లాంటివన్నీ నెట్ బ్యాంకింగ్ ద్వారా సాధ్యం. ఇందుకోసం మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ఇంతే కాదు... బిల్లులు చెల్లించడం, డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం, మొబైల్ నెంబర్లకు రీఛార్జ్ చేయడం లాంటివి కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా సాధ్యమే. ఇక బ్యాంకు మీకు ఆఫర్ చేసే లోన్ల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. మీ లావాదేవీల వివరాలన్నీ మీ మొబైల్ నెంబర్‌కు అలర్ట్స్ వస్తుంటాయి. ఒకవేళ అలర్ట్స్ రాకపోతే నెట్ బ్యాంకింగ్ పేజీలో మీ మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయాలి. ఎలాగో తెలుసుకోండి.

    ముందుగా మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. మీ కస్టమర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి. మీరు సరైన వివరాలతో లాగిన్ అయిన తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ నెట్ బ్యాంకింగ్ పేజీ ఓపెన్ అవుతుంది. మీ ఇమెయిల్ ఐడీ, ల్యాండ్‌లైన్ నెంబర్ అప్‌డేట్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ వివరాలు వెరిఫై చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫామ్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ 24 గంటల్లో అప్‌డేట్ అవుతుంది. ఒకవేళ మీ నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ మార్చాలన్నా ఇవే స్టెప్స్ ఫాలో కావాలి. మీ మొబైల్ నెంబర్‌తో పాటు డెబిట్ కార్డు వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. వెరిఫై చేసిన తర్వాత పాస్‌వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు.

    ఇవి కూడా చదవండి:

    Pan Card: పాన్ కార్డ్ కావాలా? 10 నిమిషాల్లో ఫ్రీగా తీసుకోండి ఇలా

    Arogya Sanjeevani: సామాన్యుల కోసం సరికొత్త హెల్త్ ఇన్స్యూరెన్స్... ఏప్రిల్ 1న ప్రారంభం

    Post Office Account: పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉందా? ఈ రూల్స్ మారాయి
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank, Bank account, Banking, Hdfc, HDFC bank

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు